Category
State
State 

వాలంటీర్ లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వాలంటీర్ లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు మంగళగిరి :వాలంటీర్ లపై ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.‌ వాలంటీర్ల పదవీకాలం ఏడాది క్రితమే పూర్తైతే, రెన్యూవల్ చేయలేదు. వాళ్ల పేరోల్స్ (జీతాల బిల్లులు) కూడా లేరు. వైసీపీ నేతలు చేసిన పనికి వాలంటీర్లు అనే వాళ్లు రికార్డు ల్లోనే లేకుండా పోయారు. కానీ మనం 3 నెలల జీతం ఇచ్చాం. కొందరు రాజీనామా చేశారు. చేయని వాళ్లకు ఇచ్చిన ఆర్డర్ కు కూడా గడువు ముగిసింది అని సీఎం వ్యాఖ్యానించారు.
Read More...
State 

జమిలీ ఎన్నికలకు సిద్దమైన కేంద్రం

జమిలీ ఎన్నికలకు సిద్దమైన కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోది అద్యక్షతన కొత్త దిల్లీలో బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్-4  మిషన్ కి 2 వేల 104 కోట్లకు.. గిరిజన గ్రామాల అభివృద్దికి 79వేల 516 కోట్లు కేటాయింపుల చేసిందన్నారు.పీఎం ఆశా పథకానికి 35 కోట్లు కేటాయింపులతో పాటు.. పోషకాల ఆధారిత సబ్సిడికీ 24వేల 475 కోట్లు కేటాయింపుల చేసిందన్నారు.యువతకు సృజనాత్మక, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.బయో మానుఫాశ్చరింగ్, బయో ఫౌండ్రీ కోసం 9వేల 197 కోట్లకు కేంద్ర ఆమోదం తెలిపినట్లు వివరించారు.వీనస్ ఆర్బిట్ మిషన్ కి కేంద్ర ఆమోదించినట్లు మంత్రి పేర్కొన్నారు.
Read More...
State 

తిరుమల ప్రసాదం విషయంలో ఎలాంటి ప్రమాణానికైన సిద్ధం - వైవీ

తిరుమల ప్రసాదం విషయంలో ఎలాంటి ప్రమాణానికైన సిద్ధం - వైవీ విజయవాడ: తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. 'కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసి చంద్రబాబు పెద్ద పాపమే చేశారు అని మండిపడ్డారు.రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా ఆయన వెనుకాడరని మరోసారి నిరూపితమైందని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.ఈ విషయంలో ఆ దేవదేవుని సాక్షిగా కుటుంబంతో కలిసి ఎలాంటి ప్రమాణం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానంటూ ,మరి చంద్రబాబు సిద్ధమా?' అని సవాల్ విసిరారు.
Read More...
State 

ఆ ఇద్దరు హీరోల మధ్య సినిమా తెచ్చిన తంటాలు...!

ఆ ఇద్దరు హీరోల మధ్య సినిమా తెచ్చిన తంటాలు...! టాలీవుడ్‌లో నందమూరి, మెగా హీరోల మధ్య పోటీ తొలి నుంచి నడుస్తోంది. ఇక నందమూరి, మెగా అభిమానుల మధ్య కూడా అదే స్థాయిలో  అదే స్థాయిలో యుద్ధం నడుస్తుంది. చివరికి ఈ పోటీ కులాల మధ్య చిచ్చుపెట్టే స్థాయికి చేరుకుందనేది వాస్తవం. రెండు కుటుంబాలకు చెందిన ప్రముఖ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి ఎన్నో కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు... ఇక వీరిద్దరి వారసులు ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి స్నేహితులు... వీరిద్దరు కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక మెగా సోదరుడు పవన్ కల్యాణ్.. నందమూరి అల్లుడు చంద్రబాబుతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. నందమూరి, మెగా కుటుంబాలు కలిసే ప్రస్తుతం ఏపీలో రాజకీయ చక్రం తిప్పుతున్నాయనేది కూడా వాస్తవం.  అయినా సరే... అభిమానుల మధ్య ఇప్పటికీ తమ హీరోనే గొప్ప అనే పోటీ తత్వం మాత్రం పోలేదు. ఇదే విషయం మరోసారి రుజువైంది. అది కూడా ఓ సినిమా ద్వారా ఆ చిచ్చు రాజుకుంది. నార్నే నితిన్ హీరోగా నటించిన సినిమా ఆయ్. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ సాధించింది. ఇక సినిమా రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. బిగ్ స్క్రీన్ మీద కంటే... ఓటీటీలోనే ఆహా ఎక్కువ రికార్డులు సృష్టిస్తోంది. కామెడీ మస్తుంది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇదే సమయంలో ఆయ్‌ సినిమాలోని ఓ సన్నివేశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కుల పిచ్చి పీక్స్ అంటూ చెప్పే ఓ సీన్‌లో హీరోయిన్ తండ్రి వీరయ్య వెనుక ఆదిత్య 369లో శ్రీ కృష్ణదేవరాయలు గెటప్‌లో ఉన్న బాలకృష్ణ కటౌట్ చూపించారు.. వీరయ్యకు తిరుగే లేదు అని గొప్పగా ఎలివేషన్ కూడా ఇచ్చాడు దర్శకుడు. అయితే వీరయ్యను కొట్టిన ఒకే ఒక్క మగాడు బూరయ్య అంటూ హీరో తండ్రి క్యారెక్టర్‌ను చూపించాడు. ఆయితే ఆ చూపించే సమయంలో ఖైదీ సినిమాలో చిరంజీవి కటౌట్ వేసేశాడు. ఇదే నందమూరి, మెగా అభిమానుల మధ్య చిచ్చుకు కారణమైంది. మా హీరో కింగ్ అని.. కాదు మా హీరో సూపర్ అని... సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. సినిమా మీద నుంచి... క్రమంగా కులాలపై కూడా కొందరు వ్యక్తిగత కామెంట్లు చేసుకునే స్థాయికి ఈ మాటల యుద్దం చేరుకుంది. మరి ఈ ఫ్యాన్ వార్‌కు నందమూరి, మెగా హీరోలు ఎలా బ్రేక్ చెప్తారో వేచి చూడాలి.
Read More...
Stories  State 

ఆ విషయంలో టీడీపీ ఫెయిల్...!

ఆ విషయంలో టీడీపీ ఫెయిల్...! అమరావతి: ఏపీలో వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం. అయితే వంద రోజుల్లోనే కావాల్సినంత అపకీర్తి మూట గట్టుకున్నారు సీఎం చంద్రబాబు... అయితే అదంతా కేవలం సోషల్ మీడియాలోనే. అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టారు. మెగా డీఎస్సీ ప్రకటించారు.. పింఛన్‌ను రూ.వెయ్యి పెంచారు.. వివాదాస్పదమైన భూ హక్కు చట్టం రద్దు చేశారు.. రాజధాని అమరావతి ప్రాంతంలో పనులపై దృష్టి పెట్టారు.. ఏపీకి జాతీయ స్థాయి ప్రాజెక్టులు రాబట్టడంలో సఫలమయ్యారు.. వీటన్నిటితో పాటు రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లు  సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఇక విజయవాడ వరదలను సమర్థంగా ఎదుర్కొన్నారు.. బాధితులకు అండగా నిలిచారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టనున్నారు.. పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు.. అయితే ఇవన్నీ కూడా జనాలకు తెలియకుండా మభ్య పెట్టేందుకు వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని మాత్రం అడ్డుకోలేకపోతుంది కూటమి ప్రభుత్వం.ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతో వేగంగా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంటర్ నెట్ అందుబాటులోకి రావడంతో... ప్రతి చిన్న విషయం కూడా వెంటనే తెలిసిపోతుంది. దీనినే వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే... ముందు దానిపై నెగిటివ్ ప్రచారం చేయడంలో మునిగిపోతున్నారు. ఉదాహరణకు రాజధాని అమరావతి ముంపు ప్రాంతమని ప్రచారం చేశారు... తర్వాత విజయవాడ కోసం రాజధానిని కాపాడారని వైరల్ చేశారు... తర్వాత అసలు అమరావతి ప్రాంతం రాజధానిగా పనికిరాదని పోస్టులు పెట్టారు.. ఇక తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కూడా దుష్పాచారం చేశారు. టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుగా ప్రచారం చేశారు. చివరికి టీటీడీ జేఈవో స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. వాస్తవానికి అభివృద్ధి వికేంద్రీకరణం అనేది చంద్రబాబు మాట. అందుకే 2014 ప్రభుత్వంలో రాయలసీమలో పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో ఫార్మా హబ్‌, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం, కోస్తాంధ్రలో రాజధాని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా మాత్రం... అమరావతిపై విషం చిమ్ముతోంది. కూటమి ప్రభుత్వం నిధులన్నీ అమరావతికే పెడుతోందని... ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను కనీసం పట్టించుకోవడం లేదని ప్రచారం చేస్తున్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచి పచ్చ మీడియా, ఈవీఎం సీఎం అంటూ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వారిపై కనీసం చర్యలు తీసుకోవడం లేదు. ఏదో ఒకరిద్దరిని అదుపులోకి తీసుకున్నా కూడా... స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. బయటకు వచ్చిన వాళ్లు... మళ్లీ అదే పనిగా కూటమి ప్రభుత్వాన్ని, వ్యక్తిగతంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. చివరికి ఆగస్టు 25 వరకు మహిళా కమిషన్ ఛైర్మన్‌గా వ్యవహరించిన వైసీపీ నేత గజ్జల వెంకటలక్ష్మి.. పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా సీటు ఖాళీ చేయడం లేదు. పైగా ముఖ్యమంత్రి పైనే వ్యక్తిగత కామెంట్లు చేస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా... కూటమి ప్రభుత్వం... ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కనీస చర్యలు తీసుకోవటం లేదు. దీంతో మహిళలపై కూడా నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు వైసీపీ కార్యకర్తలు.
Read More...
State 

ఏసీబీకి చిక్కిన ఎంఈఓ

ఏసీబీకి చిక్కిన ఎంఈఓ అనంతపురం:  నగరంలోని  బళ్ళారి బైపాస్ రోడ్ లో 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు  పట్టుబడిన ఎంఈఓ.కూడేరు ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు.గొటుకూరు వద్దగల వెరీ డైన్ ఎ కాల్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి  2 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ఎంఈఓ.ఏసీబీ అధికారులను ఆశ్రయించిన పాఠశాల యాజమాన్యం.పాఠశాలకు చెందిన సాగర్ అనే వ్యక్తి నుండి డబ్బులు తీసుకుంటూ అనంతపురం బైపాస్ లోని ఎంజి పెట్రోల్ బంకు వద్ద రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఎంఈఓ.
Read More...
State 

ఇక నుంచి మండలానికి ఒక ఎంఈఓ మాత్రమే

ఇక నుంచి మండలానికి ఒక ఎంఈఓ మాత్రమే అమరావతి:  గత ప్రభుత్వం మండలానికి ఇద్దరు ఎం ఈఓలను నియమించిన సంగతి తెలిసిందే.ఈ పాలసీని కాదని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం మండలానికి ఒక ఎంఈఓ మాత్రమే ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసింది.దీంతో‌ ఇప్పటివరకు రెండవ ఎంఈఓ గా వ్యవహరించిన వారు తిరిగి పాఠశాల కు వెళ్ళాల్సి ఉంటుంది.
Read More...
State 

మోడీ జన్మదినం సందర్భంగా వృద్దులకు మెడిసిన్స్ పంపిణీ చేసిన డాక్టర్ ఏలూరి

మోడీ జన్మదినం సందర్భంగా వృద్దులకు మెడిసిన్స్ పంపిణీ చేసిన డాక్టర్ ఏలూరి హైదారబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు  వేడుకలు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో  మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్ ఆర్ సి లాబొరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్, బిజెపి నాయకులు డాక్టర్ ఏలూరి కూకట్ పల్లిలోని రాజేశ్వరి వృద్ధుల ఆశ్రమంలో వయో వృద్దులకు ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఏలూరి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన పురోభివృద్ధి తో ముందుకు వెళుతుందని దీంతో అంతర్జాతీయంగా మన దేశానికి ఎంతో గౌరవం పెరిగిందని అన్నారు. మోడీ సంస్కరణల పలితంగా  నేడు దేశంలో  జీడీపీ వృద్ధిరేటు పెరిగిందని అన్నారు.ముఖ్యంగా పారిశ్రామికంగా  ఎంతో అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు.మోడీ పాలన పట్ల ముఖ్యంగా యువతి, యువకులు ఆకర్షితులవుతున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రా రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ రెడ్డి ,ఐస్ క్రీమ్ అధినేత ఎస్. వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More...
State 

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 30 మందికి గాయాలు

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 30 మందికి గాయాలు AP: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును రామాపురం మండలం మేదరపల్లి చెక్ పోస్టు వద్ద లారీ ఢీకొట్టింది.ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జేసీబీ సాయంతో బస్సును, లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More...
State 

బాలాపూర్ గణేష్ లడ్డూ ధర 30 లక్షల వెయ్యి రూపాయలు

బాలాపూర్ గణేష్ లడ్డూ ధర 30 లక్షల వెయ్యి రూపాయలు హైదరాబాద్: బాలాపూర్ లడ్డూ ధర 30 లక్షల వెయ్యి రూపాయలు పలికింది. ప్రతి ఏటా బాలాపూర్ గణేష్ లడ్డూ ధర సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. గతేడాది రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డూ ధర. తొలిసారి బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం పాట 1994లో ప్రారంభమైంది. అప్పట్లోనే రూ.450 కు కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. ఆ లడ్డూను అతడు తన కుటుంబ సభ్యులకు పంచి.. మిగిలిన దానిని తన పొలంలో చల్లు కోవడంతో ఆయనకు బాగా కలిసి వచ్చినట్లు అతడే తెలిపాడు. అలా.. ఏడాదికి ఏడాది ఈ వేలం పెరుగుతూ వస్తోంది. గతేడాది రూ.27 లక్షలకు దాసరి దయానందరెడ్డి సొంతం చేసుకున్నాడు. అయితే ఈ ఏడాది ఈ లడ్డూ ధర 30.01 లక్షలకు కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు.
Read More...
Stories  State 

బాబోయ్.. ఒక్క పదవికి ఇంత మంది పోటీ పడుతున్నారా....!

బాబోయ్.. ఒక్క పదవికి ఇంత మంది పోటీ పడుతున్నారా....! ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నేతలంతా నానా పాట్లు పడ్డారనేది వాస్తవం. కొందరు నేతలైతే.. జైలుకు కూడా వెళ్లారు. కొంతమందిని మానసికంగా వేధించింది గత వైసీపీ ప్రభుత్వం. దీంతో చాలా మంది సీనియర్లు రాజకీయాలకు దూరమయ్యారనేది వాస్తవం. అయితే కాలం కలిసి రావడంతో... 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో విజయం సాధించింది. దీంతో సీనియర్ నేతలంతా ఇప్పుడు పదవుల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల కోసం కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అధినేత మాత్రం రేపు మాపు అంటూ వాయిదా వేస్తున్నారు. దీంతో కొన్ని పదవులకు పోటీ రోజురోజుకూ పెరిగిపోతుంది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఓ మీడియా సంస్థ యజమాని బీఆర్ నాయుడు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనకే ఖరారని పార్టీ నేతలు కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇదే సమయంలో కొందరు ప్రముఖుల పేర్లు కూడా వినిపించాయి. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణతో పాటు చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు, బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి వంటి నేతల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇవన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు.  తాజాగా మరో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో మొదటగా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కాగా... మరో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. వీరిద్దరితో పాటు ప్రముఖ నిర్మాత చలసాని అశ్వనీదత్ పేరు కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా వ్యవహరిస్తున్న అశోక్ గజపతి రాజును జగన్ సర్కార్ ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. చివరికి విజయనగరం రామాలయం సందర్శనకు వెళ్లిన సమయంలో ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్మన్ ఎంపిక విషయంలో నిబంధనలను తుంగలో తొక్కారు. విజయనగరంలో గజపతి రాజుల ఆస్తులకు తాళం వేశారు కూడా. దీనిపై చివరికి హైకోర్టు జోక్యంతో జగన్ సర్కార్ వెనక్కి తగ్గింది. దీంతో రాజకీయాలపై విసుగు చెందినట్లు ప్రకటించిన అశోక్... ఆయనకు బదులుగా కూతురు అదితి గజపతిరాజును ఎమ్మెల్యే ఎన్నికల బరిలో నిలిపారు. వివాదరహితునిగా గుర్తింపు తెచ్చుకున్న పూసపాటి అశోక్ గజపతి రాజుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తే బాగుంటుందనేది ఉత్తరాంధ్ర నేతల మాట. ఇక మరో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన తమకే పదవి ఇస్తే బాగుంటుంది అనే వాదనను తెరపైకి తీసుకువచ్చారు యనమల. అయితే యనమల కుటుంబానికి ఇప్పటికే నాలుగైదు పదవులిచ్చారు చంద్రబాబు. పైగా పార్టీ పోలిట్‌బ్యూరో మెంబర్‌గా కూడా కొనసాగుతున్నారు. దీంతో యనమలకు టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి కష్టమే అనే మాట కూడా వినిపిస్తోంది. చివరిగా నిర్మాత చలసాని అశ్వనిదత్ పేరు వినిపిస్తోంది. అయితే గతంలో చంద్రబాబు పిలుపు మేరకు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన అశ్వనీదత్... ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన స్నేహితుడు, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు మాత్రం ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌గా కొనసాగారు. దీంతో అశ్వనీదత్‌కు కూడా అవకాశం లేదంటున్నారు పార్టీ నేతలు.
Read More...
State 

జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్‌కౌంటర్

జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్‌కౌంటర్ జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో తాజాగా భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఓ నివాసంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు. దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More...