Category
State
Local  State 

కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ 

కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్  ప్రకాశం జిల్లా:  మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు అని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. నియోజకవర్గం లోని పీసీ పల్లి మండలం దివాకరపల్లి ప్రాంతం లో సిబిజి ప్లాంట్ కు భూమి పూజ చేసేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అశేష జనం తరలివచ్చారు.  ఈ సభలో ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కనిగిరి కి ఈ ప్రాజెక్టు ను అడగగానే తీసుకు వచ్చారని, అందుకే తను కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని సంబోధించినట్లు ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ , కార్యక్రమ ఆధ్యంతం శాసనసభ్యుని ప్రశంసలతో అభినందించారు. ఈ మారుమూల ప్రాంతంలో ఇంకా ఎన్నెన్నో కంపెనీలు వస్తాయని, ఈ ప్రాంతపు నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు దొరుకుతాయని వలసలు అరికట్టవచ్చని ఈ ప్రాంతం కూడా సస్యశ్యామలవుతుందని ఆయన అన్నారు. త్వరలో ట్రిపుల్ ఐటీ కి శంకుస్థాపన కూడా చేస్తామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహ రెడ్డికి   ప్రభుత్వం అన్ని విధాల  అండగా ఉంటుందని లోకేష్ బాబు భరోసా ఇచ్చారు.
Read More...
State 

వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించడం అంటే భూకబ్జా దారులను వెనకేసుకు రావడమే

వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించడం అంటే భూకబ్జా దారులను వెనకేసుకు రావడమే విజయవాడ: వక్ఫ్ సవరణ బిల్లు గురించి విపక్ష పార్టీలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించే పార్టీలు బిల్లులోని అంశాలను లేవనెత్తి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పారు.. విపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా వక్ఫ్ బిల్లు ముస్లిం సమాజానికి, వారి మత విశ్వాసాలకు ఎలాంటి ఆటంకం కలిగించదని అన్నారు. ఈ బిల్లు తీసుకురాకపోతే, సాధారణ ప్రజల నివాస స్థలాలను కూడా వక్ఫ్‌ ఆస్తిగా చూపించే ప్రమాదం పొంచి ఉందన్నారు.  ప్రస్తుతం వక్ఫ్ బోర్డుల్లో అవినీతి ఎక్కువగా ఉందని.. ఈ బిల్లుని వ్యతిరేకించడమంటే భూకబ్జాదారులను వెనకేసుకురావడమే అన్నరాయన.. మరోవైపు పేద ముస్లింల కోసం వక్ఫ్‌ ఆస్తులను ఉపయోంచి వారి ఉన్నతి కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ముస్లిం ప్రతినిధులు ఆ బిల్లును ఆహ్వానించారన్న ఆయన.. వీలైనంత త్వరగా ఈ బిల్లు కార్యరూపం దాల్చి పేద ముస్లింలకు మేలు జరగాలని వారు కోరుకుంటున్నారని వెల్లడించారు.
Read More...
State 

దేశవ్యాప్తంగా టోల్ చార్జీల పెంపు..!

దేశవ్యాప్తంగా టోల్ చార్జీల పెంపు..! విజయవాడ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఎఐ) దేశంలోని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేల టోల్ ఛార్జీలపై సగటున 4 నుంచి 5 శాతం వరకు పెంచింది. దేశవ్యాప్తంగా సవరించిన టోల్ ఛార్జీలు మంగళవారం(ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వచ్చాయని హైవే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. ప్రతి ఏటా సమీక్షలో భాగంగా పెంపు ప్రక్రియను చేపడుతున్నట్టు ఎన్హెచ్ఎఐ పేర్కొంది.
Read More...
State 

కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింపు

కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింపు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు 41 రూపాయలు తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ రేట్ రూ.1,762కు చేరింది. ప్రతినెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు ధరలను సవరిస్తాయి. అందులో భాగంగానే రేట్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
Read More...
State 

రూ. లక్ష లంచం తీసుకుంటూ ఎసిబి కి చిక్కిన జిల్లా రిజిస్ట్రార్ 

రూ. లక్ష లంచం తీసుకుంటూ ఎసిబి కి చిక్కిన  జిల్లా రిజిస్ట్రార్  కాకినాడ: జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు, అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్పష్టమైన సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు నిర్వహించి.. నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కిశోర్బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. తునికి చెందిన ఆర్. రమేశ్బాబు తన భార్య పేరిట ఉన్న సమత గ్యాస్ ఏజెన్సీని కొన్ని కారణాల వల్ల తన పేరు మీదకు మార్చాలని జిల్లా రిజిస్ట్రార్ను ఆశ్రయించారు. అందుకు ఆయన రూ. లక్ష డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆనందరావు నుంచి రూ. లక్ష, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి నుంచి రూ.25వేలు, అనధికారికంగా ఉన్న మరో రూ.80వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన డాక్యుమెంట్ రైటర్ వెలుగుల జగదీశ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
Read More...
Local  State 

మాజీ సీఎం జగన్ ని కలిసిన వైసీపీ నేత మురారి 

మాజీ సీఎం జగన్ ని కలిసిన వైసీపీ నేత మురారి  తర్లుపాడు/తాడేపల్లి : తర్లుపాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు, ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లతో కలిసి మురారి వెంకటేశ్వర్లు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసి తర్లుపాడు మండల రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మండల బాధ్యులు అన్ని గ్రామాల్లో పార్టీని పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, నాయకులను, కార్యకర్తలను కాపాడుకోవాలని సూచించినట్లు మురారి వెంకటేశ్వర్లు తెలిపారు.
Read More...
Local  State 

మాజీ సీఎం జగన్ ని కలిసిన మార్కాపురం మండల నాయకులు 

మాజీ సీఎం జగన్ ని కలిసిన మార్కాపురం మండల నాయకులు  మార్కాపురం : తాడేపల్లి కేంద్ర కార్యాలయం నందు రాష్ట్ర మాజి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని మార్కాపురం మండల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు తో కలిసి మండల ఎంపిటీసీ లు, జెడ్పీటీసీ, ఇన్చార్జి ఎంపీపీ లు కలిశారు. ఈ సందర్భంగా మార్కాపురం మండల రాజకీయ పరిస్థితులపై,నియోజకవర్గంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులను, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, జగన్ మోహన్ రెడ్డి కి వివరించారు. జగన్ ని కలిసిన వారిలో ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు.
Read More...
State 

నల్లమల అటవీ ప్రాంతంలో పెరుగుతోన్న పులుల సంఖ్య

నల్లమల అటవీ ప్రాంతంలో పెరుగుతోన్న పులుల సంఖ్య ఏపీలో నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వు (NSTR) ప్రాంతంలో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ అభయారణ్యంలో 2023లో 74 పులులు ఉండగా.. 2024లో వాటి సంఖ్య 76కు చేరిందని అటవీశాఖ అధికారులు లెక్కగట్టారు. వీటిలో 40 ఆడ పులులు కాగా.. 32 మగవి అని చెప్పారు. మరో నాలుగింటి జెండర్ గుర్తించలేకపోయారు. అలాగే వీటితో పాటు మరో 11 పులి కూనలూ ఉన్నట్లు వివరించారు.
Read More...
State 

వేసవి సెలవుల్లో మార్పు..! ఏప్రిల్ 7 నుండి అడ్మీషన్లు..!!

వేసవి సెలవుల్లో మార్పు..! ఏప్రిల్ 7 నుండి అడ్మీషన్లు..!! విజయవాడ: ఇంటర్ విద్యలో కీలక మార్పుల అమలుకు ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఏటా జూన్ 1న ప్రారంభమయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం ఈ ఏడాది APR 1న మొదలుకానుంది. 7న అడ్మిషన్లు స్టార్ట్ చేసి 24 వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఆపై మే నెలాఖరు వరకు సెలవులుండగా, జూన్ 2న తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయి. మొత్తం 235 రోజులు తరగతులు జరగనున్నాయి. వేసవి సెలవులు కాకుండా 79 హాలిడేస్ ఉంటాయని ఎపి ఇంటర్ విద్యామండలి ప్రకటించింది.
Read More...
State 

స్థానిక సంస్థల ఉపఎన్నికలకు మోగిన నగారా!

స్థానిక సంస్థల ఉపఎన్నికలకు మోగిన నగారా! స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులను పరోక్ష పద్ధతిలో భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ▪️ఈ నెల 27న ఉప ఎన్నికలు నిర్వహించనుంది. ▪️కడప జెడ్పీ ఛైర్పర్సన్, కర్నూలు జెడ్పీ కోఆప్టెడ్ మెంబర్. ▪️ఎంపీపీలు - 28, వైస్ ఎంపీపీలు - 19, మండల ప్రజాపరిషత్లో కోఆప్టెడ్ సభ్యులు - 12. ▪️వివిధ జిల్లాల్లో 214 ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించనుంది.పదవుల భర్తీకి వేర్వేరుగా 7 నోటిఫికేషన్లు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఆయా జిల్లా ఎన్నికల అధికారులను సంప్రదించగలరు.
Read More...
State 

ఎపి కేబినెట్ భేటీ ముఖ్యాంశాలు..!

ఎపి కేబినెట్ భేటీ ముఖ్యాంశాలు..! సచివాలయంలో సిఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది.  ▪️రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు నిర్ణయం.▪️ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. ▪️రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం.▪️ఎస్సీ వర్గీకరణ అంశంపైనా అంశంపై ఇటీవల రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయం. రాష్ట్ర యూనిట్ గా వర్గీకరణ అమలు చేయాలని నిర్ణయం.▪️నంబూరులో వీవీఐటీయూకు ప్రైవేటు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం.▪️అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం.పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం పచ్చజెండా.వైఎస్సార్ జిల్లాకు కడప యాడ్ చేసి.. వైఎస్సార్ కడప జిల్లాగా నామకరణము. గత ప్రభుత్వ కాలంలో కడప పేరు తొలగింపు.వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరు ఇకపై తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ కేబినెట్ నిర్ణయం.సిఎం కార్యాలయంలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులకు ఆమోదం.
Read More...
State 

ఆరెస్సెస్ గురించి ప్రధాని మోడీ ఏమన్నారు?

ఆరెస్సెస్ గురించి ప్రధాని మోడీ ఏమన్నారు? పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు ప్రస్తావించిన విషయాలలో ఒకటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మరియు సంఘ్ ప్రేరణతో నడిచే సంస్థల గురుంచి వారి మాటల్లో..... ◆రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో శాఖ నడుస్తుంది.శాఖలో ఆటపాటలు నడిచేవి, దేశభక్తి గీతాలు పాడేవాళ్ళం, చాలా ఆనందంగా అనిపించేది, మనసుకు చాలా బాగా అనిపించేది, అలాగే సంఘ్ లోకి వచ్చాం, సంఘ్ సంస్కారం అందింది. ఏదైనా చదవండి, ఆలోచించండి కానీ ఒకటి మాత్రం ఆలోచించండి, ఏది చేసినా దేశానికి ఉపయోగపడాలి, వ్యాయామం చేసిన ఎంత చేయాలంటే దేశానికి నా శరీరం ఉపయోగ పడాలి, ఇదే సంఘ్ నేర్పుతుంది, సంఘ్ ఒక చాలా పెద్ద సంస్థ. ◆ఈ సంవత్సరం సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ప్రపంచంలో ఇంత పెద్ద స్వయం సేవక  సంఘ్ ఉందని నేనైతే వినలేదు.కోట్ల మంది సంఘ్ తో అనుసంధానమై ఉన్నారు, సంఘ్ ను అర్థం చేసుకోవడం అంత సులువైన పని కాదు, సంఘ్ పనితీరును అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.◆సంఘ్ స్వయంగా “జీవిత ఉద్దేశ్యం” ఏంటి అనే విషయం వైపు మీకు దారి చూపుతుంది, దేశమే సర్వోపరి, ప్రజా సేవ చేయడమే భగవంతుడి సేవ చేయడం అనే భావన, మన  వేదకాలం నుంచి చెప్పబడినది, మన  ఋషులు చెప్పినదే, వివేకాందుడు చెప్పినదే సంఘ్ నేర్పుతుంది. ◆సంఘ్ నుంచి మీకు ప్రేరణ అందింది, కేవలం శాఖకు రావడం, గణవేష్ ధరించడం సంఘ్ కాదు సమాజానికి ఉపయోగ పడాలని అంటుంది సంఘ్. ఇదే ప్రేరణతో కొన్ని అద్భుతమైన పనులు జరుగుతున్నాయి.◆కొంత మంది స్వయంసేవకులు సేవాభారతి అనే సంస్థను ప్రారంభించారు, పేదవారు ఉండే మురికివాడలను సేవాబస్తీ అంటారు.నాకు ఉన్న కొద్దిపాటి సమాచారం మేరకు అక్కడ దాదాపు 1.25 లక్షల సేవా కార్యక్రమాలు నడుపుతున్నారు, ఏ ప్రభుత్వ సహాయం లేకుండా కేవలం సమాజ మద్దతుతో అక్కడికి వెళ్లడం, వాళ్ళతో  గడపడం, పిల్లలకు పాఠాలు చెప్పడం, వారి ఆరోగ్యం గురించి ఆలోచించడం, వారికి సంస్కృతి సంస్కారాల గురించి తెలపడం, అక్కడ స్వచ్ఛత కార్యక్రమాలు నడపడం, చిన్న పెద్ద అనే విషయం కాదు.  ◆కొందరు స్వయం సేవకులు ఉన్నారు, సంఘ్ కే సమర్పితమయ్యారు, వారు వనవాసి కళ్యాణ్ ఆశ్రమాన్ని నడుపుతున్నారు,వారు  అడవులలో ఆదివాసుల  మధ్యనే ఉంటూ సేవ  చేస్తున్నారు 70వేలకు పైగా “వన్ టీచర్ వన్ స్కూల్” (ఏకోపాధ్యాయ పాఠశాలలు ) నడుపుతున్నారు. అమెరికాలో ఉంటున్న కొందరు ఈ పని కోసం విరాళాలను కూడా అందచేస్తున్నారు, ఈ నెల ఒక కోకాకోలా తక్కువ తాగుదాం, అదే డబ్బును  ఏకల్ విద్యాల్ కోసం సమర్పిద్దాం అనే వాళ్ళు ఉన్నారు. 70వేల  ఏకల్ విద్యాలయాలు ఆదివాసీల కోసం నడపడం  పెద్ద విషయం.   ◆కొందరు స్వయంసేవకులు విద్యాభారతీ అనే సంస్థను ప్రారంభించారు. దేశమంతటా దాదాపు 25వేల  పాఠశాలలు నడుస్తున్నాయి, 30 లక్షల మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. అతి తక్కువ ఫీజుతో  కోట్ల మంది విద్యను పొందుతున్నారు, అక్కడ సంస్కారం కూడా నేర్పుతున్నారు.వాస్తవ పరిస్థితులను గ్రహించి ఏదో ఒక నైపుణ్యం పొంది సమాజంపై బరువుగా మారకుండా సంఘ్ ప్రేరణ ఇస్తుంది.  ◆సమాజంలోని అన్ని రంగాల వారు మహిళలు, పిల్లలు, శ్రామికులు కూడా సంఘ్ లో  ఉన్నారు.కార్మికుల కోసం భారతీయ మజ్దూర్ సంఘ్ ఉంది, ఆ సంస్థకు దాదాపు 55వేల ట్రేడ్  యూనియన్లు ఉన్నాయి, కొన్ని కోట్ల మంది సభ్యత్వం తీసుకుని ఉన్నారు, ప్రపంచంలోనే ఇంత పెద్ద శ్రామిక యూనియన్ ఉండదేమో, లెఫ్టిస్ట్ భావజాలం వారు శ్రామికుల కోసం పని చేస్తామని నేర్పుతున్నారు. వారి నినాదం  “ప్రపంచ కార్మికులరా ఏకం అవ్వండి” అంటుంటారు, ఇది వాళ్ళ భావం, కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖల నుంచి భారతీయ మజ్దూర్ సంఘ్ లో ఉన్నవారు  ఏంటారు? “ కార్మికులారా  ప్రపంచాన్ని ఏకం చేద్దాం” వాళ్ళు “ప్రపంచ కార్మికులరా ఏకం అవ్వండి అంటారు” వీళ్లు “ కార్మికులారా ప్రపంచాన్ని ఏకం చేద్దాం అంటారు” ఈ వాక్యాలలో పదాలు అటు ఇటుగా ఉంటాయి కానీ చాలా పెద్ద సైద్ధాంతిక భేదం ఉంది.◆◆సంఘ నుంచి వచ్చిన వ్యక్తులు తమ జీవన విధానం , సంఘం సూచించిన పద్దతిలో  పని చేస్తూ  ఇంతటి మార్పును తెస్తున్నారు. ఈ పనులన్నిటినీ గమనించినప్పుడు 100 సంవత్సరాలలో ప్రపంచ సుఖాల నుంచి దూరంగా ఉంటూ ఒక సాధకుడిలా సమర్పిత భావంతో, ఇలాంటి పవిత్రమైన సంస్థ నుంచి నాకు సంస్కారం అందడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
Read More...