Category
Local
Local 

పోలీసు అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు

పోలీసు అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు మార్కాపురం : మార్కాపురం డిఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాగరాజును తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిజాయితీగా, నిఖార్సుగా పని చేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. సబ్ డివిజన్లో నెలకొన్న పలు సమస్యలను ఈ సందర్భంగా ఆయన, డిఎస్పి కి వివరించారు. అనంతరం మార్కాపురం సీఐ గా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారావు ను,పట్టణ ఎస్సైగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సైదు బాబు ను కలిసి సత్కరించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో పాటు, పలు ప్రధానమైన సమస్యలను వారికి కి ఈ సందర్భంగా మల్లికార్జున వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆలంపల్లి శ్రీనివాసులు, సయ్యద్ గఫార్ ,లఘుమారపు శ్రీను, మల్లికార్జున పాల్గొన్నారు.
Read More...
Local 

డీఎస్పీ నాగరాజు ను కలిసిన బీజేపీ నాయకులు

డీఎస్పీ నాగరాజు ను కలిసిన బీజేపీ నాయకులు మార్కాపురం: నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిఎస్పి నాగరాజును బీజేపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పివి కృష్ణారావు నేతృత్వంలో డిఎస్పీ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగ కృష్ణారావు మాట్లాడుతూ మార్కాపురంలో గంజాయి మత్తులో యువత చెడి పోతుందని, అదేవిధంగా ట్రాఫిక్కు రద్ది ఎక్కువగా ఉండి పాదచారులు వాహన చోదకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, గోవులు రోడ్లపై విచ్చల విడిగా తిరుగుతూ ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయని,గోవుల యజమానులపై తగిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకురాలు శాసనాలు సరోజిని, బొంతల కృష్ణ, పైడిమర్రి శ్రీనివాసరావు, దేవిశెట్టి చంద్రశేఖర్, మొర్రిబోయిన చిన్నయ్య, మీడియా ఇన్ఛార్జి రామకృష్ణ, నాగరాజు, వాసవి ప్రియ, చిన్న వీరారావు, తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local 

ఖేల్ ఖూద్ లో ఎకెవికె విద్యార్థుల ప్రతిభ

ఖేల్ ఖూద్ లో ఎకెవికె విద్యార్థుల ప్రతిభ ఒంగోలు: "విద్యా భారతి" క్షేత్రస్థాయి (కర్ణాటక,తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ) లో నిర్వహించిన ఖేల్ కూద్ పోటీలలో ఒంగోలు ఆంధ్ర కేసరి విద్యా కేంద్రం విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వాలీబాల్  పోటీల్లో ఎకెవికె విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ కోలగట్ల వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. వీరికి కళాశాల అధ్యక్షులు మండవ నాగేశ్వరరావు, కార్యదర్శి పల్లపు చెంచు రామయ్య,ఇతర సభ్యులు అభినందనలు తెలియజేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పోటీలో ప్రథమ స్థానం సాధించినట్లు ప్రిన్సిపల్ కోలగట్ల తెలిపారు. విద్యార్థులు వారు సాధించిన గోల్డ్, సిల్వర్ మెడల్స్ తో పాటుగా ప్రశంసా పత్రాలను బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు.
Read More...
Local 

పాము గుడ్లను మీరెప్పుడైనా చూశారా?

పాము గుడ్లను మీరెప్పుడైనా చూశారా? ప్రకాశం జిల్లా: జిల్లా లోని మార్కాపురం పట్టణం లో ఉన్న మాగుంట సుబ్బరామిరెడ్డి పార్క్ వద్ద పాము సంచరిస్తుంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ నిరంజన్ కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన నిరంజన్, పాము గుడ్లతో ఉండడంతో, దానిని గుడ్లతో సహా మార్కాపురం ఫారెస్ట్ ఆఫీస్ లో ఉంచి జాగ్రత్తలు తీసుకొన్నాడు. మంగళవారం ఆరు గుడ్ల తో ఉన్న పామును, గుడ్లను క్షేమంగా అడవిలో వదిలి వచ్చాడు.
Read More...
Local 

మార్కాపురం లో గణేశుని లడ్డూ రూ. 2.08 లక్షలు

మార్కాపురం లో గణేశుని లడ్డూ రూ. 2.08 లక్షలు మార్కాపురం : మార్కాపురం పట్టణం లో ఈ ఏడాది గణనాథుని లడ్డూ ధర ఏకంగా 2.08 లక్షలు పలికింది. పట్టణం లోని మెయిన్ బజార్  వినాయకస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నిమజ్జనం సందర్భంగా సోమవారం గణేష్ లడ్డూ వేలం పాటను కమిటీ సభ్యులు నిర్వహించారు. దోర్నాల శ్రీ రంగా వైద్యశాల డాక్టర్ లావణ్య కాశీ రావు దంపతులు లడ్డూ ప్రసాదాన్ని రూ 2.08 లక్షలకు దక్కించుకున్నారు...!. డాక్టర్ లావణ్య దంపతులు మార్కాపురం వాసులు. లడ్డు కైవసం చేసుకున్న లావణ్య దంపతులను ఈ సందర్భంగా విగ్రహ కమిటీ సభ్యులు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
Read More...
Local 

రైలు కిందపడి వ్యక్తి మృతి

రైలు కిందపడి వ్యక్తి మృతి కంభం: కంభం పట్టణంలోని స్థానిక చెరువు కట్ట నుండి జగ్గంబొట్ల కిష్టాపురం మధ్య ఉన్న రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. సమాచారం తెలుసుకొన్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. రైలు నుంచి జారిపడి మృతి చెందాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More...
Local 

స్వచ్చతా హీ సేవా కార్యక్రమం లో పాల్గొన్న సబ్ కలెక్టర్..కూటమి నాయకులు

స్వచ్చతా హీ సేవా కార్యక్రమం లో పాల్గొన్న సబ్ కలెక్టర్..కూటమి నాయకులు మార్కాపురం: స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణం లో నిర్వహించిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాత బస్టాండ్ సెంటర్లో రోడ్డు ఊడిచి శుభ్రత పాటించడం ద్వారా జరిగే మంచి గురించి వివరించారు. కార్యక్రమంలో కమిషనర్ కిరణ్, తెదేపా నేతలు కందుల రామిరెడ్డి, వక్కలగడ్డ మల్లిఖార్జున్, షేక్ మౌలాలి, తాళ్లపల్లి సత్యనారాయణ, బిజెపి నాయకులు పీవీ కృష్ణారావు, జనసేన నాయకులు సురేష్, వీరయ్య,సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local 

ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య ఒంగోలు:  నగర పరిధిలోని  ఒక  జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని మంగళవారం ఆత్మహత్య కు పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వడ్డిముక్కల భావన  ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More...
Local 

కొమరోలు ఎస్సైగా వెంకటేశ్వర నాయక్

కొమరోలు ఎస్సైగా వెంకటేశ్వర నాయక్ Komarole: కొమరోలు నూతన ఎస్సైగా వెంకటేశ్వర నాయక్ ను నియమిస్తూ జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో విఆర్ లో ఉన్న వెంకటేశ్వర నాయక్ ను కొమరోలు పోలీస్ స్టేషన్ కు జిల్లా ఎస్పీ బదిలీ చేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఎస్సై మధుసూదన్ రావును కనిగిరి నియోజకవర్గం వెలిగండ్లకు బదిలీ అయ్యారు. అతి త్వరలో ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ కొమరోలు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నాయక్ గతంలో మార్కాపురం రూరల్ ఎస్ఐ గా పని చేశారు.
Read More...
Local 

మార్కాపురం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు

మార్కాపురం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు మార్కాపురం: మార్కాపురం సబ్ డివిజన్ డియస్పీ గా నాగరాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, పట్టణ ఎస్సై సైదుబాబు, గ్రామీణ ఎస్సై అంకమ్మరావు తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను  అందించి శుభాకాంక్షలు తెలిపారు.‌ముందుగ డిఎస్పీ నాగరాజు,శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విధుల్లో చేరారు. సీఐ, ఎస్ఐ లతో సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల విషయం పై చర్చించారు.
Read More...
Local 

గణేశ్ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నా

గణేశ్ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నా మార్కాపురం:  పట్టణం లోని బొగ్గరపువారి వీధి గణేశ మండపంలో సోమవారం నిర్వహించిన ఉత్సవాల్లో మాజీ ఎమ్యెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అన్నా రాంబాబు పాల్గొన్నారు.ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆయనకు సాదర స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అన్నా రాంబాబు గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరంఅన్న ప్రసాద వితరణకు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ,ఉత్సవ కమిటీ ప్రతినిధులు, బొగ్గరపు వారి వీధి యూత్ ,నాయకులు పాల్గొన్నారు.
Read More...
Local 

జిల్లాలో 13 మంది ఎస్ఐ లకు స్థాన చలనం

జిల్లాలో 13 మంది ఎస్ఐ లకు స్థాన చలనం ఒంగోలు: జిల్లాలో 13 మంది ఎస్ఐ లకు స్థాన చలనం జరిగింది. విఆర్ లో ఉన్న పలువురు ఎస్ఐ లకు స్టేషన్ కేటాయించారు. మరికొందరిని విఆర్ కు పంపించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు కనిగిరి ఎస్ఐ గా టి.శ్రీరాం, హనుమంతుని పాడు ఎస్ఐ గా కె.మాధవరావు,పిసి పల్లి ఎస్ఐ గా కోటయ్య, పామూరు ఎస్ఐ గా కిషోర్ బాబు, సిఎస్ పురం ఎస్ఐ గా సుమన్,వెలిగండ్ల ఎస్ఐ గా మధుసూదన రావు, కొమరోలు ఎస్ఐ గా యం.వెంకటేశ్వర్లు నాయక్,కొనకనమిట్ల ఎస్ఐ గా టి.రాజ్ కుమార్, తర్లుపాడు ఎస్ఐ గా బ్రహ్మనాయుడు,పుల్లలచెరువు ఎస్ఐ గా పి.రాజేష్ లను నియమించారు.కాగా త్యాగరాజు,శివ నాగరాజు,ప్రేమ్ కుమార్ లను జిల్లా విఆర్ కు పంపించారు.
Read More...