విడదల రజినీకి షాక్ ఇచ్చిన జగన్‌...!

On
విడదల రజినీకి షాక్ ఇచ్చిన జగన్‌...!

విడదల రజినీ... తెలుగు రాజకీయాల్లో పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికపైన సైబరాబాద్‌లో మీరు నాటిన మొక్కను సార్‌ నేను అంటూ చంద్రబాబుపైన పొగడ్తల జల్లు కురిపించిన రజిని... సరిగ్గా ఏడాదికే వైసీపీలో చేరిపోయారు. సీనియర్లను కాదని ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకున్నారు. అనతి కాలంలోనే పార్టీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న రజినీ... సోషల్‌ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌ కూడా. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉంది. ఇక మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో మంత్రిపదవి కూడా పొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రజినీని మంత్రి పదవి వరించడం వెనుక వైసీపీలో నెంబర్‌ టూ స్థాయి వ్యక్తి లాబీయింగ్‌ ఉందనే పుకార్లు పెద్ద ఎత్తున షికారు కూడా చేశాయి. 

చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి సీనియర్‌ నేత, రాజకీయ గురువు ప్రత్తిపాటి పుల్లారావుపై ఘన విజయం సాధించిన విడదల రజినీకి జగన్‌ గట్టి షాక్ ఇచ్చారు. సరిగ్గా ఎన్నికలకు ఐదు నెలల ముందు రజినీని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. టీడీపీ కంచుకోటగా గుర్తింపు తెచ్చుకున్న గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో గెలవాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. అందుకే అప్పట్లో కార్యాలయంపై దాడి చేశారని... తనపై హత్యాయత్నానికి ప్రయత్నించారంటూ హడావుడి చేశారు కూడా. అదే సమయంలో తన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ వైసీపీ నేతలే బహిరంగంగా ఆరోపణలు చేయడంతో.. రజినీ ఒక్కసారిగా సైలెంట్‌ అయ్యారు. బీసీ కార్డు ద్వారా ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమించినప్పటికీ... పెద్దగా ఫలితం చూపించలేదు.

ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్‌గా ఉన్నారు. ఒకదశలో రజినీ కూడా పార్టీ మారుతారనే మాట బలంగా వినిపించింది. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని బుజ్జగించే బాధ్యతలను విడదల రజినీకే జగన్ అప్పగించారు. అందుకోసం రజినీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక మొన్నటి ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన కావలి మనోహర్‌ నాయుడు ఓడిన తర్వాత అడ్రస్‌ లేకుండా పోయారు. దీంతో చిలకలూరిపేట నియోజకవర్గం ఇంఛార్జ్‌ బాధ్యతలను విడదల రజినీకి మరోసారి అప్పగించారు జగన్‌. వాస్తవానికి రజినీకి చిలకలూరిపేటలో మంచి పేరు లేదు. భూ కబ్జా ఆరోపణలతో పాటు స్థానిక క్యాడర్‌తోనే సఖ్యత లేదు. అందుకే రజినీని గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గానికి జగన్‌ మార్చారు. అయితే ఇప్పుడు మళ్లీ చిలకలూరిపేట బాధ్యతలు అప్పగించడంతో స్థానిక నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రజినీని మార్చకపోతే... తామంతా మారిపోతామని జగన్‌కు అల్టిమేటం జారీ చేశారు.

Screenshot_2024-10-20-09-39-17-80_99c04817c0de5652397fc8b56c3b3817

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

జ్వాలాతోరణం విశిష్టత తెలుసా...? జ్వాలాతోరణం విశిష్టత తెలుసా...?
యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి, వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ...
కొచ్చర్లకోట శివాలయానికి పోటెత్తిన భక్తులు 
గిద్దలూరు ను వణికిస్తోన్న ట్రాఫిక్ భూతం..!
వాగు కాదు... రహదారే..!
వైకాపా అధినేత జగన్ ను కలిసిన గంజివారిపల్లి సర్పంచ్ 
మల్లన్న సేవలో మాజీ ఎమ్మెల్యే అన్నా దంపతులు
బయోగ్యాస్ కంపెనీ కోసం భూముల పరిశీలన