Category
Stories
Stories  State 

డిల్లీ అసెంబ్లీ రద్దు: మధ్యంతర ఎన్నికలు ఫిక్స్..!!

డిల్లీ అసెంబ్లీ రద్దు: మధ్యంతర ఎన్నికలు ఫిక్స్..!! న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఇంకో రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేయబోతోన్నట్లు వెల్లడించారు.ప్రజలు మళ్లీ కొత్తగా ఓటు ద్వారా తీర్పు ఇచ్చేంత వరకూ తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబోననీ తేల్చి చెప్పారు. ప్రజలు ఎలాంటి తీర్పును ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటానని, శిరసా వహిస్తానని అన్నారు. *ఎన్నికల తరువాతే..* ప్రస్తుతం ఆయన ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికలను నిర్వహించిన తరువాతే తాను ముఖ్యమంత్రిగా ఆ సీటులో కూర్చుంటానంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిజ్ఞ చేశారు. *బెయిల్ తరువాత..* ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు బెయిల్ లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. *మనీలాండరింగ్ ఆరోపణలు..* ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు అరవింద్ కేజ్రీవాల్. సుమారు ఆరు నెలల పాటు తీహార్ జైలులో గడిపారు. బెయిల్ కోసం గతంలో చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఢిల్లీలోని రోస్ అవెన్యూ న్యాయస్థానం ఆయన బెయిల్ పిటీషన్లను ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చింది. చివరికి బెయిల్ కోసం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. *బెయిల్ తరువాత తొలిసారి..* బెయిల్ లభించిన రోజు రాత్రే తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మంత్రి ఆతిషీ, ఎంపీ సంజయ్ సింగ్, ఇతర నాయకులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వీట్లు పంచిపెట్టారు. బాణాసంచా కాల్చారు. *సచ్ఛీలత నిరూపించుకుంటా..* తాజాగా ఆయన పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. మద్యం పాలసీ కుంభకోణం, మనీలాండరింగ్ వంటి లేనిపోని ఆరోపణలు చేశారని, వాటిల్లో ఏ ఒక్కటి కూడా నిరూపితం కాలేదని అన్నారు. *కొత్త సీఎం ఎన్నిక..* బీజేపీ నాయకులు చేసినవన్నీ కూడా ఆరోపణలే అనే విషయాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని కేజ్రీవాల్ అన్నారు. అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతోన్నానని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. తాను నిజాయితీపరుడినని ప్రజలు భావిస్తే ఓటు వేస్తారని, అప్పుడే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని అన్నారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది రెండు మూడు రోజుల్లో నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
Read More...
Stories 

దేశం గర్వించదగ్గ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

దేశం గర్వించదగ్గ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశంలో ఎందరో మహానుభావులు జన్మించారు. జీవితాంతం సమాజం కోసం, దేశం కోసం పని చేశారు. అలాంటి కారణజన్ముల్లో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒకరు. జలవనరుల శాఖ లో సుప్రసిద్ధ ఇంజనీర్ గా గుర్తింపు పొందారు. కర్నాటకలో కృష్ణ రాజ సాగర్ డ్యాం నిర్మాణం ద్వారా ఆ ప్రాంతంలో వరదలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా బెంగళూరు నగరానికి తాగునీటి సమస్య తీర్చారు. దేశం పట్ల ధర్మనిష్ట తో పనిచేసిన విశ్వేశ్వరయ్య గారి జయంతి సెప్టెంబర్ 15. వారి పూర్వీకులు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. ఇక్కడ నుండి కర్నాటక రాష్ట్రంలో ఉన్న చిక్ మంగుళూరు కి పూర్వీకులు వలస వెళ్లారు.
Read More...
Stories  State 

అదానీకి బిగ్ షాక్!

అదానీకి బిగ్ షాక్! గత కొంతకాలంగా భారత బిలీయనీర్ గౌతమ్ అదానీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కొత్త కొత్త రిపోర్టులను విడుదల చేస్తోన్న అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్ తాజాగా మరో బాంబు పేల్చింది. 2021 నాటికే అదానీపై మనీలాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీ విచారణలో భాగంగా స్విస్ అధికారులు.. అదానీ గ్రూప్‌కు చెందిన అనేక స్విస్ బ్యాంక్ అకౌంట్లలలో జమ చేసిన 310 మిలియన్ డాలర్లకు పైగా అంటే మన కెరెన్సీలో 2600 కోట్ల రూపాయల పైనే స్తంభింపజేసినట్లు హిండెన్‌బర్గ్ సోషల్ మీడియాలో ద్వారా ప్రకటించింది. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ , మారిషస్, బెర్ముడాలో వివాదాస్పద నిధులలో అదానీ అనుబంధ సంస్థ ఎలా పెట్టుబడి పెట్టిందనే దానిపై ప్రాసిక్యూటర్లు సమాచారాన్ని అందించారని చెప్పారు. స్విస్ క్రిమినల్ కోర్టు రికార్డుల ఆధారంగా ఈ సమాచారాన్ని అందిస్తున్నట్లు హిండెన్ బర్గ్ తెలిపింది. అయితే అదానీ గ్రూప్‌కి ఎలాంటి స్విస్ కోర్టు ప్రొసీడింగ్స్‌తో సంబంధం లేదని అదానీ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ కంపెనీకి సంబంధించిన ఏ అకౌంట్ కూడా జప్తు చేయబడలేదని.. తమ విదేశీ హోల్డింగ్ నిర్మాణం పూర్తిగా పారదర్శకంగా, చట్టానికి అనుగుణంగా ఉంటుందని అదానీ గ్రూప్ తెలిపింది. ఇది తమ  ప్రతిష్టను, మార్కెట్ విలువను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నమని తెలిపింది.
Read More...
Stories  State 

బాబు తో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్

బాబు తో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్ అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒక వైపు వరదలతో ఏపీలో లోని చాలా ప్రాంతాలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో అనేక  మంది రాజకీయ నాయకులు, సినిమా రంగంలోని ప్రముఖులు, మిగతా రంగాలకు చెందని వాళ్లు కూడా వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలకు తమ వంతుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు సహాయం అందించారు. ఈ క్రమంలో ఇటీవల జూనియర్ ఎన్టీఆర్.. ఏపీలోని వరదల నేపథ్యలో.. సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షలను ప్రకటించారు. దీనిలో భాగంగానే ఈరోజు అమరావతిలోని సెక్రెటెరియట్ కు చేరుకుని చెక్ అందించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు  రామ్ చరణ్ కూడా రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చంద్రబాబుతో భేటీ కానుండటం మాత్రం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్, టీడీపీ పార్టీకి అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. ఒకనొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ మరోపార్టీలోకి వెళ్తున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరిగింది.ఈ క్రమంలో.. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు అయి యాభైకన్నా.. ఎక్కువ రోజులు జైలులో ఉన్నారు. అంతేకాకుండా.. నారాభువనేశ్వరీ పట్ల.. గత ప్రభుత్వం వైస్సార్సీపీ అవహేళగా మాట్లాడినగా మాట్లాడిన ఘటనలో చంద్రబాబు  కన్నీళ్లను సైతం పెట్టుకున్నారు. అయితే.. ఈ ఘటనల్లో జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ గానే ఉన్నారు. కనీసం..దీనిపై ఎలాంటి రెస్సాన్స్ ఇవ్వక పోవడం అప్పట్లో చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో జూనియర్ 2009 ఎన్నికల సమయంలో.. చంద్రబాబుకు, పార్టీకి ఫుల్ సపోర్ట్ గా ప్రచారం నిర్వంచారు. కానీ ఆ తర్వాత మాత్రం టీడీపీ మాత్రం.. జూనియర్ ఎన్టీఆర్ ను పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆరోపణలు ఉన్నాయి.  దీంతో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారంట. అంతే కాకుండా.. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ ను సైతం..పదవులు ఇస్తామని చంద్రబాబు వాడుకున్నరంటూజోరుగా ప్రచారంలో ఉంది. కానీ ఒకసారి మాత్రం.. ఎంపీగా రాజ్యసభకు టీడీపీ పంపింది. అదే విధంగా.. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు కూడా.. చంద్రబాబు రాజకీయాలు చేశారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్ కేటీఆర్.. దీనిపై చంద్రబాబు.. నందమూరి హరికృష్ణ భౌతిక కాయం ప్రదేశంలోనే.. పొత్తుల గురించి మాట్లాడరని కూడా కేటీఆర్ అప్పట్లో వ్యాఖ్యలు చేయడం కూడా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కూకట్ పల్లి నుంచి నందమూరి హరికృష్ణ కూతురు..సుహాసినిని.. గతంలో ఎన్నికల బరిలో నిలిపి కూడా అక్కడ కూడా... సింపతీతో రాజకీయాలు చేశారని కూడా వివాదంఉంది. ఈ క్రమంలో తండ్రికి జరిగిన అన్యాయం, చంద్రబాబు రాజకీయ వ్యూహాలతోనే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకీ దూరంగా ఉన్నారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ  జూనియర్ ఎన్టీఆర్ తన తాత పెట్టిన పార్టీని వదలి మరోపార్టీలోకి వెళ్లనని కూడా పలు మార్లు క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా, నందమూరి హరికృష్ణ సినిమా రంగంలో యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో జరిగిన కార్యక్రమానికి సైతం.. జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి  ఆహ్వానం రాలేదు. దీంతో నందమూరి ఫ్యామీలీ, టీడీపీ పార్టీ రాజకీయాలు తెగ హాట్ టాపిక్ గా మారాయి.  ఇటీవల మోక్షజ్ఞ తెరంగేట్రం చేశారు. దీనిపై మాత్రం జూనియర్ రెస్పాండ్ అయ్యారు. మోక్షజ్ఞకు ప్రత్యేకంగా  ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్.. చంద్రబాబుతో భేటీకానుడటం  రెండు తెలుగుస్టేట్స్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై చంద్రబాబు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో మాత్రం తెలియాల్సి ఉంది.
Read More...
Stories 

గట్‌ మైక్రోబయోమ్‌ అంటే?

గట్‌ మైక్రోబయోమ్‌ అంటే? శరీరంపై ప్యాచ్‌లు పెట్టడం ద్వారా ఒంట్లోని షుగర్‌ స్థాయులను గంటగంటకూ పరీక్షించుకునే కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.సాధారణ ఆహారం తిన్నామనుకోండి.. గంటలో షుగర్‌ పెరుగుతుంది. తిరిగి 2-2.30 గంటల్లో షుగర్‌ స్థాయులు కిందకు వస్తాయి. మళ్లీ ఆకలేస్తుంది.ఒకవేళ తీపి పదార్థాలు తింటే.. షుగర్‌ స్థాయులు ఒక్కసారిగా పెరిగిపోతాయి. 2 గంటల్లో తగ్గిపోయి.. మళ్లీ ఆకలి అవుతుంది. ఈ రెండూ కాకుండా పీచు పదార్థాలున్న ఆహారం తీసుకుంటే.. షుగర్‌ ఎక్కువగా పెరగదు. రెండు గంటల వరకు ఒకే స్థాయిలో గ్లూకోజ్‌ నెమ్మదిగా విడుదలవుతోంది. చాలామంది అరటిపండులో షుగర్‌ ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. కానీ, అందులో పీచు ఎక్కువగా ఉండడం వల్ల షుగర్‌ నెమ్మదిగా విడుదలవుతుంది. మూణ్నాలుగు గంటల తర్వాత గానీ మళ్లీ ఆకలి వేయదు.షుగర్‌ ఒక్కటే ముఖ్యం కాదు.. పీచుతో పాటు ఉన్న షుగరా? పీచు లేని షుగరా? ఏది తింటున్నామన్నది ముఖ్యం.గట్‌ మైక్రోబయామ్‌ మెటా జీనోమిక్స్‌’ పరీక్ష ద్వారా మంచి, చెడు బ్యాక్టీరియాల గురించి తెలుసుకోవచ్చు.
Read More...
Stories  State 

నేడు..డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం)

నేడు..డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం) మట్టిలో మాణిక్యాలను వెలికితీసి రత్నాలుగా మలిచేది, బండరాయిని రమణీయమైన శిల్పా లుగా చెక్కేది... అజ్ఞాన తిమిరంలో విజ్ఞాన జ్యోతులు వెలిగించేది... సమాజ స్థితిగతులను అధ్యయనం చేసి నవతరానికి ప్రగతిబాటను పరిచేది... ఒక్క ఉపాధ్యాయుడే. అందుకే ఆయనకు అంతటి గౌరవం. గురువుగా అత్యున్నత పీఠం. తన శిష్యులను ఉన్నత శిఖరాలకు నడిపించి... తాను మాత్రం నేలపైనే వుండి వారి ఎదుగుదలకు సోపాన మౌతాడు. మార్గదర్శకమౌతాడు. కొండలలో ఉన్న బండ రాళ్ళను శిల్పి తన చాక చక్యం తో చెక్కి , తన కళా నైపుణ్యంతో  తీర్చిదిద్ది దేవతా శిల్పాలను తయారు చేస్తాడు అలాగే  బండరాళ్ల లాంటి విద్యార్థులను, శిల్పి లాంటి ఉపాధ్యాయుడు , తన భోదన లాంటి నైపుణ్యంతో  తీర్చిదిద్ది సుగుణ మూర్తులుగా తయారు జేస్తాడు. నిజమైన సమర్ధవంతమైన మంచి గురువులు ఎవరంటే మనలని ఆలోచింప చేసేవారు, మన ఆలోచనాశక్తిని పెంపొందించే వారు. సాదారణ ఉపాధ్యాయుడు కేవలం పాఠం చెబుతాడు, మంచి ఉపాధ్యాయుడు పాఠాన్ని వివరిస్తాడు , ఉత్తమ ఉపాధ్యాయుడు ఉదాహరణలతో భోదిస్తాడు , గొప్ప ఉపాధ్యాయుడు విద్యార్థి లో నిగూడంగా దాగి ఉన్న శక్తులను వెలికి తీసి, అతని మూర్తిమత్వాన్ని అభివృద్ది చేయుటలో ఉత్తేజ పరుస్తాడు.  వెలుగుతున్న దీపమే మరిన్ని దీపాల్ని వెలిగిస్తుంది. అలాగే ఎల్లప్పుడూ నేర్చుకునే వారే ఇతరులకు నేర్పగలరు. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ. దీనిలో నిమగ్నమైనవారు మాత్రమే ఇతరులకు నేర్పగలరు. బోధించగలరు. కేవలం పాఠ్యాంశాల్ని మాత్రమే కాదు, జీవితంలోని సమస్త అంశాల్ని బోధించడం ఉపాధ్యాయుల కర్తవ్యం. ఏ దశలోనూ సిలబస్‌కే పరిమితం కావడం సరి అయిన ఉపాధ్యాయుడి  లక్షణం కాదు. విషయం ఏదైనా చుట్టూ ఉన్న సమాజంతో, దాని నడవడికతో అనుసంధానిస్తూ చెప్పడంలోనే బోధనాకళ ఇమిడివుంది. దీనిని అర్థం చేసుకుని బోధనాభ్యసన కార్యక్రమం నిర్వహించడం ఉపాధ్యాయుల అంకితభావం మీద ఆధారపడి వుంది. ఎందుకంటే బోధన వృత్తి మాత్రమే కాదు, అదొక జీవనవిధానం. సున్నితమైన పిల్లల ప్రపంచాన్ని ప్రభావితం చేసే సంవిధానం. శిల్పి కన్నా, వజ్రాలను సానబెట్టే వాడి కన్నా ఉపాధ్యాయుల పని అత్యంత సున్నితత్వంతో కూడుకొని వున్నది. అతడు ప్రాణం కలిగిన, చైతన్యశీలురైన పిల్లలతో సంబంధం కలిగి వున్నాడు.అందుకే మన సమాజంలో గురువుకు అధిక ప్రాదాన్యత ఇచ్చారు. గురువును దైవంతో పోల్చారు. తల్లిదండ్రులు జన్మనిస్తే అతడికి విద్యా బుద్దులు నేర్పి సమాజంలో ఒక ఉన్నత స్థానం అందించే బాధ్యత గురువు తీసుకున్నాడు. కాబట్టి గురువుకు అంత ప్రాదాన్యత. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమఃఅటువంటి గురువుకి ఒక రోజు కేటాయించడ మైనది.అదే జాతీయ ఉపాధ్యాయ  దినోత్సవం.  డా. సర్వేపల్లి రాధాకృష్ణన్   భారతదేశపు  మొట్ట మొదటి  ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి కూడా. అంతేకాదు భారతీయ తాత్విక చింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టినాడని విశేషమైన పేరు .. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలం అయిన  చైనా, పాకిస్తానులతో యుద్ధ సమయంలో   ప్రధానులకు మార్గనిర్దేశం చేసిన మహానుబావుడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున దేశం మొత్తం ఆయనను స్మరిస్తూ, ఆయన ఘన చరితలను కీర్తిస్తూ, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన వారిని గౌరవిస్తూ, వారు చేసిన సేవలను కొనియాడుతూ వారి జ్ఞాపకార్థంగా దేశం మొత్తం  జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం నిజంగా ఉపాధ్యాయులకు ఆయన ఇచ్చిన వరం గా పేర్కొనవచ్చు. సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5, 1888 మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు. వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్. వారి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యము మరియు విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి మరియు తిరుపతిలోనే గడిచిపోయాయి. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. అతడేమీ సంపన్నుల కుటుంబం నుండి రాలేదు. అతి సాదారణ స్థాయి నుండి అసాదారణ స్థాయి కి ఆయన ప్రయాణం మనకందరికీ ఆదర్శం. భోజనం చేసేందుకు అరిటాకు కూడా కొనలేని పరిస్థితుల్లో ఆయన నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంటే అతని దీన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆయన ఎంతో కష్టపడి దేశ అత్యున్నత స్థానానికి చేరడం ఎంతో గొప్పదనం. అధ్యాపకుడిగా, వైస్‌ ఛాన్సలర్‌గా, దౌత్యవేత్తగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఆయన సేవలు నిరుపమానం, అనితరసాధ్యం. ఆయన అధిరోహించిన శిఖరాలు ఆయన జీవితంలోని అసాధారణ కోణాలను మనకు వెల్లడి చేస్తాయి. రాధాకృష్ణన్‌ బాల్యం నుంచే అసాధారణమైన తెలివితేటలు కనబరిచేవారు. ఆయన తెలివితేటలకు ఉపాధ్యాయులు ముగ్ధులయ్యేవారు. విద్యార్ధిగా వున్నపుడే మనస్తత్వశాస్త్రంపై బాగా అధ్యయనం చేసి ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకునేవి.  21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో  ప్రొఫెసర్ అయ్యాడు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని  మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్.వి.నంజుండయ్య అతనిని పిలిపించి ప్రొఫెసర్ గా నియమించాడు. ఆయన ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ ఠాగూర్ లు కోరారు. వారి ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్లారు. అప్పుడే ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది.  కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు ఆయన ్టభారతీయ తత్వశాస్త్రం” అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది. 1946లో ఏర్పడిన  భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు.  1949 లో భారతదేశం లో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్. 1954 లో మానవ సమాజానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు.  డా.రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్ఠాత్మక సర్ బిరుదు ఈయనను వరించింది.  రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. ఆయన మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్‌గా వెళ్లేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి తమ గురువును కూర్చోబెట్టి రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, అసలు గురువు ఎలా ఉండాలో ఆయన స్పష్టంగా వివరించారు. కేవలం ఒక్క గురువులకే కాక సమాజానికే ఆదర్శంగా, ఉన్నతంగా జీవించి ఆడర్శప్రాయుడయ్యాడు. ఆయన దృష్టిలో చదువంటే విద్యార్థులకు ప్రేమ, స్నేహ స్వభావాలను, సుగుణాలను పంచాలి. పిల్లలు ఉపాధ్యాయుని చూసి భయపడ రాదు. దగ్గరికి చేరాలి. అంతటి ఉపాధ్యాయవృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం. నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు. ఎదుటివారికి బోధించటం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనసా వాచా నమ్మిన వ్యక్తి సర్వేపల్లి. ఆయన దృష్టిలో ఉపాధ్యాయుడి బాధ్యత ఎప్పుడూ గురుతరమైనదే. రాధాకృష్ణన్ గారిని గుర్తు చేసుకోవడం మనలను మనం గౌరవించు కోవడమే. ఆయన  అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి కి చెందిన యునెస్కో విభాగానికి మన దేశంనుండి  రాయబారిగా ఉన్నారు.  మన దేశానికి అంబేద్కర్ గారి తో పాటు రాజ్యాంగాన్ని రచించారు. మహామేధావిగా, గొప్పవ్యక్తిగా, గొప్ప గ్రంథకర్తగా, తత్వవేత్తగా, ప్రపంచ దేశాల గౌరవాలను అందుకున్నారు. ఆయన రాసిన హిందూ మత  వేదాంతం లోని విలువలు అనే పరిశోధనాంశాన్ని ఆయన తో పాటు పనిచేసే బ్రిటిష్ ప్రొఫెసరులు ఎంతో మెచ్చు కొన్నారు.  ఆ కాలంలో మన దేశం గురించి మన హిందూ మతము గురించి తెల్లవాళ్ళల్లో ఉన్న అపోహలన్నీ తొలగించి, మన గౌరవాన్ని కాపాడారు. ఆయన చాలా గొప్ప వేదాంతి, వాక్పటిమ కలిగిన వారు, మంచి మనిషి. మరి ఇంకా ఇరవైయ్యవ శతాబ్దంలోని విద్యావేత్తలలో మేధావులలోను అంతులేని కీర్తి సాధించారు.  రాధాకృష్ణన్ గారు రాజకీయాలలో అంత పాల్గొన లేకపోయినా శాంతియుతంగా విద్యాపరంగా ఎంతో సేవ చేశారు.   తత్వవేత్తలుగా ప్రసిద్ధి చెందిన వారెవరూ రాధాకృష్ణన్‌ పనిచేసినన్ని రంగాల్లో ప్రవేశించి ఉండరు. ఆయన పాలనాదక్షుడు, రాజనీతిజ్ఞుడు, అన్నింటినీ మించి.. ప్రాచ్య పాశ్చాత్య దేశాల్లో భారతీయ సంస్కృతికి ప్రతినిధిగా వ్యవహరించగలిగిన ప్రజ్ఞాపారాయణుడు. ఏ పనిలోనైనా నిబద్ధత కలిగి ఉండాలని ఆయన జీవితం మనకు పాఠం చెబుతుంది. సర్వేపల్లి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. సర్వేపల్లిది కొని తెచ్చుకున్న గౌరవం కాదు. అతడి గొప్పదనాన్ని చూసి వచ్చిన  గౌరవం, అది వృత్తి రీత్యా, వ్యక్తిత్వ రీత్యా, సంస్కార రీత్యా ఆయణ్ని వరించింది. ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు సర్వేపల్లిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1954 లో భారతరత్న పురస్కారం దక్కింది. అయినా ఏనాడూ ఆడంబరాలకు పోలేదు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం 25 శాతం తీసుకుని మిగతాది ప్రధాన మంత్రి సహాయ నిధికి తిరిగిచ్చేవారు. రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. ఈ రోజు ప్రభుత్వ, ప్రైవేటు, చిన్నా, పెద్దా అని చూడకుండా వారి వారి స్థాయిలో  పాఠశాలలకు, కళాశాలలకు  ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఎంపికచేసి వారికి మండల , జిల్లా ,రాష్ట్ర , జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడం జరుగుతున్నది. ఆయన పుణ్యమాని ఉపాధ్యాయులూ ఈ సమాజంలో గౌరవ పురస్కారాలు అందుకునే స్థాయికి వచ్చారు. ఉపాధ్యాయ వర్గం మొత్త రాధాకృష్ణన్ గారికి సర్వదా ధన్యవాదాలు తెలుపవలసి ఉంది.  కాళంరాజు వేణుగోపాల్  ఉపాధ్యాయుడుజడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, మార్కాపురం. సెల్: 8106204412
Read More...
Stories 

టీడీపీలో వారిదే పెత్తనమా....?

టీడీపీలో వారిదే పెత్తనమా....? అమరావతి: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. నేతలంతా సంబరపడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఏకంగా 136 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అయితే గెలిచిన తర్వాత పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు మొదట్లోనే చెప్పిన మాటలను నేతలంతా పెడచెవిన పెట్టేసినట్లే తెలుస్తోంది. ఐదేళ్లుగా నేతలంతా అధికారం కోసం ఎన్నో పాట్లు పడ్డారు. ఇంకా చెప్పాలంటే... రెండేళ్ల పాటు గత వైసీపీ ప్రభుత్వం చేతిలో ఎన్నోసార్లు ఇబ్బందులు కూడా పడ్డారు. కొందరు నేతలు ఆర్థికంగా కూడా నష్టపోయారు. పార్టీ గెలిచిన తర్వాత పనులు చేసే అవకాశం దొరికిందని కొందరు నేతలు భావిస్తున్నారు. అయితే కొందరు కిందిస్థాయి కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యేల చుట్టూ ఉందే మందిమార్భాలం వల్ల ఇప్పుడు పార్టీకి చెడ్డపేరు వస్తుంది కూడా. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్యేకు చెందిన పీఏ సత్యనారాయణ తీరుపై స్థానిక టీడీపీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఎంతో కాలంగా ఎమ్మెల్యే దగ్గరే కొలువు చేస్తున్న సత్యనారాయణ... అన్ని రకాల వ్యాపారాల్లో వాటాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేతలతో కలిసి ఇసుక అక్రమ రవాణా, మద్యం వ్యాపారాలు చేశారంటున్నారు టీడీపీ నేతలు. ఇక ఎమ్మెల్యేను కలవాలంటే... ముందుగా సత్యనారాయణ అనుమతి కావాల్సిందే. పార్టీ కోసం ఎన్నికల్లో ఎంతో కష్టపడి పనిచేసిన నేతలకు కూడా ఎమ్మెల్యే దర్శన భాగ్యం కలగటం లేదంట. కాదు కూడదంటే... మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడో, లేదంటే ఏదైనా సమావేశం జరిగినప్పుడో ఆయనతో తమ సమస్యలు మొరపెట్టుకుంటున్నారు తప్ప... ఎమ్మెల్యే కార్యాలయంలో మాత్రం కలిసే అవకాశం దొరకటం లేదంటున్నారు నేతలు, కార్యకర్తలు. ఇలాంటి పీఏను ఎమ్మెల్యే తొలగించకపోతే పార్టీతో పాటు, ఆయన వ్యక్తిగతంగా తీవ్రంగా నష్టపోతారని సీనియర్ ఎమ్మెల్యేకు సూచిస్తున్నారు. ఇక పల్నాడు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పీఏపైన అయితే కావాల్సినన్ని ఆరోపణలు. తొలిసారి గెలిచిన సదరు ఎమ్మెల్యేకు ఆయన పీఏనే ఇప్పుడు సర్వస్వం. చివరికి కొడుకు, కూతుర్ని కూడా ఎమ్మెల్యే పక్కన పెట్టేశారంట. ఇదేంటయ్యా అంటే... పీఏ మాటే వేదం అంటున్నారు కిందిస్థాయి కార్యకర్తలు. ఎవరైనా మీడియా మిత్రులు వెళ్లినా కూడా ఎమ్మెల్యేను కలవటం సాధ్యం కావటం లేదు. అదేంటంటే... సార్ బిజీ అనేస్తున్నాడట సదరు పీఏ. గతంలో పోటీ చేసిన ఓడిన తర్వాత... ఐదేళ్ల పాటు అన్నా... మీరు లేకపోతే మేము లేమన్నా అన్న ఎమ్మెల్యే... ఇప్పుడు కనీసం ద్వితీయశ్రేణి నేతలను కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి తిరుమల శ్రీవారి దర్శనం కోసం లేఖ కావాలని అడిగితే... అస్సలు ఖాళీ లేవు... అనేస్తున్నాడట. కానీ లేఖలను బయట విక్రయిస్తున్నాడనే మాట బలంగా వినిపిస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు... వైద్యం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ సాయం చేసిన సదరు ఎమ్మెల్యే గారు... ఇప్పుడు మాత్రం పీఏ చెప్పిన వారికి మాత్రమే పనులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ప్రకాశం జిల్లా కు చెందిన ఓ ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. గెలిచింది రెండో సారే అయినా సరే... పార్టీలో సీనియర్ నేతలను ఏ మాత్రం లెక్క చేయడం లేదు అని, ఇదే ఆఖరు  అన్నట్లుగా సంపాదన పైన దృష్టి పెట్టారట. ఎమ్మెల్యే పేరు చెప్పుకుని... ఆయన వారసులు కావాల్సినంత దోపిడీలు చేస్తున్నారంటున్నారు. ఇక పశ్చిమంలో... త్వరలో జిల్లా కేంద్రం అవుతుందనే మాటతో ఊరి చుట్టూ రియల్టర్లు వెంచర్లు వేసేశారు. గతంలో వేలల్లో ఉన్న స్థలాల ధరలు ఇప్పుడు లక్షలకు చేరుకున్నాయి. దీంతో వెంచర్లకు కావాల్సిన మట్టిని ఊరి చెరువు నుంచి తోలేస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి జేసీబీలు, ప్రొక్లెయిన్లతో తవ్వకాలు చేపడుతూ ట్రాక్టర్లతో మట్టి తరలిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా తెల్లవార్లు జరుగుతున్నప్పటికీ... అధికారులు మాత్రం కనీసం కన్నెత్తి కూడా చూసే ధైర్యం చేయటం లేదు. అందుకు కారణం.. ఈ మట్టి అక్రమ తవ్వకాల వెనుక అధికార పార్టీ నాయకుల పాత్ర పరోక్షంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే నియోజకవర్గం పరిధిలో ఉన్న మండలాలను కూడా తమ అనుచరులకు ఎమ్మెల్యే అప్పగించారనే మాట వినిపిస్తోంది. రేషన్ బియ్యం కొనాలన్నా, అమ్మాలన్నా సరే... ఆయా మండలాల్లో సదరు నేతలు చెప్పిందే వేదం అంటున్నారు నేతలు. టికెట్ వచ్చే వరకు అయ్యా, అమ్మా, అన్న, తమ్ముడు అంటూ తిరిగిన ఎమ్మెల్యే ... ఇప్పుడు గెలిచిన తర్వాత మాత్రం... నియోజకవర్గంలో ఉండటం లేదు. ఏదైనా పని కోసం ఎమ్మెల్యేను కలవాలంటే... నేతలంతా హైదరాబాద్ వెళ్లాల్సిందే. పరిస్థితి ఇలాగే కొనసాగితే... పార్టీకి కావాల్సినంత చెడ్డపేరు ఖాయమంటున్నారు కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు. దీనిపై ఇప్పటికైనా సరే అధినేత దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
Read More...
Stories  State 

బీ కేర్ ఫుల్ అంటున్న టీడీపీ నేతలు...!

బీ కేర్ ఫుల్ అంటున్న టీడీపీ నేతలు...! అమరావతి: వైసీపీకి రోజుకో షాక్ తగులుతోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి నేతలంతా గుడ్ బై చెబుతున్నారు. మాజీ మంత్రులు, జగన్ సన్నిహితులు, బంధువులు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం ఇప్పుడు సైలెంట్‌గా సైడ్ అయిపోతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే ఇప్పుడు మరో మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాబూరావు కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పోతుల సునీత సైతం జగన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వ్యాఖ్యలు చేశారు పోతుల సునీత.  వైసీపీకి నేతలు రాజీనామాలు చేయడం పట్ల టీడీపీ అగ్రనేతలు సంతోషం వ్యక్తం చేస్తుంటే... కిందిస్థాయి నేతలు మాత్రం కలవరపడుతున్నారు. వైసీపీ ఖాళీ అవుతుందనే ఆనందం ఓ వైపు... మరోవైపు నిన్నటి వరకు టీడీపీని, అధినేత చంద్రబాబును తిట్టిన వ్యక్తులు, అలాగే తమపై తప్పుడు కేసులు పెట్టి హింసించిన నేతలు ఇప్పుడు తమ పార్టీలోకి వస్తే ఎలా అని మదనపడుతున్నారు. గతంలో చంద్రబాబును, లోకేష్‌ను, టీడీపీని తిట్టిన వారిని పార్టీలోకి తీసుకోవద్దని సోషల్ మీడియా వేదికగా టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు, అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.  చీరాల నియోజకవర్గానికి చెందిన పోతుల సునీతను తొలుత ఎమ్మెల్సీ చేసింది టీడీపీ. మాజీ మంత్రి పరిటాల కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్న పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు చంద్రబాబు. అయితే 2019లో టీడీపీ ఓటమితో సునీత వైసీపీలో చేరారు. ఆ తర్వాత వైసీపీ రాష్ట్ర అధ్యక్షురాలి పదవి కూడా నిర్వహించారు. ఆ సమయంలో చంద్రబాబుపైన, టీడీపీ నేతలపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా చంద్రబాబు కాదు... సారా చంద్రబాబు అంటూ సునీత ప్రెస్ మీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. ఇప్పుడు అదే వీడియోను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా ట్యాగ్ చేశారు. ఇలాంటి ఊసరవెల్లి లాంటి నాయకులను పార్టీలోకి తీసుకోవద్దు అంటూ పోస్ట్ పెట్టారు. అధికారం కోసం వచ్చే ఇలాంటి వారిని తీసుకుంటే... అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం నిజాయతీగా పోరాడిన వాళ్లని అవమానించినట్టే.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.  ఇక ఏలూరు మేయర్ నూర్జహాన్ పార్టీ మార్పుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ సోషల్ మీడియా వింగ్ కార్యకర్త ఉండవలి అనూష కూడా నూర్జహాన్ ఫోటోను షేర్ చేశారు. అనవసరంగా ట్రోల్ చేపించుకున్నాం అనిపిస్తది ఇలాంటివి చూసినప్పుడు అంటూ కామెంట్ పెట్టారు. ఇందుకు ప్రధాన కారణం... అనూషకు చెందిన షోరూమ్‌ను కూల్చివేస్తామంటూ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే రోజాపై కామెంట్ చేసినందుకు వైసీపీ నేతలు ఉండవల్లి అనూషపై కేసులు కూడా పెట్టారు. దీంతో... వైసీపీ నేతలను తీసుకునే విషయంలో కాస్త ముందు వెనుక ఆలోచించాలంటున్నారు టీడీపీ నేతలు. గతంలో వారు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
Read More...
Stories  State 

గల్లా జయదేవ్ మళ్లీ మనసు మార్చుకున్నారా? సీఎం ఏం ఆఫర్ చేశారు?

గల్లా జయదేవ్ మళ్లీ మనసు మార్చుకున్నారా? సీఎం ఏం ఆఫర్ చేశారు? అమరావతి: పొలిటీషియన్‌ కం ఇండస్ట్రయలిస్ట్‌… అమరరాజా ఇండస్ట్రీస్‌ అధినేత గల్లా జయదేవ్‌ పొలిటికల్‌ ఫ్యూచర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా మారుతోంది…. రాజకీయాలకు తాత్కాలిక విరామమంటూ గత ఎన్నికలకు ముందు పొలిటికల్‌ స్క్రీన్‌పై నుంచి తనకు తానుగా ఎగ్జిట్‌ అయిన గల్లా…. ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకున్నారా? రెండుసార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా… మూడోసారి గెలిచే అవకాశం ఉన్నా…. పాలిటిక్స్‌కు దూరమంటూ రాంగ్‌ డిసిషన్‌ తీసుకున్నానని తర్జనభర్జన పడుతున్నారా? ఆయన ఇంట్రెస్ట్‌ను గుర్తించిన సీఎం చంద్రబాబు ఏం ఆఫర్‌ చేశారు? ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తానని చంద్రబాబు ఆఫర్‌..గుంటూరు మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత గల్లా జయదేవ్‌ పొలిటికల్‌ ఫ్యూచర్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. స్వతహాగా పారిశ్రామిక వేత్త అయిన గల్లా జయదేవ్‌ గత ప్రభుత్వంలో తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురవ్వడంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అలా ప్రకటించిన మూన్నెల్లలోనే ఎన్నికలు జరగడం… టీడీపీ తిరుగులేని విజయం సాధించడంతో గల్లా జయదేవ్‌లో అంతర్మథనం మొదలైందని టాక్‌ వినిపిస్తోంది. ఎన్నికల్లో తెరవెనుక రాజకీయం చేసిన జయదేవ్‌… పార్టీ అధికారంలోకి రాగానే ఢిల్లీలో చాలా హంగామా చేయడంతో ఆయనకు పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌ తగ్గలేదని తేలిపోయింది. ఆయన హడావుడి చూసిన వారంతా గల్లా మళ్లీ రీఎంట్రీ ఇస్తారా? అనే డౌట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేశారు. ఇక ఆయన ఆసక్తిని గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తానని ఆఫర్‌ చేసినట్లు చెబుతున్నారు.రాజ్యసభకు వెళ్లడమే బెటర్‌ అనే ఆలోచన..పదేళ్లపాటు ఎంపీగా పనిచేసిన గల్లా జయదేవ్‌కు ప్రజాసమస్యలపై స్పష్టమైన అవగాహన ఉంది. ముఖ్యంగా రాష్ట్రానికి ఏం అవసరమో ఆయనకు తెలుసు.. అందుకే ఢిల్లీలో ఆయన లాంటి వారు ఉండాలని సీఎం నిర్ణయించారంటున్నారు. అయితే జయదేవ్‌ మాత్రం అధినేత అంతరంగానికి తగ్గట్టుగా మరో రూపంలో సేవలు అందించాలని అనుకుంటున్నారట. గుంటూరు ఎంపీ స్థానాన్ని వదులుకోవడం… కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరులో పర్మినెంట్‌ అయ్యే అవకాశాలు ఉండటంతో మళ్లీ లోక్‌సభకు వెళ్లే పరిస్థితి లేదని డిసైడ్‌ అయ్యారట గల్లా. ప్రత్యామ్నాయంగా విజయవాడ, విశాఖ పార్లమెంట్‌ స్థానాలపై ఫోకస్‌ చేద్దామన్నా… ఆ రెండు చోట్ల పార్టీకి బలమైన నేతలు ఎంపీలుగా ఉండటంతో తాను రాజ్యసభకు వెళ్లడమే బెటర్‌ అనే ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. రాజ్యసభకు వెళ్లడం ద్వారా అధినేత చంద్రబాబు అకాంక్షలను నెరవేర్చడంతోపాటు చట్టసభలో అడుగుపెట్టాలనే తన ఆశయం ఫలిస్తుందని జయదేవ్‌ భావిస్తున్నారట.
Read More...
Stories  Local 

హాస్టల్ లో అరుదైన జీవి... వామ్మో దాని ధర కోటి రూపాయలా !

హాస్టల్ లో అరుదైన జీవి... వామ్మో దాని ధర కోటి రూపాయలా ! మార్కాపురం: విద్యార్ధినీల హాస్టల్ ఆవరణలో  వింత జీవి కనిపించింది. దీనితో విద్యార్ధినీలు హడలిపోయారు. కాలేజికి వెళ్ళేందుకు సిద్దమై హాస్టల్‌ నుంచి బయటకు వచ్చిన ఇంజనీరింగ్‌ విద్యార్ధినిలకు హాస్టల్ ఆవరణలో ఒంటినిండా పొలుసులతో భయం గొలిపే విధంగా ఉన్న జంతువు కనిపించింది. ఇటు జనావాసాలకు, అటు అటవీప్రాంతానికి సమీపంలో ఉన్న తమ హాస్టల్‌లో అప్పుడప్పుడు చిన్నచిన్న పెంపుడు జంతువులు రావడం సహజమే అయినా ఈ జంతువు మాత్రం చిన్నసైజు డైనోసార్‌లా ఉండటంతో విద్యార్దినులు దాన్ని చూసి భయంతో పరుగులు పెట్టారు… హాస్టల్‌ ఆవరణలో కలియ తిరుగుతూ పురుగులను, చీమలను పట్టుకుని తింటున్న ఆ జీవి అరుదైన జాతికి చెందిన అలుగుగా కొందరు గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని హాస్టల్‌ సిబ్బందికి చేరవేశారు. ఎలా పట్టుకున్నారంటే? మార్కాపురం మండలం దరిమడుగు గ్రామ సమీపంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలోని లేడీస్ హాస్టల్‌లో అరుదైన జంతుజాతికి చెందిన అలుగు ప్రత్యక్షమైంది. అలుగు జంతువు హాస్టల్ ఆవరణలో తిరుగుతుండటంతో విద్యార్ధినిలు భయాందోళనలకు గురయ్యారు. ఒంటి నిండా పొలుసులతో బోన్‌సాయ్‌ డైనోసార్‌లాగా ఉన్న అలుగు జంతువును చూసి విద్యార్ధినిలు తొలుత ఆందోళన చెందారు… అయితే అలుగు హానికర జంతువు కాదని తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే హాస్టల్‌ వాచ్మెన్‌, సిబ్బంది అలుగును పట్టుకుని ఓ ఖాళీ డ్రమ్ములో ఉంచారు. దానికి కూరగాయలను ఆహారంగా ఉంచారు… కాలేజీ యాజమాన్యానికి సమాచారాన్ని అందచేశారు… అలుగు జంతువును పరిశీలించిన కాలేజి యాజమాన్యం మార్కాపురం ఫారెస్ట్ ఆఫీస్ సమాచారం ఇచ్చారు… సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది కాలేజిలో పట్టుకున్న అలుగును స్వాధీనం చేసుకున్నారు… ఈ అలుగును దోర్నాల ఫారెస్ట్ లో వదులుతామని కాలేజీ యాజమాన్యానికి తెలిపారు ఫారెస్ట్ అధికారులు. ఒక్కో అలుగు కోటి రూపాయలా? ప్రపంచంలో ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతున్న జంతువుల్లో అలుగు ప్రధమ స్థానంలో ఉంది… సాధు జంతువుగా ఉన్న అలుగును పట్టుకోవడం సులువు కావడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి ఎక్కువగా డిమాండ్‌ ఉంది… దీంతో అలుగును అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్లు ఎక్కువగా విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు… ఒక్కో అలుగు 80 లక్షల వరకు ధర పలుకుతుందట… కొన్ని సందర్భాల్లో కోటి రూపాయలకు పైగా దీని ధర ఉంటుందట… ప్రధానంగా చైనా, వియత్నాంలలో దీని మాంసానికి డిమాండ్‌ ఎక్కువ… అలాగే విదేశాల్లో ఔషధ ప్రయోజనాల కోసం ఈ అలుగును వినియోగిస్తారు… ఎంతో ధృడంగా ఉండే దీని ఒంటిపై ఉన్న పొలుసులతో వివిధ రకాల ఆభరణాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, వాలెట్లు తయారు చేస్తారు… చీమలు, చెదపురుగులను తింటూ అలుగు తన మనుగడ సాగిస్తుంది… ఇతర జంతువులకు కానీ, మనుషులకు కానీ ఎలాంటి హానీ చేయదు… ఎవరైనా తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ముడుచుకుపోతుంది… దీంతో దీన్ని ఈజీగా పట్టుకుని అక్రమ రవాణా చేస్తున్నారు… ఈ జంతువుకు భయం కూడా ఎక్కువే… వీటిని విక్రయించేందుకు స్మగ్లర్లు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ కూడా ఉపయోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
Read More...
Stories 

కార్గిల్ విజయానికి 25 ఏళ్ళు

కార్గిల్ విజయానికి 25 ఏళ్ళు Top Story: 1999లో జరిగిన లాహోర్ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. అది మేం చేసిన పొరపాటు" అని మే 28, 2024న నవాజ్ షరీఫ్ ఈ ప్రకటన చేశారు. సరిగ్గా పాతికేళ్ల క్రితం మే 28, 1998న అటల్ బిహారీ వాజపేయి తాను సంతకాలు చేశామని, కాని పాకిస్తాన్ కార్గిల్లో దుస్సాహసమే చేసిందని షరీఫ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్ సమావేశంలోనే ప్రకటించారు. శరీరం గడ్డకట్టుకుపోయే వాతావరణంలో అణ్వాయుధాలు ఉన్న రెండు దేశాల మధ్య దాదాపు 80 రోజులు జరిగిన పోరును ప్రపంచమంతా చూసింది. అంతకు ముందు భారత్తో పాకిస్తాన్ చేసిన మూడు యుద్ధాలలోనూ శృంగభంగమే మిగిలినా మళ్లీ కాలు దువ్వింది. మతోన్మాద సంస్థల విరగబాటు, మతపిచ్చితో రెచ్చిపోయే పాక్ సైన్యం ఇందుకు కారణం. భారత్ విజయం లాంఛనమే. శత్రువుపై సాధించిన ఆ విజయం ప్రతి భారతీయుని మదిలో విజయగర్వాన్ని, దేశభక్తిని నింపింది. సినీ నటులు, క్రికెట్ ఆటగాళ్లను ఆరాధించే యువతకు నిజమైన జవానులే అసలైన హీరోలు అని తెలిసొచ్చింది. భారత్కు శాంతి మంత్రమే కాదు. యుద్ధతంత్రం కూడా తెలుసునని వీరజవాన్లు, నాటి బీజేపీ ప్రభుత్వం చాటగలిగారు. ఆ విజయాన్ని ఏటా జులై 26న కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం. ఎందరో వీరు త్యాగఫలం కార్గిల్లో ఎందరో వీర జవాన్లు అమరు లయ్యారు. పద్మపాణి ఆచార్య, మరియప్పన్ శరవణ్, రాజేష్ సింగ్ అధికారి, విక్రమ్ బాత్రా, బల్వాన్ సింగ్, యోగేంద్ర సింగ్ యాదవ్, వివేక్ గుప్తా, దిగేంద్ర కుమార్, సంజయ్ కుమార్, మనోజ్ కుమార్ పాండే, సౌరబ్ కాలియా, అంజూ అయ్యర్, విజయంత్ తపర్, హనీఫుద్దీన్, అజయ్ అహూజా, చునీలాల్, బసప్ప రవీంద్రనాథ్, నిర్మల్సింగ్.. ఇలా రాస్తూ పోతే స్థలంసరిపోదు. వీరంతా అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు, భాషలు, మతాలు, కులాలకు చెందినవారు. యోధులకు పురస్కారాలు కార్గిల్ యోధులకు భారత ప్రభుత్వం అవార్డులను ప్రధానం చేసింది. నాలుగు పరమ వీరచక్ర, 11 మహావీర చక్ర అవార్డులను ఇచ్చారు. వీరిలో కొందరికి మరణానంతరం ఇచ్చారు. పరమ వీరచక్ర అందుకున్నవారు.. గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్, లెఫ్టినెంట్ మనోజ్కుమార్ పాండే, కెప్టెన్ విక్రమ్ బత్రా, రైఫిల్ మాన్ సంజయ్ కుమార్. మహా వీరచక్ర అందుకున్న వారు.. కెప్టెన్ అనుజ్ సయ్యర్, మేజర్ రాజేష్సింగ్ అధికారి, కెప్టెన్ గుర్జీందర్ సింగ్ సూరి, నాయక్ దిగేంద్ర కుమార్, లెఫ్టినెంట్ బల్వాన్ సింగ్, నాయక్ ఇమ్లియాకుమ్, కెప్టెన్ కీషింగ్ క్లిఫోర్డ్ నోంగ్రమ్, కెప్టెన్ నీకెజాకువో కెంగురుసే, మేజర్ పద్మపాణి ఆచార్య, మేజర్ సోనమ్ వాంగ్చుక్, మేజర్ వివేక్ గుప్తా లు అవార్డులు అందుకున్నారు.
Read More...
Stories 

ఆ అవకాశాలు ఎవరికి దక్కేనో ?

ఆ అవకాశాలు ఎవరికి దక్కేనో ? అమరావతి: ఐదేళ్ల తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆ పార్టీ నేతలంతా ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం కూడా  ఇప్పుడు నేతలు, కార్యకర్తలతో సందడిగా మారింది. వాస్తవానికి పార్టీ ఓడిన తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు చాలామంది నేతలు కార్యాలయం వైపు రావడానికి కూడా భయపడ్డారు. జగన్ సర్కార్ కక్ష సాధింపుతో వ్యవహరించడంతో పాటు అక్రమ కేసులు, దాడులకు తెగబడటంతో బయటకి వచ్చేందుకు కూడా ధైర్యం చేయలేదు. అయితే ఒంగోలు మహానాడు తర్వాత నేతలంతా వైసీపీ సర్కార్‌కు ఎదురు తిరిగారు. నిత్యం ప్రజల్లోనే గడిపారు. పార్టీ గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు ఓడితే... మనకు భవిష్యత్తు లేదు అన్నట్లుగా కష్టపడ్డారు. అనుకున్నది సాధించారు. పార్టీ కోసం కష్టపడిన నేతలంతా ఇప్పుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... పదవులు వస్తాయని గంపెడాశ పెట్టుకున్నారు. కొందరు నామినేటెడ్ పదవుల కోసం... మరి కొందరు పార్టీ పదవుల కోసం ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు కూడా. ఇందుకోసం కొందరు నేతలు పైరవీలు కూడా చేయిస్తున్నారు. గతంలో పార్టీ పదవులు అనుభవించిన వారేమో నామినేటెడ్ పదవుల కోసం... అధికారం అనుభవించిన వారేమో... పార్టీ పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.  తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత హోమ్ మంత్రి అయ్యారు. దీంతో ఆ పదవి కోసం మహిళా నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీకి కేటాయించడంతో... అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులు పీతల సుజాత, పనబాక లక్ష్మీతో పాటు ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో గ్రీష్మ తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ ‌తరఫున ప్రచారం చేయడంతో... ఆ పేరును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఎస్సీ సెల్ అధ్యక్ష పదవి కోసం కూడా జాబితా పెద్దగానే ఉంది. రైతు సంఘం నేతగా శ్రీనివాసులు రెడ్డినే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. బీసీ సెల్ నేతగా కొల్లు రవీంద్ర స్థానంలో చోటు ఎవరికి వస్తుందనే చర్చ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. అన్ని వర్గాల ప్రజలను కలుపుకు పోయే సీనియర్ నేతకు అవకాశం దక్కే అవకాశం ఉంది. ఇక కొత్త అధ్యక్షునిగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. మిగిలిన పార్టీ పదవులపై ఆయన కసరత్తు చేస్తున్నారు.  ఇక ఇప్పటి వరకు పార్టీ పదవుల్లో ఉన్న నేతలు... ఇప్పుడు నామినేటెడ్ పదవులు వస్తాయని భావిస్తున్నారు. జాతీయ అధికార ప్రతినిధులు పట్టాభి, జీవీ రెడ్డి, తిరునగరి జ్యోత్న్స, డ్వాక్రా, అంగన్వాడీ సాధికార కమిటి అధ్యక్షురాలు ఆచంట సునీత, తెలుగు మహిళ రాష్ట్ర నేతలు మజ్జి పద్మావతితో పాటు పలువురు పార్టీ నేతలు ఇప్పుడు పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ మహిళా కార్పొరేషన్ ఛైర్మన్, మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్, పర్యాటక శాఖ కార్పొరేషన్, ఏపీఐఐసీ ఛైర్మన్, సోషల్ వెల్ఫేర్ బోర్డు, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పదవుల కోసం నేతలు ప్రయత్నం చేస్తున్నారు. నేతల పనితీరుపై ఇప్పటికే అంతర్గత సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ శాఖలు, కార్పొరేషన్లలో ఉన్న నామినేటెడ్ పోస్టు వివరాలు ఈ నెల 8 లోపు ఇవ్వాలని అన్ని శాఖలను జీఏడీ ఆదేశించింది. మరి అధినేత చల్లని చూపు ఎవరి మీద ఉందో తెలియాలంటే...  మరో వారం రోజులు ఆగాల్సిందే. చివరిగా ఒక్క మాట... వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, నామినేటెడ్ పదవుల పంపకంలో చూపించినంత ఉత్సాహం, టీడీపీ లో లేదని క్రియాశీలక టీడీపీ నాయకులు ఆవేదన చెందుతున్నారు.చివరివరకు నాన్చకుండా పదవుల పంపకంలో ఆసక్తి చూపించాలనే వాదనలు వినిపిస్తున్నాయి.ఇది గమనించదగిన వాస్తవం...!
Read More...