Category
Cultural
Cultural 

పంచ మాధవ క్షేత్రాలు..... ఎక్కడ ఉన్నాయి..వాటి విశిష్టత..!

పంచ మాధవ క్షేత్రాలు..... ఎక్కడ ఉన్నాయి..వాటి విశిష్టత..! పుణ్య భూమి అయిన మన భరత ఖండంలో దేవతలరాజైన ఇంద్రుడి చేత నిర్మంచబడిన ప్రసిద్ధ మాధవ క్షేత్రాలే.. ఈ పంచ మాధవ క్షేత్రాలు.. ఇవే... 1) బిందు మాధవ ఆలయం - వారణాసి2) వేణీ మాధవ ఆలయం - ప్రయాగ3) కుంతీ మాధవ ఆలయం - పిఠాపురం4) సేతు మాధవ ఆలయం - రామేశ్వరం5) సుందర మాధవ ఆలయం - తిరువనంతపురం. ఈ క్షేత్రాల స్థాపన వెనుక వున్న ప్రసిద్ధ పురాణ గాథ ఏమిటంటే.. బ్రహ్మ కుమారుడైన ప్రజాపతి త్వష్టకు విశ్వరూపుడనే కుమారుడు జన్మించాడు. విశ్వరూపుడికి మూడు తలలు ఉండేవి మరియు ఇతడు మహాబలశాలి. ఒకరోజు ఇంద్రుడు సభ తీర్చి ఉండగా దేవతల గురువు అయిన బృహస్పతి అక్కడకు వస్తాడు. అందరి వద్ద పూజలు అందుకొంటున్న ఇంద్రుడు తన గురువు వస్తే లేచి గౌరవించకుండా ఉదాసీనంగా ఉంటాడు. ఆ విధంగా అగౌరవించబడ్డ బృహస్పతి ఖిన్నుడై తన గృహానికి వెళ్తాడు. ఆ తరువాత ఇంద్రుడు తాను చేసిన తప్పును గ్రహించి బృహస్పతి ఇంటికి బయలుదేరుతాడు. ఇంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని గ్రహించి బృహస్పతి ఇంద్రునికి కనిపించకుండా అంతర్థానమౌతాడు. ఇంద్రునికి బృహస్పతి అనుగ్రహం తప్పిందని అసురులకు తెలిసి, అసురులు శుక్రాచార్యుల అనుగ్రహంతో యుద్ధం ప్రకటించి ఇంద్రాదులను ఓడించి స్వర్గం నుండి తరుముతారు. అప్పుడు ఇంద్రుడు ఏమి చేయాలో తోచక బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతం చెబుతాడు. అప్పుడు బ్రహ్మ విషయాన్ని గ్రహించి ఇంద్రునితో వారికి గురువు అవసరం ఉందని చెప్పి, త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుని వద్దకు వెళ్ళి గురువుగా ఉండమని అర్థించమని చెబుతాడు. విశ్వరూపుడు చాల పిన్నవయస్సులో ఎన్నో యాగాలు చేసి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాడు. ఇంద్రుడు బ్రహ్మ సూచన ప్రకారం విశ్వరూపుని వద్దకు వెళ్ళి గురుస్థానాన్ని తీసుకోవలసిందిగా, తమకు స్వర్గం లభించే మార్గం ప్రసాదించి, ఆ స్వర్గ సుఖాలు ఆనందించమని కోరుతాడు. విశ్వరూపునికి మూడు ముఖాలు ఉంటాయి. ఆయన ఒక ముఖంతో హవిస్సు ఇచ్చినప్పుడు అన్నం తింటాడు. మరో ముఖంతో సురాపానం చేస్తాడు. మూడో ముఖంతో సోమరసం త్రాగుతాడు. యజ్ఞాలలో విశ్వరూపుడు మొదట తనకు తరతమ భేదం ఉండదని, బ్రహ్మజ్ఞానం కలవాడినని, తాను తన జీవనం పొలంలో పడిపోయిన ఒడ్లు ఏరుకొని జీవనం చేస్తుంటానని అంటాడు. "నేను మీ కోరిక మన్నించి నేను గురుత్వం వహించి మీకు పౌరోహిత్యం చేస్తే, మీ కోరికల కొరకు నేను యజ్ఞాలు చేస్తే నా బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుంది" అని అనగా, ఇంద్రాదులు, విశ్వరూపుని మరింత వేడుకోగా వారి కోరిక మన్నించి గురుత్వం వహిస్తాడు. తరువాత అసురుల సామర్థ్యాన్ని అంచనా వేసి, ఇంద్రుడికి నారాయణ కవచం ఉపదేశం చేశారు విశ్వరూపుడు. నారాయణ కవచం విశేషం చెబుతూ ఒకప్పుడు కౌశికుడు అనే బ్రాహ్మణుడు నారాయణ కవచాన్ని అనునిత్యం పఠిస్తూ ఒక ఎడారిలో ప్రాణాలు విడిచి పెట్టేశాడు. నారాయణ కవచం తేజస్సు అస్థికలను పాతేసింది. ఆ విధంగా ప్రాణాలు విడిచిన కౌశికుడు అస్థిపంజరం ఎడారిలో పడి ఉండిపోయింది. ఒకరోజు చిత్రవధుడు అనే గంధర్వుడు భార్యలతో కలిసి ఆకాశమార్గంలో విమానంలో ఆ మార్గం గుండా వెళ్తుండగా విమానం అక్కడి వరకు వచ్చి కౌశికుడి అస్థికలు ఉన్న ప్రదేశం వద్ద ఆగిఫొయింది. విమానం క్రింద పడిపోయింది. అప్పుడు గంధర్వుడు భార్యలతో బయట పడిపోయాడు. అప్పుడు వాలకీయుడు అనే మహర్షి అక్కడకు వచ్చి చిత్రవధుడికి కౌశికుడి వృత్తాంతం తెలిపి నారాయణ కవచం ప్రభావం వల్ల విమానం ఆగిపోయిందని, ఆ అస్థికలను సరస్వతీ నదిలో నిమర్జనం చేసి ఆచమానం చేస్తే విమానం కదులుతుందని తెలిపి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ మహర్షి. చిత్రవధుడు వాలకీయుడు చెప్పినట్లు చేస్తే విమానం ముందుకు కదిలిందని విశ్వరూపుడు నారాయణ కవచ మహత్యాన్ని తెలుపుతూ ఇంద్రునికి నారాయణ కవచాన్ని ఉపదేశిస్తాడు. నారాయణ కవచ ప్రభావంతో ఇంద్రుడు అసురులపైకి దండెత్తి అమరావతిని స్వాధీనం చేసుకొన్నాడు. ఇంద్రుడు విశ్వరూపుడితో అమరావతిలొ ఉన్న భాగ్యాలు ఆనందించమని చెబితే విశ్వరూపుడు.. గురువులకు శిష్యులే ధనం అని చెబుతాడు. విశ్వరూపుడు యజ్ఞాలలొ హవిస్సులు తీసుకొని అని ఇంద్రాదులకు ఇస్తుండేవాడు. విశ్వరూపుడు తల్లి రచన రాక్షస వంశానికి చెందినది. అందుచేత అసురులు విశ్వరూపుని వద్దకు వెళ్ళి అసురులకు మేనమామ అయిన విశ్వరూపుడిని, యజ్ఞాలలొ హవిస్సులను ఇంద్రుడికి తెలియకుండ తమకు ఇవ్వమని కోరుతారు. బ్రహ్మ జ్ఞానం కలిగి తరతమ భేదాలు లేని విశ్వరూపుడు రాక్షసులు కోరిన విధంగా ఆ హవిస్సులలొ కొంత భాగం రాక్షసులకు ఇస్తుండేవాడు. కొద్దిరోజుల తరువాత ఇంద్రుడికి ఆ విషయం తెలుస్తుంది. అప్పుడు ఇంద్రుడు యుక్తాయుక్త విచక్షణ విడిచి తన వద్దనున్న చంద్రహాసంతో విశ్వరూపుని మూడు శిరస్సులను నరికి వేస్తాడు. సురాపానం చేసే శిరస్సు ఆడాపిచుకగా మారి పోయింది, సోమపానం చేసే శిరస్సు కౌజు పక్షిగా మారిపోయింది. అన్నం తినే శిరస్సు తిత్తిరి పిట్టగా మారిపోయింది. ఆ మూడు పక్షులు విశ్వరూపుడు చేసిన బ్రహ్మహత్యాపాతకాన్ని సూచిస్తాయి. ఈ మూడు పక్షులు ఒక ఏడాది కాలం అరుస్తూ ఇంద్రుడి చెవ్వుల్లొ రొదగా ఉండేవి. వాటి బాధ భరించలేక బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించు కోవడం కోసం ఇంద్రుడు తన పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి భూమికి, స్త్రీలకు, నీటికి, వృక్షాలకు తలో పావు భాగం పంచుతాడు. బ్రహ్మహత్యాపాతకం పాపం తీసుకొన్నందుకు ఆ నాలుగు జాతులకు నాలుగు వరాలు ఇచ్చాడు. భూమికి వరంగా ఇక్కడైన గోతులు తీస్తే ఆ గోతులు తమంతతాము పూడుకొనేటట్లుగా, వృక్షాలకు ఎవరైన మొదలు ఉంచి కొమ్మలు, ఆకులు నరికివేస్తే ఆ వృక్షము లేదా మొక్క తమంతట తాము పెరిగేటట్లుగా, నీటికేమో ప్రక్షాళన గుణాన్ని, స్త్రీలకేమో కామభోగాల యందు కొద్దిపాళ్ళు ఎక్కువ సుఖాన్ని ప్రసాదించాడు. బ్రహ్మహత్యపాతకం క్రింద వారు అనుభవించే బాధలు భూమి కొన్నిచోట్ల పంటలు లేకుండా ఉండడం (ఊసర క్షేత్రాలు), నీరు నురుగుతో ఉండడం, వృక్షాలు జిగురు, స్త్రీలకు ఋతుస్రావం. ఈలోపున.. కుమారుని మరణ వార్త విన్న త్వష్ట ఇంద్రుడి పైన పగ తీర్చుకోవడానికి ఓ మహా యాగన్ని నిర్వహించాడు. ఆ యాగం నుండి జన్మించిన వాడే "వృత్తాసురుడు". తన అన్నను చంపిన ఇంద్రుడిని ఎలాగైనా చంపడమే వృత్తాసురుని లక్ష్యం. ప్రతీ రోజు మూడు అడుగుల పెరుగుతూ సంధ్యా కాలములో కాలిన మబ్బులా ఉన్నాడు. కాలిన రాగి లాంటి శిఖలూ మీసములూ, మధ్యాన్న సూర్యుని ప్రకాశము గలవాడై ప్రకాశించే శూలముతో నాట్యం చేస్తూ గర్జిస్తూ ఉన్నాడు. ఆకాశాన్నే తాగుతున్నట్లు నోరు తెరిచి నాలుకతో నక్షత్రాలను నాకేస్తూ, నోటితో లోకాలను మింగేస్తూ, దన్ష్ట్రలో లోకాలు లోపలకు పోయేట్లు ఆవాలిస్తూ ఉండగా దేవతలందరూ భయపడి అన్ని దిక్కులకూ పారిపోయారు. అన్ని లోకాలకూ ఆవరించాడు కాబట్టి అతని పేరు వృత్తుడు. ఇతను మహా భయంకరుడు. దేవతలు అతన్ని చంపడానికి వచ్చి కొడుతున్నారు. దేవతలు ప్రయోగించే దివ్యాయుధాలను కూడా మింగేస్తున్నాడు వృత్తాసురుడు. దేవతల ఆయుధాలూ తేజస్సు బలమూ కూడా మింగేసాడు వృత్తాసురుడు. అప్పుడు.. ఇంద్రుడు నారాయణున్ని శరణువేడగా, నీవు ధధీచి మహర్షి వద్దకు వెళ్ళి అతని శరీరాన్ని కోరు. ధధీచి శరీరం అంతా నారాయణ కవచమే ఉంది. నారాయణ కవచమే నారాయణ కవచాన్ని ఎదుర్కోగలదు. అని చెప్పి ఆ దేవతలందరూ చూస్తుండగానే శ్రీమన్నారాయణుడు అంతర్ధానమయ్యాడు. పరమాత్మ చెప్పినట్లు దేవతలందరూ ధధీచి వద్దకు వెళ్ళి ధధీచి శరీరాన్ని అడిగితే వారి మాటలు అంగీకరించి తన మనసునీ ఆత్మనూ పరమాత్మ యందు నిలిపి యోగ ధారణతో శరీరాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు అతని ఎముకలతో విశ్వకర్మ వజ్రాయుధాన్ని సిద్ధం చేసి అందులో పరమాత్మ తేజస్సు కూడా నిక్షిప్తం చేసాడు అదే వజ్రాయుధం. వజ్రాయుధాన్ని తీసుకుని ఐరావతం మీద తనతో యుద్ధానికి వచ్చిన తన సోదరున్ని చంపిన ఇంద్రున్ని చూచి వృత్తాసురుడు ఉండ బట్టలేక. ప్రళయకాలాగ్ని లాగ భయంకరమైన శూలాన్ని ఇంద్రుని మీద వేయగా ఆ శులాన్ని వజ్రాయుధముతో ఖండించి శూలము విసిరి వృత్తాసురుడి యొక్క ఒక బాహువుని ఖండించాడు. ఒక చేయి పోయిన రెండవ చేతితో ఒక పరిఘను తీసుకుని ఇంద్రుని దవడ మీద కొట్టాడు. ఆ దెబ్బకు ఇంద్రుడు వజ్రాయుధాన్ని జరవిడిచాడు. ఆయుధము లేని ఇంద్రున్ని వృత్తాసురుడు కొట్టలేదు. ఇంద్రుని స్థితి చూసి అందరూ హాహాకారాలు చేసారు. ధర్మం తెలిసిన ఇంద్రుడు వజ్రాయుధాన్ని తిరిగి తీసుకోలేదు. ఆయుధము తీసుకో.. అని వృత్తాసురుడు చెప్పాడు. వజ్రాయుధము తీసుకుని వృత్తాసురుడి ఇంకో బాహువునూ ఇంద్రుడు ఖండించాడు. అయినా వృత్తాసురుడు రెండు పాదాలతో పర్వతాలనూ భూమినీ దేవతలనూ అల్లకల్లోలం చేస్తూ నోరు బాగా తెరిచి వాహనముతో కూడి ఉన్న ఇంద్రున్ని మింగేసాడు. నారయణ కవచ ప్రభావము వలన ఇంద్రుడు కడుపులోకి వెళ్ళి తన వజ్రాయుధముతో వృత్తాసురుని కడుపు చీల్చి బయటకు వచ్చి వృత్తాసురుని శిరస్సును ఖండించాడు. వృత్తాసురుడు అసురుడైనా పుట్టుకతో బ్రాహ్మణుడు.. అందువల్ల బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకోవడానికి ఇంద్రుడు ఈ భూమి పైన ఐదు వైష్ణవాలయాలను నిర్మించాడు.. అవే ‘పంచ మాధవ క్షేత్రాలు’ గా ప్రసిద్ధి చెందాయి.
Read More...
Cultural 

ఉపవాసాలతో మేలే!

ఉపవాసాలతో మేలే! వారానికి ఒకటి, రెండు రోజులు ఉపవాసం ఉండడం వల్ల శరీరానికి మేలే జరుగుతుంది. ఈ రోజుల్లో కేవలం పీచు ఎక్కువగా ఉండే పండ్లను పరిమితంగా తినాలి. వాటితో పాటు కొబ్బరి నీళ్లను తీసుకోవాలి. ఇటీవల కొందరు ‘ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌’ పద్ధతి అనుసరిస్తున్నారు. ఇందులో రోజులోని 24 గంటల్లో కేవలం 8 గంటల్లో మాత్రమే తినాలి. ఆ 8 గంటల్లో నాలుగైదు సార్లు కూడా తినొచ్చు. మిగతా 16 గంటలు ఏమీ తినకూడదు. ఉదాహరణకు ఉదయం 10 గంటలకు తినడం ప్రారంభిస్తే.. సాయంత్రం 6 గంటలకు ఆపేయాలి. ఆ తర్వాత మళ్లీ మర్నాడు ఉదయం 10 గంటల వరకూ ఏమీ తినొద్దు. ఈలోగా కొబ్బరి నీళ్లు, బ్లాక్‌ కాఫీ తాగొచ్చు. ఈ విధానంలో కూడా మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.మనం తినే ఆహారంలో నాలుగింట మూడో వంతు మాత్రమే తిని.. ఆఖరిది తినొద్దు. ఇలా చేస్తే జీవిత కాలం 2-3 ఏళ్లు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే రోజూ తినే ఆహారం కంటే తక్కువ తింటే..క్యాలరీలు తక్కువగా వచ్చాయనే భావనతో.. శరీరంలో రుగ్మతలను నయం చేసే వ్యవస్థ బలంగా పనిచేస్తుంది. అదే పుష్టిగా తింటే.. ఎక్కువ క్యాలరీలున్నాయిలే అన్న భావనతో ఆ వ్యవస్థ బద్ధకంగా ఉంటుంది. సొంతంగా నయం చేసుకునే వ్యవస్థ పనిచేయదు.
Read More...
Cultural  State 

Photo Gallery: కన్నుల పండువగా మల్లన్న స్వామి స్వర్ణ రథోత్సవం

Photo Gallery: కన్నుల పండువగా మల్లన్న స్వామి స్వర్ణ రథోత్సవం SRISAILAM: శ్రీశైల మహా క్షేత్రంలో నేడు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ మాడవీధుల్లో స్వామి, అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Read More...
Cultural 

నేడు శ్రీకృష్ణా అష్టమి

నేడు శ్రీకృష్ణా అష్టమి శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీ కృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది. కృష్ణుని జన్మ దినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది. కృష్ణజయంతి, శ్రీ జయంతి అనికూడా పిలువబడుతోంది. కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు. తిథి మాత్రమే ఉంటే క్షిష్ణాష్టమిగానూ నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణజయంతిగానూ వ్యవయరించాలని ధర్మశాస్త్రగ్రంథాలు చెబుతున్నాయి. తిథీ నక్షత్రం కలిసి వచ్చి ఆ రోజు సోమవారం గానీ బుధవారం గానీ అయితే మరీ ప్రసస్తమని ధర్మసింధు గ్రంథం ద్వారా తెలుస్తోంది. కృష్ణాష్టమినాడు అభ్యంగన స్నానమాచరించాలి. తులసీదళాలు వేసిన నీటితో ఆచమించాలి. ఆరోజు ఉపవాసముండాలి. సాయంత్రం గృహమధ్యమున గోమయంతో అలికి రంగవల్లి తీర్చాలి. దానిమీద బియ్యం పోసి మంటపం ఏర్పరచి నూతన కుంభం ఉంచాలి. ఆ కొత్త కుండను గంధపుష్పాక్షతలచే అలంకరించాలి. దానికి వస్త్రం చుట్టాలి. ఆ కలశం మీద బాలకృష్ణ ప్రతిమ ప్రతిష్టించాలి. ముందుగా దేవకీదేవి ప్రార్థనం, తర్వాత కృష్ణప్రార్థన. వేయించిన మినపపిండితో పంచదార కలిపి నైవేద్యం చేసి దేవకీదేవికి నివేదనం చేయాలి. కొన్ని ప్రాంతాలలో దీనిలో శొంఠి కూడా కలుపుతారు. అర్థరాత్రి వరకు పూజ, పాలు, పెరుగు, వెన్న కృష్ణునికి నైవేద్యం. చంద్రోదయ సమయాన బయటికి వెళ్ళిఅక్కడ అలంకృతమైన భూమిలో ఫలపుష్పచందన సంయుక్తమైన శంఖంచేత నీటిని తీసుకుని చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. కృష్ణాష్టమినాడు వెండితో తయారుచేసిన చంద్రుడి ప్రతిబింబానికి పూజాదికాలతో ఆర్ఘ్యం ఇస్తే మనసున తలచిన కోరికలు నెరవేరుతాయని మన పూర్వీకుల నమ్మకం. తర్వాత శంఖం చేత నారికేళోదకం గ్రహించి కృష్ణుడికి అర్ఘ్యమివ్వాలి. ఆ రాత్రి భగవంతుని కథలతో జాగరణం, మరునాడు భోజనం చేయాలి. ఉపవాసం, పూజ, జాగరణలు నిర్వహించాలి. అదంతా సాధ్యం కాని వారు కనీసం శ్రీ క్రిష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడశోపచార పూజ చేసి కృష్ణునికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడ లు నివేదించాలి. దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేయాలి. ప్రసవం రోజులలో తయారు చేసే కట్టెకారం కృష్ణుని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం ఉంది. మాతృహృదయాల్లో మమతను పెంపొందించే పండుగ ఇది. శ్రీ కృష్ణుని బాల్యచేష్టలను జ్ఞప్తికి తెచ్చి ఆ చేష్టలను పూజా భాజనం చేసే పర్వదినమిది. పాపపుణ్యాల వాసనేలేని బ్రహ్మస్వరూపపు బాలలలో ద్యోతకమయ్యే దివ్యత్వాన్ని తేటపరచే కార్యకలాపం గల పండుగ కృష్ణాష్టమి. కృష్ణుడు ఇంటిలోకి వస్తున్నట్లుగా కృష్ణపాదాలు చిత్రిస్తారు.కృష్ణుని బాల్య సంబంధమైన పర్వం కాబట్టి అతని బాల్యక్రీడలయిన ఉట్లమీది పాలు, పెరుగు, వెన్న దొంగిలించుటను అనుకరించే, జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతారు. గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు చిన్నికృష్ణుడు ఎక్కికూర్చున్నది పొన్నచెట్టు కాబట్టి ఈ ఉత్సవం. పోన్నపూలంటే ఆ కృష్ణునినికి ఇష్టమని ఆ పూలతో పూజచేస్తారు. దీనినే "పొంనమాను సేవ'' అని అంటారు.తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వెంకటేశ్వరుడిని ప్రత్యేకంగా కొలువుదీర్చుతారు. దాన్ని 'గోకులాష్టమీ ఆస్థానం'గా వ్యవహరిస్తారు. సర్వభూపాల వాహనంపై స్వామి వారిని తిరుమల మాడవీధుల్లో ఘనంగా ఊరేగించి ఆ గోకులాష్టమి ఆస్థానానికి తీసుకువస్తారు. పండితులు భాగవతంలోని ఘట్టాలను శ్రావ్యంగా చదివి భక్తులకు వినిపిస్తుండగా మరోవైపు ఉత్సాహభరితంగా 'ఉట్ల పండగ' జరుగుతుంది. దీన్ని శిక్యోత్సవం'గా వ్యవహరిస్తారు. మధుర, ద్వారక, బృందావనం, ఉడిపి, పూరీ, గురువాయూరు తదితర క్షేత్రాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. యాడుకుల భూషణుడు అర్థరాత్రి పుట్టాడు కాబట్టి ఆ సమయంలో చిన్నికృష్ణుడి విగ్రహానికి మంగలస్నానం చేయించి పట్టుదట్టీ కట్టి, సందేట తాయత్తులూ, సరిమువ్వగజ్జెలూ బంగారు మొలతాడుతో ముద్దుకృష్ణుడిగా అలంకరిస్తారు. అనంతరం ఊయలసేవ, పవళింపు పూజలు అయిన తరువాత స్వామి ప్రసాదంతో ఉపవాసం ముగిస్తారు.  వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం
Read More...
Cultural 

రక్షాబంధన్ పండుగ గురించి తెలుసుకుందాం!

రక్షాబంధన్ పండుగ గురించి తెలుసుకుందాం! "నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష ,మనమిద్దరం దేశానికి,ధర్మానికి రక్ష " ఇది రక్ష కట్టే సమయం లో చెప్పుకోవాలి.                         యేన బద్ధో బలీ రాజా  దానవేంద్రో మహాబలఃతేనాత్వా మభి బధ్నామి,రక్షే మాచల మాచల(వామన రూపంలో శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని పాతాళ లోకానికి పంపు తున్నప్పుడు బలి చక్రవర్తి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు కూడా ఆ లోకానికి వెళతాడు. లక్ష్మీదేవి బలి చక్రవర్తి చేతికి రక్షకట్టి తన భర్త అయిన శ్రీ మహావిష్ణువును విడిపించుకున్నది.)  పై శ్లోకం పలికిన తర్వాత రాఖీ కట్టుకుంటారు. దేశ రక్ష సమం పుణ్యం దేశ రక్ష సమం వ్రతందేశ రక్ష సమం యాగో దృష్టో నైవచ నైవచ (దేశ రక్షణకు మించిన పుణ్యము గాని, వ్రతముగాని, యాగముగాని లేవు .దేశ రక్షణ చేయుటయే  అన్నింటికీ మించిన పుణ్యము.) హిందవ సోదరా సర్వేనహిందూ పతితో భవతే మమ దీక్ష హిందు రక్ష మమ మంత్ర సమానత (హిందువులందరూ సోదరులే, ఏ హిందువు పతితుడు కాడు, హిందూ ధర్మ రక్షణయే నా దీక్ష సమానత్వమే నా మంత్రం)  సామూహికంగా కలిసినప్పుడు ఈ కింద ప్రతిజ్ఞ ను చేయించవచ్చు. మేము నిత్యం పూజించే భగవంతుని సాక్షిగా, నా శరీరంలో భగవంతుడు ఇచ్చిన ప్రాణం ఉన్నంత వరకు, నా ఊరి వారి క్షేమం కోసం,  మా పూర్వీకులు అందించిన సనాతన హిందూ ధర్మమును ఆచరిస్తాను.  నా కులం వారిలో, నా వీధిలో, నా బంధువులలో ఎవరూ మతం మారకుండా చూసుకుంటానని, పొరపాటున మతం మారితే వెళ్లి వారిని  తిరిగి మన ధర్మం లోకి ఆహ్వానిస్తానని, భగవంతుని సాక్షిగా ఈ ధర్మరక్షను ధరిస్తున్నాను.
Read More...
Cultural 

శ్రీ కాళహస్తి దేవాలయం..ప్రాశాస్త్యం

శ్రీ కాళహస్తి దేవాలయం..ప్రాశాస్త్యం శ్రీకాళహస్తి దేవాలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి మరియు 63 మంది శైవ నాయనార్లలో ఒకరైన కన్నప్ప శివుని ముందు శివలింగం నుండి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన రెండు కళ్లను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంగా చెప్పబడుతుంది. అతన్ని ఆపి అతనికి మోక్షం (మోక్షం) ప్రసాదించాడు. ఇది ఐదు ప్రధాన శివాలయాలలో ఒకటి (పంచ భూత స్థలం), ఇది ఐదు ప్రధాన అంశాలలో ఒకటి - గాలి. మిగిలిన నాలుగు ఆలయాలు చిదంబరం, ఏకాంబరేశ్వర (కాంచీపురం), జంబుకేశ్వర (తిరువానైకావల్) మరియు తిరువణ్ణామలై. అంతఃపురంలో గాలి చలనం లేకపోయినా నిరంతరం మెరుస్తూ ఉండే దీపం ఉంది. కిటికీలు లేని ప్రధాన దేవత గది ప్రవేశాన్ని పూజారులు మూసివేసినప్పుడు కూడా గాలి లింగం కదలడాన్ని గమనించవచ్చు. అనేక నెయ్యి దీపాలపై మంటలు కదులుతున్న గాలి ద్వారా ఎగిసిపడుతున్నట్లుగా మినుకుమినుకుమంటాయి. లింగం తెల్లగా ఉంటుంది మరియు స్వయంభూ లేదా స్వయం ప్రతిరూపంగా పరిగణించబడుతుంది. ప్రధాన లింగాన్ని పూజారి కూడా మానవ చేతులతో తాకలేదు. అభిషేకం (స్నానం) నీరు, పాలు, కర్పూరం మరియు పంచామృత మిశ్రమాన్ని పోయడం ద్వారా జరుగుతుంది. గంధం పేస్ట్, పువ్వులు మరియు పవిత్రమైన దారం ఉత్సవ-మూర్తికి సమర్పించబడతాయి, ప్రధాన లింగానికి కాదు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం రాహు-కేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో రాహుకేతు సర్ప దోష నివారణ పూజ నిర్వహిస్తారు. రాహు-కేతు దోషాలు, సర్ప దోషాలు మరియు వారి జీవితంలో పెళ్లికానివారు, పిల్లలు లేరు, ఆరోగ్యం మరియు మరిన్ని సమస్యలు ఉన్న భక్తులు ఈ ఆలయంలో "రాహు-కేతు సర్ప దోష నివారణ పూజ" అని పిలువబడే అత్యంత ప్రభావవంతమైన మరియు ఫలితాల ఆధారిత పూజను నిర్వహిస్తారు. పూజను హృదయపూర్వకంగా చేసిన తర్వాత, జీవితంలోని అన్ని దోషాలు/సమస్యలు పరిష్కారమవుతాయని మరియు కోరికలు ఫలితాలను ఇస్తాయని బలంగా నమ్ముతారు. ప్రయోజనాలు: • మీరు స్వచ్ఛమైన హృదయంతో మరియు 100% విశ్వాసం మరియు భక్తితో ప్రార్థిస్తేనే ఆలయం మీ వ్యక్తిగత జీవితంలో చాలా ప్రయోజనాలను అందిస్తుంది. • కాలసర్పదోష పూజ చాలా మంది పోరాడుతున్న జంటలను ఒకచోట చేర్చింది. • ప్రతి మంగళవారం మరియు శుక్రవారం సాయంత్రం అమ్మవారి ముందు దీపం వెలిగించండి ... మరియు మీ జీవితంలో సానుకూల ప్రభావాలను అనుభవించండి. • ఆలయం లోపల శని భగవాన్ పూజను నిర్వహించండి. • ప్రాంగణంలో భూగర్భంలో ఉన్న పాతాళ వినాయక దేవాలయం అద్భుతమైన ఆలయం. ఇక్కడ గణేశుడు చాలా శక్తివంతమైనవాడు మరియు మీరు గమనిస్తే, అతని ముఖం [ముఖ్యంగా కళ్ళు] ఏనుగును పోలి ఉంటుంది. స్థూలకాయం ఉన్నవారు బయటకు వెళ్లవద్దని సలహా ఇస్తారు. ,ఇతరులు ఖచ్చితంగా ప్రయత్నించవచ్చు.ఇది విలువైన అనుభవం. • దర్శనం ముగిసిన తర్వాత దక్షిణామూర్తి యొక్క చట్రాన్ని మిస్ చేయవద్దు. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి లేదా వారి కెరీర్ అవకాశాలను మెరుగుపరుచుకునే లక్ష్యంతో ఈ భగవంతుడు చాలా శక్తివంతమైనవాడు. • మీరు ఆలయం చుట్టూ తిరిగినప్పుడు, మీరు చాలా శాసనాలను కనుగొంటారు మరియు దక్షిణ భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కూడా అర్థం చేసుకుంటారు. • ఆలయంలో ఉన్న 63 నాయన్మార్ల విగ్రహాలు చూడవలసిన గ్రంథం. • దర్శనానంతరం, మీరు ఆలయం నుండి బయటకు రాగానే, ప్రవేశ ద్వారం దగ్గర దీపం మరియు నెయ్యి కొనుగోలు చేసి, అక్కడే దీపాన్ని వెలిగించవచ్చు. • అభిషేకానికి సంబంధించిన పాలు కూడా ఆలయంలో ధరకే లభిస్తాయి. • భగవంతుడు[శ్రీ కాళహస్తీశ్వరుడు మరియు పార్వతి (జ్ఞానప్రసూనాంబికా దేవి) యొక్క దర్శనం అనేది ఆధ్యాత్మిక మనస్సు కలిగిన వారు మాత్రమే ఆనందించగలరు మరియు ఆనందించగలరు. దర్శనం తర్వాత నెలరోజులు మీరు ఇప్పటికీ ఆనందాన్ని అనుభవిస్తారు.మీరు కాల సర్ప దోష పూజను చేస్తే, పూజ ఫలితంగా వచ్చే సానుకూల ప్రకంపనల నుండి ప్రయోజనం పొందేందుకు మీరు నేరుగా పూజ తర్వాత ఇంటికి తిరిగి రావాలని సలహా ఇస్తారు.అంతిమంగా, ముఖ్యమైనది విశ్వాసమే. కాబట్టి, ఆ ప్రదేశాన్ని బహిరంగ మనస్సుతో సందర్శించండి మరియు ఆధ్యాత్మిక అనుభవంలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉండండి.
Read More...
Cultural 

నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం

నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం ఇవాళ్టి నుంచి శ్రావణమాసం ప్రారంభం అయింది. శ్రావణమాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజిస్తారు. సోమ- పరమేశ్వరుడు, మంగళ- గౌరీవ్రతం, బుధ- విఠలేశ్వరుడు, గురు- గురుదేవుడు, శుక్ర-లక్ష్మీదేవి, శని-శనీశ్వరుడు, వేంకటేశ్వరుడికి పూజలు చేయాలని పండితులు తెలిపారు. పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం (ఆగస్టు 16న) వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుతారు. వీటితో పాటు సత్యనారాయణ స్వామి, మంగళగౌరీ వ్రతాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.
Read More...
Cultural 

నేడు గురు పూర్ణిమ ...బాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు

నేడు గురు పూర్ణిమ ...బాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు గుకారశ్చంధకారస్తురుకారస్తన్ని రోధక: అజ్ఙాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ:   భావము: "గు" అంటే అంధకారం/ చీకటి అని అర్థం. ''రు'' అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానమనే చీకటిని తొలగించి గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. అని ఈ శ్లోకార్థం అద్వితీయమైన గురు పరంపరలకు అలవాలం మన భారతదేశం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కతి మనది. గురుకుల విద్యా విధారనం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డలకన్నా మిన్నగా ప్రేమించే వారు. నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు. గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. గురి పూర్ణిమ ఎలా జరుపుకోవాలి? విశిష్టత ఏంటి తెలుసుకుందాం..  గురిపూర్ణిమ ఎందుకు జరుపుకుంటాము? ఆది యోగి, ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణిమినాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతున్నది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞాన బోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతీ శంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను బుక్, యజుస్, సామ, అధర్వణ వేదాలుగా విభజించాడనీ ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురుస్కరించుకుని ఆషాడ పౌర్ణమి నాడు గురుపూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము. గురుర్ర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఆషాఢ శుద్ధపౌర్ణమిని 'గురుపౌర్ణమి' లేదా 'వ్యాసపౌర్ణమి' అని అంటారు.ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారుగురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు.  అసలు ఈ ఆసాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత కు సంబంధించిన కథ తెలుసుకుందాం  దీనికి ఒక చక్కని ప్రాచీన గాధకలదు .పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది.ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు. వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకోమంటారు.ఈ క్రమంలో రేపు నా తండ్రి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు. అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారిగృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠులైన ఆ ముని శ్రేష్ఠుడు.. ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు. ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు. అని బదులు పలుకుతారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు, అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదుముగాక! వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదుముగాక! వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  గురుపూజోత్సవ కార్యక్రమాలు   గురువే అన్నిటికీ మూలం కనుక ఆధ్యాత్మికవిద్య,సామాజిక విద్య బోధించిన గురువులను గౌరవించటం మన భారతీయ సాంప్రదాయం ఈరోజు జ్ఞానం బోధించిన గురువులను గౌరవించే కార్యక్రమాలు నిర్వహిస్తారు   షిరిడి సాయిబాబా ఆలయాల్లో   గురు పూర్ణిమ సందర్భంగా దేశవ్యాప్తంగా షిరిడి సాయిబాబా ఆలయాలలో గురుపూర్ణిమ వేడుకలు నిర్వహిస్తారు పంచామృత అభిషేకాలు, సామూహిక గురు పాదుకా  పూజా కార్యక్రమాలు, సామూహిక సాయి సత్యవ్రతా లు,, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అన్నప్రసాద కార్యక్రమాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు వెల్లివిరుస్తాయి   కరవధిలో  ఒంగోలు మండలం కరవది గ్రామంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో 18 వ ఏడాది గురుపూర్ణిమ వేడుకలు అత్యంత వైభవంగా ఆదివారం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు  కమిటీ నిర్వాహకులు తెలిపారు   ఉదయం ఆరుకు పంచామృత అభిషేకం, 8 కి విశేషాలంకరణ, 10 గంటలకు సామూహిక సత్య వ్రతాలు, 12:30 కు అఖండ అన్నప్రసాద కార్యక్రమం, సామూహిక సాయి నామ సంకీర్తన, 8:45 కు ప్రత్యేక పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు
Read More...
Cultural 

ముందుగా నంది... తరువాతే శివునికి పూజలు

ముందుగా నంది... తరువాతే శివునికి పూజలు భగవంతునికి పూజలు చేస్తుంటాం. వ్రతాలు పాటిస్తాం. తీర్థయాత్రలు చేస్తాం. దేవాలయాలను దర్శిస్తాం. మంచిదే. ఇవన్నీ కర్తవ్యాలే. భగవంతుని ఉనికిని నిరంతరం మన స్పృహలో ఉండేటట్లు చేసే సాధనలివి.కానీ భగవత్ప్రీతికరమైన పనిని మనం విస్మరించరాదు. అదే ధర్మపాలన. ఇది వదిలి ఎన్ని ఆరాధనలు చేసినా దైవం సంతోషించదని అన్ని గ్రంథాలూ చెబుతున్నాయి. ఈ మౌలిక సూత్రాన్ని వదిలి చేసే ఆరాధనలన్నీ కేవలం 'ఫ్యాషన్లు' మాత్రమే.ధర్మం, జీవితం సమాంతర రేఖలుగా ఉంటాయి చాలా మందికి. ఎన్నో అక్రమాలతో ఆర్జన చేసి ఉన్నతస్థితికి ఎదుగుతారు కొందరు. అది అక్రమమని వారికీ తెలుసు. కానీ అందులో కొంత దైవసేవకో, గుడి హుండీకో సమర్పిస్తే పాపం పోతుందని భావిస్తారు. అయితే పాపపు సొమ్ము భగవంతునికి సమర్పిస్తే మహాపాపం వస్తుందని వారికి తెలియదు.భగవత్ కైంకర్యానికి వినియోగించే ద్రవ్యం స్వార్జితమై, సక్రమార్జితమై ఉండాలని శాస్త్రం శాసిస్తోంది.పాపజీవనులు తాత్కాలికంగా భౌతికంగా అభివృద్ధి దశలో ఉన్నపుడు దేవస్థానాలవారు పూర్ణకుంభాలతో స్వాగతించవచ్చు.కానీ దేవుని హృదయం మాత్రం వారిని స్వాగతించదు. శ్రమించి సంపాదించిన చిల్లిగవ్వతో కష్టించి గుడిచేరుకున్న అతిసామాన్యుడు స్వామిని చూసేది క్షణమైనా, స్వామి అతడిని కలకాలం గమనిస్తాడు. స్వామికీ మనకీ దృఢమైన అనుబంధాన్ని ఏర్పరచేది ధర్మమే. ధర్మాన్ని వృషభస్వరూపంగా వేదశాస్త్రాలు వర్ణించాయి.        "వృషోహి భగవాన్ ధర్మః" - ధర్మభగవానుడే వృషభం. ఈ వృషభం తెల్లగా ఉంటుంది. అంటే ధర్మపు లక్షణం స్వచ్ఛత. ధర్మ వృషభానికి నాలుగు కాళ్లు.        అవి 1. సత్యం, 2. అహింస, 3. అస్తేయం, 4. శౌచం        సత్యమంటే ఏమిటి? - ఈ ప్రశ్నకు ఉపనిషత్తు చక్కని సమాధానాన్ని ఇచ్చింది.        "భూతహిత యథార్ధ భాషణమేవ సత్యం" - ప్రాణి హితం కలిగించే యథార్ధ వచనమే సత్యం.        యథార్ధ వచనమే సత్యం (ఉన్నదున్నట్లు మాట్లాడడం) – అని చెప్తే చాలు కదా! కానీ దానికన్నా ముందు 'భూతహితం' ముఖ్యం. ఉన్నదానిని ఉన్నట్లుగా చెప్పడం ఎలాగూ అవసరమే. అయితే అన్ని పరిస్థితుల్లోనూ అది క్షేమకరం కాదు. ప్రాణికోటి క్షేమానికి భంగం కలిగించే సత్యం కూడా అసత్యమే.         ధర్మాన్ని మూర్ఖంగా, మొండిగా కాక ఆచరణశీలమైన విశ్లేషణతో అందించిన ఘనత సనాతన సంస్కృతిలో ఉంది. ఈ విధమైన స్పృహతో, మాటకీ మనసుకీ పొంతన కలిగిన కట్టుబాటుతో ఉండడమే సత్యం.           రెండవది అహింస. మాటతో కానీ, మనసుతో కానీ, క్రియతో కానీ మరొక ప్రాణిని నొప్పించకపోవడమే అహింస.        మూడవది అస్తేయం. స్తేయం అంటే దొంగతనం. అస్తేయం అంటే దొంగతనం లేకపోవడం. ఇళ్లమీదపడి దోచుకోవడమో, పరాయి వాడి ద్రవ్యాన్ని అపహరించడమో మాత్రమే దొంగతనం కాదు. అక్రమార్జననూ దొంగతనం అన్నారు.        ఆర్జనలో అక్రమం ఉండరాదు. అలాగే వినియోగంలోనూ అక్రమం పనికిరాదు. తన బాధ్యతల్ని తాను సరిగ్గా నిర్వర్తించేలా ధనాన్ని వినియోగించాలి.         మాతాపితరులు, భార్యాబిడ్డలు, అన్నదమ్ములు.... ఇలా కుటుంబం పట్ల, సమాజం పట్ల తాను చేయవలసిన కర్తవ్యాలకు ధనాన్ని ఖర్చు చేయాలి.         ఈ విధంగా ఆర్జన, వినియోగం సక్రమంగా ఉండడమే 'అస్తేయం.'          నాలుగవది శౌచం. శుచి కలిగి ఉండడం. ఈ శుచి బాహ్య శుచి, అంతః శుచి - అని రెండు విధాలు. స్నానాదులు బాహ్య శుచి. తీర్ధసేవనం, ఆచారం మొదలైనవి బాహ్యశుచికీ, అంతఃశుచికీ నడుమన ఉంటాయి. అవి మన సూక్ష్మ ప్రపంచాన్ని శుద్ధిచేస్తాయి. అంతః శుద్ధి ఉత్తమ భావాలతో, మనస్సును నిర్మలం చేసుకోవడం. ప్రేమభావన, భగవచ్చింతన, సంతృప్తి మనోనిర్మలతకు సాధనలు.         ఈ నాలుగే ధర్మానికి ప్రధానాధారాలు.         అందుకే ధర్మవృషభానికి నాలుగు కాళ్లు అన్నారు. ఈ వృషభ స్వభావం ఆనందం. ఈ నాలుగూ పాటించేవానికి భయమూ, దుఃఖమూ ఉండవు. సంతుష్టితో కూడిన ఆనందమే ఉంటుంది. ఆనందంగా ఉండడాన్నే 'నంది' అంటారు. అందుకే ధర్మవృషభానికి నందీశ్వరుడని పేరు.         ఈ నంది పరమేశ్వరుని వాహనం. అంటే పరమేశ్వరుడు ధర్మాన్ని అధిష్ఠించి ఉంటాడని అర్ధం. ధర్మం ఎవరి వద్ద ఉంటుందో వారిని అధిష్ఠించి భగవంతుడు ప్రకాశిస్తాడు.         అంతేకాదు - మనం శివాలయానికి వెళితే ముందు నందీశ్వరుని పూజించి, తరువాత శివుని ఆరాధిస్తాం. నంది కొమ్ముల ద్వారా శివుని దర్శిస్తాం.          దీనిలో అంతరార్థం: ముందు ధర్మాచరణ. తద్వారా దేవతార్చన. ధర్మం ద్వారా భగవంతుడు దర్శనమిస్తాడు.         నాలుగు అంశాలను అధ్యయనం చేసి ఆచరణలోకి తెచ్చుకొనే కనీస ప్రయత్నం కూడా చేయనప్పుడు చిత్తశుద్ధి సిద్ధించదు. శుద్ధం కానీ చిత్తం శివార్పణం చేయగలమా!
Read More...
Cultural 

పూరీ జగన్నాథ రథం తయారీకి వాడే కలప ముక్కల సంఖ్య శతాబ్దాలుగా మారడం లేదు తెలుసా ?

పూరీ జగన్నాథ రథం తయారీకి వాడే కలప ముక్కల సంఖ్య శతాబ్దాలుగా మారడం లేదు తెలుసా ? ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుడి రథోత్సవాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి కూడా లక్షల సంఖ్యలో పూరికి చేరుకొంటారు. ఇదిలా ఉండగా దేశంలో ఎక్కడా లేనట్లు ఒక్క పూరిలోని మూల విరాట్టులే ఉత్సవ విగ్రహాలుగా ఊరేగుతాయి. అంతేకాకుండా ప్రతి ఏడాది కొత్త రథాలను తయారు చేస్తారు. ఇది కూడా పూరీ ప్రత్యేకమే. ఇక ఈ రథాల తయారీ ఒక ఒక లెక్క ప్రకారమే సాగుతుంది. అందులో వాడే కలప ముక్కల సంఖ్య శతాబ్దాలుగా ఒకటి ఎక్కువ కాని ఒకటి తక్కువ కాని కావడం లేదు. ఇందుకు సంబంధించిన వివరాలు 1072 ముక్కలు అటు పై 2188 ప్రతి ఏడాది రథాల తయారీకి అవసరమైన చెట్లను ఎంపిక చేసి వాటిని సరిగ్గా 1072 ముక్కలుగా ఖండిస్తారు. అటు పై పూరీకి తరలిస్తారు. ప్రధాన అర్చకుడితో సహా మొత్తం తొమ్మిది మంది శిల్పులు , వారికి సహాయకులు కలిపి 125 మంది ఈ రథాల తయారీలో పాల్గొంటారు. 1072 వృక్ష భాగాలను రథం తయారుచేయడానికి అనువుగా 2188 ముక్కులుగా ఖండిస్తారు. అటు పై వీటిలో 832 భాగాలతో జగన్నాథుడి రథం తయారు చేస్తారు. 45 అడుగుల జగన్నాథుడి రథం అదే విధంగా జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. ఈ రథం ఎత్తు ఎప్పుడూ కూడా 45 అడుగులు ఉంటుంది. మొత్తం 16 చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలు ఉన్న పసుపు రంగం వస్త్రంతో ఈ రథాన్ని అలంకరిస్తారు. 763 భాగాలతో బలరాముడి రథం తయారు చేస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. ఈ రథం ఎత్తు 44 అడుగులు. మొత్తం 14 రథ చక్రాలు ఉంటాయి. దీనికి ఎర్రటి చారలు ఉన్న నీలి రంగు వస్ర్తంతో దీనిని అలంకరిస్తారు. 250 అడుగుల తాళ్లు 593 భాగాలతో సుభద్ర రథాన్ని తయారు చేస్తారు. సుభద్రదేవి రథాన్ని పధ్మధ్వజం అని అంటారు. ఇది 43 అడుగుల ఎత్తు ఉంటుంది. మొత్తం 12 రథ చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలు ఉన్న నలుపు వస్త్రంతో ఈ రథాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల ఎనిమిది అంగుళాల పొడవు ఉండే తాళ్లను కడుతారు. గుండిచా యాత్ర గండిచా యాత్రగా జగన్నాథుని రథయాత్ర ప్రసిద్ధి.  ఉదయం మూల విరాట్లను రథాలపైకి తరలించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. రథాలపై పూరీ గజపతి మహా రాజా దివ్య సింగ్‌ దేవ్‌ ఆలయ సంప్రదాయ రీతుల్లో ఛెరా పొంహరా (చీపురుతో రథాలు తుడిచే కార్యక్రమం) సేవలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం  నుంచి రథాలు లాగేందుకు షెడ్యూల్‌ ఖరారు చేశారు. బహుడా యాత్ర గుండిచా మందిరం నుంచి మూల విరాట్లు శ్రీ మందిరానికి తరలి వచ్చే యాత్ర బహుడా యాత్ర. దీనినే మారురథయాత్రగా పిలుస్తారు. ఈ యాత్ర జరుగుతుంది. మధ్యాహ్నం  పొహండి సేవలు నిర్వహించి మూలవిరాట్లు రథాలపైకి  చేరగానే సాయంత్రం నుంచి ఈ యాత్ర ప్రారంభిస్తారు.  స్వర్ణాలంకారం ఏటా రథ యాత్రను పురస్కరించుకుని రథాలపై మూల విరాట్లకు  స్వర్ణాలంకారం చేస్తారు.  ఈ అలంకారం  సాయంత్రం  పూర్తి చేయాలని నిర్ణయిస్తారు. నీలాద్రి విజే రథాలపై సేవలు , ఉత్సవాలు ముగియడంతో మూల విరాట్లు చివరగా శ్రీ మందిరం రత్నవేదికకు యథావిధిగా చేరుతాయి. రథాలపై నుంచి రత్న వేదికకు మూల విరాట్లు చేరే ఉత్సవం నీలాద్రి విజే.  ఉత్సవం జరుగుతుంది. రథాలపైకి తరలించే మూలవిరాట్లను తరలించడంతో మొదలై రత్న వేదికపైకి చేర్చడంతో వార్షిక రథయాత్రకు తెర పడుతుంది.
Read More...
Cultural 

సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది ఇక్కడే..

సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది ఇక్కడే.. బీహార్: రామాయణ కావ్యం అంటే తెలియని వారు ఎవరుంటారు. మన భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో సీతారాములు తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే బీహార్‌లోని ముంగేర్‌లో రామాయణానికి సంబంధించిన అనేక ప్రదేశాలు ఉన్నాయి.వాటిలో ఒకటి సీతా కుండ్. సీత మాత ఇక్కడే అగ్నిపరీక్షకు నిలిచిందని పురాణాలు చెబుతున్నాయి. సీతాదేవి ఎక్కడ అగ్నిప్రవేశం చేసిందో అక్కడ వేడి నీటి చెరువు ఏర్పడిందని, ఈ నీళ్లు ఎల్లప్పుడూ వేడిగా ఉంటుందని చెబుతారు. ఈ ప్రదేశాన్ని రామతీర్థం అని కూడా అంటారు. ఈ చెరువులో ఉండే నీరు ఎప్పుడూ వేడిగా ఉండటానికి కారణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. సీతా కుండ్ నీళ్లు.. ఆలయ ప్రాంగణంలోని సీతాకుండ్‌తో పాటు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్న పేర్లతో సమీపంలో నాలుగు చెరువులు కూడా ఉన్నాయి. అయితే సీతా కుండ్‌లోని నీరు ఎప్పుడూ వేడిగా ఉంటుంది. కాగా మిగిలిన నాలుగు చెరువుల నీరు చల్లగా ఉంటుందని చెబుతున్నారు. ఇది ఇప్పటికీ ప్రజలకు పరిష్కారం కాని పజిల్‌లా ఉంది. శాస్త్రవేత్త పరిశోధన.. సీతా కుండ్‌లోని వేడి నీటి రహస్యాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధనల కోసం ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఈ మిస్టరీని ఎవరూ ఛేదించలేకపోయారు. పరిశీలన అనంతరం ఈ చెరువు పొడవు, వెడల్పు 20 అడుగులు కాగా, చెరువు 12 అడుగుల లోతు ఉందని చెప్పారు. అలాగే పరీక్ష నిర్వహించి ఎనిమిది నెలల పాటు ఇక్కడి నీరు స్వచ్ఛంగా ఉంటుందని తెలిపారు. వేసవిలో నీటి ఉష్ణోగ్రత తగ్గుతుందని ఆయన చెప్పారు. మాఘమాసంలో ప్రత్యేక జాతర.. ప్రజలు ఏడాది పొడవునా సీతా కుండ్‌ని సందర్శించడానికి వస్తూనే ఉంటారు. కానీ మాఘమాసంలో ప్రత్యేక జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలో చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి సీతా కుండ్‌లోని వేడి నీటిలో స్నానం చేసి ఆలయంలో పూజలు చేస్తారు. ఈ జాతర నెల రోజుల పాటు కొనసాగుతుంది.
Read More...
Cultural 

||శ్రీ మాత్రే నమః || ఆలస్య వివాహం

||శ్రీ మాత్రే నమః || ఆలస్య వివాహం వివాహం ఆలస్యం కావడం ఒకటే కాదు. జాతకాదుల్లో దోషాలు కనపడినప్పుడు ఆ దోషాలు వైవాహిక జీవన ఆనందానికి కూడా లోపం అవుతాయి. వాటిని ముందుగానే గమనించి తగిన నివారణ చర్యలు చిన్నప్పటి నుంచే చేసుకోవడం మంచిది. వివాహమనేది జీవితంలో అతిముఖ్యమైన ఘట్టం. ఆధ్యాత్మిక శాస్త్రాలనుసరించి అది ఒక సంస్కారం. వ్యక్తిని సంస్కరించడానికి ఉపకరించే ఈ ప్రక్రియ ఆనందప్రదంగానూ, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేదిగాను ఉండాలి. లగ్నంలో తాను, సప్తమంలో సామాజిక సంబంధాలు ఉంటాయి. చంద్రుడు మనఃకారకుడు కావడం వలన చంద్రుడు ఉన్న స్థానాన్ని పరిశీలించడం జరుగుతుంది. రవి ఆత్మశక్తికి లగ్నం శరీర శక్తికి ప్రాధాన్యం వహించడం వలన ఆ రెండింటిని కూడా పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తుంది. కళత్రకారకుడైన శుక్రగ్రహ స్థితి పరిశీలించడం ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఇక ఏ శుభకార్యానికైనా గురుబలం కావాలి కాబట్టి గురుదృష్టి వీక్షణం గమనించాలి. వివాహ విషయంలో ప్రధానంగా కుజ, శని, రాహు గ్రహ స్థానాలను పరిశీలించాలి. వాటితో పాటుగా జాతకంలో ద్వితీయస్థానం కుటుంబస్థానం, సప్తమం- కళత్రస్థానం, వ్యయస్థానం, పంచమస్థానాలను, గ్రహదృష్టులు గ్రహ యుతులు గమనించాలి. అష్టమం సౌభాగ్యస్థానం, సప్తమం భర్తృస్థానం చూడాలి.
Read More...