Category
Local
Local 

కొమరోలు ఎస్సైగా వెంకటేశ్వర నాయక్

కొమరోలు ఎస్సైగా వెంకటేశ్వర నాయక్ Komarole: కొమరోలు నూతన ఎస్సైగా వెంకటేశ్వర నాయక్ ను నియమిస్తూ జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో విఆర్ లో ఉన్న వెంకటేశ్వర నాయక్ ను కొమరోలు పోలీస్ స్టేషన్ కు జిల్లా ఎస్పీ బదిలీ చేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఎస్సై మధుసూదన్ రావును కనిగిరి నియోజకవర్గం వెలిగండ్లకు బదిలీ అయ్యారు. అతి త్వరలో ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ కొమరోలు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నాయక్ గతంలో మార్కాపురం రూరల్ ఎస్ఐ గా పని చేశారు.
Read More...
Local 

మార్కాపురం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు

మార్కాపురం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు మార్కాపురం: మార్కాపురం సబ్ డివిజన్ డియస్పీ గా నాగరాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, పట్టణ ఎస్సై సైదుబాబు, గ్రామీణ ఎస్సై అంకమ్మరావు తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను  అందించి శుభాకాంక్షలు తెలిపారు.‌ముందుగ డిఎస్పీ నాగరాజు,శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విధుల్లో చేరారు. సీఐ, ఎస్ఐ లతో సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల విషయం పై చర్చించారు.
Read More...
Local 

గణేశ్ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నా

గణేశ్ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నా మార్కాపురం:  పట్టణం లోని బొగ్గరపువారి వీధి గణేశ మండపంలో సోమవారం నిర్వహించిన ఉత్సవాల్లో మాజీ ఎమ్యెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అన్నా రాంబాబు పాల్గొన్నారు.ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆయనకు సాదర స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అన్నా రాంబాబు గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరంఅన్న ప్రసాద వితరణకు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ,ఉత్సవ కమిటీ ప్రతినిధులు, బొగ్గరపు వారి వీధి యూత్ ,నాయకులు పాల్గొన్నారు.
Read More...
Local 

జిల్లాలో 13 మంది ఎస్ఐ లకు స్థాన చలనం

జిల్లాలో 13 మంది ఎస్ఐ లకు స్థాన చలనం ఒంగోలు: జిల్లాలో 13 మంది ఎస్ఐ లకు స్థాన చలనం జరిగింది. విఆర్ లో ఉన్న పలువురు ఎస్ఐ లకు స్టేషన్ కేటాయించారు. మరికొందరిని విఆర్ కు పంపించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు కనిగిరి ఎస్ఐ గా టి.శ్రీరాం, హనుమంతుని పాడు ఎస్ఐ గా కె.మాధవరావు,పిసి పల్లి ఎస్ఐ గా కోటయ్య, పామూరు ఎస్ఐ గా కిషోర్ బాబు, సిఎస్ పురం ఎస్ఐ గా సుమన్,వెలిగండ్ల ఎస్ఐ గా మధుసూదన రావు, కొమరోలు ఎస్ఐ గా యం.వెంకటేశ్వర్లు నాయక్,కొనకనమిట్ల ఎస్ఐ గా టి.రాజ్ కుమార్, తర్లుపాడు ఎస్ఐ గా బ్రహ్మనాయుడు,పుల్లలచెరువు ఎస్ఐ గా పి.రాజేష్ లను నియమించారు.కాగా త్యాగరాజు,శివ నాగరాజు,ప్రేమ్ కుమార్ లను జిల్లా విఆర్ కు పంపించారు.
Read More...
Local 

దేశద్రోహి రాహుల్ గాంధీ... రిజర్వేషన్ల వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ

దేశద్రోహి రాహుల్ గాంధీ... రిజర్వేషన్ల వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ మార్కాపురం: విదేశాల్లో భారత్ పరువు తీస్తున్న రాహుల్ గాంధీ ని దేశ ద్రోహి గా అభివర్ణించాడు బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకులు కోటపాటి రాజా శ్రీకాంత్. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా పార్టీ నాయకులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజా శ్రీకాంత్ మాట్లాడుతూ ఇటీవల అమెరికా వెళ్ళిన రాహుల్ గాంధీ,మీడియాతో మాట్లాడుతూ భారత్ మరో సిరియా కాబోతుందని చెప్పడం చాలా బాధను కలిగించింది అని అన్నారు. మన దేశంలో ఉంటూ మన దేశంలో తింటూ పక్క దేశంలో మనదేశం ను తిట్టడం మన భారతదేశాన్ని కించపరిచేలా మాట్లాడడం మన భారతీయులందరి సౌభ్రాతృత్వం ను ప్రశ్నించడం లాగా ఉందన్నారు.మన దేశం ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగిన విషయం కండ్లకు కనిపించడం లేదు ఈ దేశ ద్రోహి రాహుల్ గాంధీకి  అని అన్నారు. ఎప్పుడు భారతదేశం పై, మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారని ,అంతేకాకుండా మూర్ఖంగా బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తామన్నారని మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లకి మతి భ్రమించిందని ,ముందు నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ కి బీసీలు అంటే చిన్న చూపే అని ఎద్దేవా చేశారు.నెహ్రూ బీసీలకు రిజర్వేషన్ వద్దు అన్నారు అని, ఇందిరాగాంధీ మండల్ కమిషన్ ని మార్చురీకి పంపించిందని, రాజీవ్ గాంధీ తన పాదాల దగ్గర తొక్కిపట్టి ఉంచాడని కోటపాటి దుయ్యబట్టారు. 1993లో బీసీ రిజర్వేషన్ అమలులోకి రావడం జరిగింది ఇప్పుడు మళ్లీ రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తానని అనడం యావత్ భారతావని చూసిందని బీసీల తో పెట్టుకుంటే  రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తుడిచిపెట్టుకొని పోతారు అని తెలియచేశాడు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ కన్వీనర్ కృష్ణారావు, జాతీయ కౌన్సిల్ మెంబర్ శాసనాల సరోజినీ, సీనియర్ నాయకులు పైడిమర్రి శ్రీనివాసరావు, బొంతల కృష్ణ , చిన్నయ్య, రమేష్ మద్దెల లక్ష్మి, ప్రవీన్, శ్యాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local 

మంత్రి సత్య కుమార్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు

మంత్రి సత్య కుమార్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు మార్కాపురం: బీజేపీ జాతీయ నాయకులు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా పట్టణం లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఆయన పేరుతో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సత్య మంచి ఆరోగ్యం తో ప్రజా సంక్షేమ పాలకునిగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొంతల కృష్ణ, బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు శాసన సరోజిని, సీనియర్ నాయకులు పైడిమర్రి శ్రీనివాసరావు, జిల్లా సెక్రెటరీ యం. చిన్నయ్య, బిజెపి జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మద్దెల లక్ష్మి, బిజెపి టౌన్ సెక్రటరీ రమేష్ మొదలగు వారు హాజరైనారు.
Read More...
Local 

విశ్వకర్మ జయంతి గ్రామోత్సవాన్ని విజయవంతం చేద్దాం

విశ్వకర్మ జయంతి  గ్రామోత్సవాన్ని  విజయవంతం చేద్దాం సింగరాయకొండ: సృష్టి కర్త విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ గ్రామం లో విశ్వకర్మ వారసులు ప్రత్యేక కార్యక్రమాల తో పాటు మంగళవారం చేపట్టబోయే విశ్వకర్మ ఉత్సవాన్ని విజయవంతం చెయ్యాలని సింగరాయకొండ విశ్వ బ్రాహ్మణ, విశ్వ కర్మ జయంతి ఉత్సవ నిర్వాహకులు కోరారు. సోమవారం ఈమేరకు నిర్వాహకులు పోలూరి  ఏకాంబరాచారి,నూతక్కి వెంకట సాయి ఆచారి, నూతక్కి మహేష్ ఆచారి, చందలూరి శివాచారి, ఆదిమూలం శివా ఆచారి, హరి ఆచారి మంగళవారం (సెప్టెంబర్ 17) కార్యక్రమం గురించి వివరించారు. ముందుగా సింగరాయకొండ సాయిబాబా మందిరం వద్ద నుండి  విశ్వకర్మ వారి ఉత్సవం ప్రారంభం అవుతుందని ఉత్సవం లో ఖడ్గ దండకం, బిందె తీర్థంతో ఉత్సవం జరుగుతుందని భక్తులు, విశ్వబ్రాహ్మణ కుటుంబాలు, విశ్వ కర్మ వారసులు పాల్గొని ఉ జయవంతం చెయ్యాలని కోరారు. ప్రదర్శన అనంతరం సింగరాయకొండ ఆర్ టి సి బస్టాండ్ ఎదురుగా పాత టింబర్ డిపో వద్ద విశ్వకర్మ వారి కి అభిషేకం, హోమ, యాగ్నీక కార్యక్రమం, పూర్ణాహుతి జరుగుతాయని నిర్వాహకులు వివరించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ, అన్నప్రసాద వినియోగం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
Read More...
Local 

అన్నదాన కార్యక్రమం లో మాజీ ఎయంసీ చైర్మన్ డీవీ

అన్నదాన కార్యక్రమం లో మాజీ ఎయంసీ చైర్మన్ డీవీ మార్కాపురం:  పట్టణంలో స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటుచేసిన విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రుల సందర్భంగా గత పది సంవత్సరముల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దుగ్గిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు నిర్వహించడం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది అని అన్నారు.
Read More...
Local 

నిమజ్జనం స్టైల్ అదిరింది గా!!

నిమజ్జనం స్టైల్ అదిరింది గా!! మార్కాపురం: గణేష్ నవరాత్రి ఉత్సవాలు మార్కాపురం పట్టణం లో పలు ప్రాంతాల్లో వైభవంగా నిర్వహించారు. నిమజ్జనం కూడా అంతే ధూం ధాం గా నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల తర్వాత నిమజ్జనం, తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం ఇలా పట్టణం లో నిమజ్జనం సందడి నెలకొంది. పట్టణం లోని పేరం బజార్ విఘ్నేశ్వర స్వామి నిమజ్జనం ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సాంప్రదాయ దుస్తులు ధరించి నిమజ్జనం కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. నిమజ్జనానికి బొంతల కృష్ణ,బొంతల సుధీర్,దేవిశెట్టి చంద్రశేఖర్, ఆలంపల్లి ప్రదీప్, కొప్పరపు రాంనాధ్ లతో పాటు పలువురు మహిళలు నాయకత్వం వహించారు.
Read More...
Local 

ట్రాఫిక్ క్లియరెన్స్ పై దృష్టి సారించిన పోలీసులు

ట్రాఫిక్ క్లియరెన్స్ పై దృష్టి సారించిన పోలీసులు మార్కాపురం: పట్టణం లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. రోజు రోజుకు  వాహనాల రద్దీ పెరుగుతుండడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్ మీదకు మెట్లు రావడం, రోడ్డు మీదనే వాహనాలు నిలపడం, ఇంకా చెప్పాలంటే తోపుడు బండ్లు రోడ్డు పైనే నిలుపుతుండడం తో ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారింది.‌ తాజాగా మార్కాపురం పట్టణ ట్రాఫిక్ పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు అవగతమవుతుంది. కొత్త సీఐ సుబ్బారావు, ఎస్ఐ సైదు బాబు,ఇతర పోలీసులు సోమవారం పట్టణంలోని పలు వీధుల్లో పర్యటించి దుకాణాదారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా వస్తువులను రహదారి పైకి ఉంచి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Read More...
Local 

స్వంత నిధులతో చిల్ల కంప తొలగింపు

స్వంత నిధులతో చిల్ల కంప తొలగింపు మార్కాపురం:  మండలంలోని గొట్టిపడియ గ్రామ రహదారికి ఇరువైపులా పిచ్చిచెట్లు బాగా అల్లుకుపోయాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు  పడుతున్నారు.‌ దాదాపు 2కి.మీ మేర చిల్ల కంప ప్రయాణీకులను ఇబ్బందులు పెడుతుంది. విషయం తెలుసుకున్న గ్రామ టీడీపీ నాయకులు ఒంటెద్దు చిన్న రంగారెడ్డి, వాటిని తొలగించేందుకు ముందుకు వచ్చారు. తన స్వంత నిధులు రూ. 20 వేలు  ఖర్చు చేసి చిల్లకంప తొలగించాడు. దీంతో గ్రామస్తులు రంగారెడ్డి చేపట్టిన పని కి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read More...
Local 

పొలం తగాదా.. కర్రలతో విచక్షణా రహితంగా దాడులు

పొలం తగాదా.. కర్రలతో విచక్షణా రహితంగా దాడులు ప్రకాశం జిల్లా: పెద్దారవీడు మండలం లోని రాజంపల్లి గ్రామంలో ఆదివారం భీకరమైన వాతావరణం నెలకొంది. పొలం విషయం లో ఇరువర్గాలకు చెందిన వారు గొడవ పడ్డారు. దీంతో ఒక వర్గం వారు,మరో వర్గం పై కర్రలతో విచక్షణా రహితంగా దాడులు చేయడం గమనార్హం. పొలం వద్దనే జరిగిన ఈ తతంగం చూస్తుంటే సినిమాల్లో ఫైటింగ్ సీన్ ను మరిపిస్తుంది. మహిళలపై కూడా కర్రలతో దాడులు చేయడం కనిపిస్తుంది.తల పగిలి చేత్తో తల పట్టుకుని పరుగు పెడుతున్నా వెంటాడి వేటాడి కొట్టడం ఆందోళన కలిగించే విషయం. ఓ వర్గీయులపై విచక్షణా రహితంగా కర్రలతో దాడి చేసిన ఘటనలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. పోలీసులు ఈ కేసును ఎలా డీల్ చేస్తారో చూడాలి మరి.
Read More...