Category
Stories
Stories  State 

రాయలసీమ లో బూడిద కోసం గొడవలు ఏంటి?

రాయలసీమ లో బూడిద కోసం గొడవలు ఏంటి? కడప: రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ లో ప్రతి రోజూ దాదాపు 4 వేల టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతోంది. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ బూడిదను అనంతపురం, కడప జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేసేవారని చెబుతారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బూడిద తరలింపుపై ఈ రెండు జిల్లాలకు చెందిన కూటమి ప్రజా ప్రతినిధుల కన్ను పడింది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఈ బూడిదను తీసుకెళ్తున్నారు.అయితే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఇందుకు అభ్యంతరం చెబుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులకు చెందిన లారీలు ఆర్టీపీపీ ప్లాంట్ కు వెళ్లినా బూడిద లోడ్ చేయకుండా అడ్డుకున్నారని ఆరోపణలున్నాయి. ఈ విషయమై జేసీ ప్రభాకర్ రెడ్డి కడప, అనంతపురం జిల్లాల ఎస్పీలకు లేఖలు రాశారు. ఈ విషయమై ఆదినారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన చర్చల్లో పురోగతి లేదు. దీంతో బూడిద తరలింపుపై రెండు వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read More...
Stories 

ఆ ఇద్దరు ప్రముఖుల నడుమ దుమ్ము రేపుతున్న ట్వీట్లు!

ఆ ఇద్దరు ప్రముఖుల నడుమ దుమ్ము రేపుతున్న ట్వీట్లు! ఆంధ్రజ్యోతి పత్రిక ఓనర్ వేమూరి రాధాకృష్ణ మొన్నటి ఆదివారం తన కొత్త పలుకులో వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ” నీది ఒక మనిషి పుట్టుకేనా. ఐతే నాతో చర్చ కు రా.. మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చావు? ఎందుకు వచ్చావో చెప్పనా? ఎవరు పంపిస్తే వచ్చావో చెప్పనా? నా ముందు ఏం మాట్లాడవో చెప్పనా? బిజెపిలోకి వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులను పంపిస్తానని అమిత్ షాక్ వాగ్దానం ఇచ్చింది నిజం కాదా? నమ్మలేని రాజకీయ నాయకుడు అంటూ నిన్ను బీజేపీ పెద్దలు అన్నది వాస్తవం కాదా” ఇలా సాగిపోయింది రాధాకృష్ణ వ్యాసం. ఇద్దరికీ ఎక్కడ చెడిందో, ఎందుకు ఇద్దరి మధ్య ఈ స్థాయిలో వైరం మొదలైందో తెలియదు గాని.. మొత్తానికి మొన్నటి కొత్త పలుకులో రాధాకృష్ణ కేసీఆర్, జగన్ మీది కంటే విజయసాయిరెడ్డి మీదనే ఎక్కువగా ప్రతాపం చూపించాడు. తన కొత్త పలుకులో ఒక రాజకీయ నాయకుడిని ఉద్దేశించి ఈ స్థాయిలో రాధాకృష్ణ ఇంతవరకూ విమర్శలు చేయలేదు. తనకు నచ్చని జగన్ మీద, తను ఇష్టపడని కేసీఆర్ మీద కూడా రాధాకృష్ణ ఈ స్థాయిలో ధ్వజమెత్తలేదు. రాధాకృష్ణ విమర్శించి రెండు రోజులు పూర్తయి.. మూడో రోజు మొదలైన తర్వాత విజయసాయిరెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా రాధాకృష్ణ మీద విమర్శల వర్షం కురిపించారు.  *విజయసాయి రెడ్డి ఏమన్నారంటే..*  ” శ్రీ రాధాకృష్ణ ఎమర్జెన్సీ కాలంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యవస్థాపకుడు రామ్ నాథ్ గోయంకా ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. నాడు ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో ఏర్పాటయింది. అంతటి స్థాయి ఉన్నప్పటికీ రామ్ నాథ్ వారసులు నేటికీ మీడియానే నమ్ముకుని ఉన్నారు. అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ 92 సంవత్సరాల క్రితం ఏర్పాటయింది. ఆ సంస్థ ఆస్తులు… నీ నెలరోజుల సెటిల్మెంట్ సంపాదనతో సరిపోతుంది. ఈ ప్రకారం నువ్వు ఎంత అవినీతిపరుడివో వేరే చెప్పాల్సిన అవసరం లేదని” విజయసాయిరెడ్డి రాధాకృష్ణ ఉద్దేశించి విమర్శించారు. మరో ట్వీట్లో ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ పుట్టుక గురించి సంచలన ఆరోపణలు చేశారు. “రాధాకృష్ణ గారు తన మీడియా సంస్థల్లో నష్టాలు వస్తున్నాయని అమెరికా వెళ్తారు. ఎన్నారైల వద్ద చందాలు తెచ్చుకుంటారు.. మీ కళ్ళకు కలర్ బ్లైండ్ నెస్ ఉంది. అందువల్ల కొందరే కనిపిస్తారు. మిగతావాళ్లు మొత్తం నువ్వు ఎలా విమర్శించినా పడుతూ ఉండాలి. నువ్వు సెటిల్మెంట్లు చేస్తే వారు సంపాదనకు ఉపయోగపడాలి. అలానే అనుకుని స్వార్థపూరితమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. నువ్వు సుదురు చెప్పడం మానేయి.. నిన్ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడతాయని” విజయ సాయి రెడ్డి రాధాకృష్ణ ఉద్దేశించి విమర్శించారు.  *వాటదారులు ఏమయ్యారు*  గతంలో మూతపడిన ఆంధ్రజ్యోతి పేపర్ కొనడానికి పెట్టుబడి పెట్టిన ఇద్దరు వాటాదారుల గురించి కూడా విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. ” రాధాకృష్ణ.. మూతపడిన ఆంధ్రజ్యోతిని కొనుగోలు చేయడంలో ఇద్దరు సహకరించారు. ఆ ఇన్వెస్ట్మెంట్ సమకూర్చిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? వారితో నువ్వు డబ్బు పెట్టుబడి పెట్టేసిన తర్వాత.. బ్లాక్ మెయిల్ చేసి బయటికి పంపించింది నిజం కాదా.. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు తయారుచేసే పారిశ్రామికవేత్త ఇప్పటికి తన స్నేహితుల వద్ద నీ మోసపూరితమైన బుద్ధి గురించి చెబుతూనే ఉంటాడు. న్యాయం, ధర్మం గురించి నీలాంటి వాళ్ళు మాట్లాడద్దు.. సామాజిక స్పృహలని నీలాంటి దళారులు చిత్ర విచిత్రమైన భ్రమలలో బతుకుతుంటారు. ఎప్పుడో ఒకసారి పెనుగాలి ప్రకంపనగా వీస్తుంది. ఆ గాలికి నామరూపాలు లేకుండా నీలాంటి వాళ్ళు కొట్టుకుపోతారని” విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.  *బహిరంగ చర్చకు సవాల్*  ఇక మొన్న వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకులో బహిరంగ చర్చకు సిద్ధమా అని విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. దానికి విజయసాయిరెడ్డి కూడా ఒప్పుకున్నారు. ” రాధాకృష్ణ.. బహిరంగ చర్చకు నేను సిద్ధం. నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా. ఫేస్ టు ఫేస్ కౌంటర్ కు నేను సిద్ధంగానే ఉన్నాను.. అయినా నీ పక్షపాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతికి నేను ఎందుకు రావాలి? . నేను ఐక్యరాజ్యసమితి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సిద్ధమే.. ఎవరి సచ్చీలత ఏమిటో తేలిపోతుంది. గడచిన ఐదు సంవత్సరాలలో మద్యం, ఖనిజం వ్యాపారాలు సాగించే బ్రోకర్లు, ఇతర డీల్స్ లో బాస్ పేరు చెప్పలేదా? చెప్పి వసూలు చేయలేదా.. వారికి ఇవ్వకుండా ఎంత తీసుకున్నావో.. ఆ విషయాలను కూడా చర్చిద్దాం.. జర్నలిస్ట్ కాలనీ లో నువ్వుండే ప్యాలస్.. నేను ఉండే బాడుగిళ్లు కూడా చూపిద్దాం. ఫిలింనగర్ ప్రధాన రోడ్డులో నువ్వు కొన్న నూరుకోట్ల విలువచేసే స్థలం.. అందులో ఇంకో రెండు వందల కోట్లతో కాడుతున్న కార్యాలయ భవంతి కూడా పరిశీలిద్దామని” విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి వరసగా చేసిన ట్వీట్లు తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారాయి.
Read More...
Stories  State 

రాజకీయాలకు పోసాని గుడ్ బై... ఎందుకంటే?

రాజకీయాలకు పోసాని గుడ్ బై... ఎందుకంటే? రాజకీయాలకు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి గుడ్‌బై చెప్పినట్లు సమాచారం. ఇక నుంచి నేను రాజకీయాలు మాట్లాడను, ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు అని ఆయన స్పష్టం చేశారు. వైసీపీనే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు. ఏ పార్టీని పొగడను.. మాట్లాడను.. విమర్శించను.. నన్ను ఎవరూ ఏమనలేదు.. ఎవరి గురించి ఇక మాట్లాడను. ఓటర్‌ లాగే ప్రశ్నించా.. మంచి చేస్తే వాళ్లకి సపోర్ట్‌ చేశా. నా కుటుంబం, పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నా. నని పోసాని తెలిపారు.  ఇంతకు ఎందుకు అంటే.... పోసాని వైకాపా నాయకునిగా చెలామణి అయ్యారు. మీడియా సమావేశాల్లో టీడీపీ నాయకులను తనదైన శైలిలో ఇష్టారీతిన ఏకి పారేశాడు. హావభావాలు, చిల్లర మాటలతో దండయాత్ర చేశాడు. సాక్షి పత్రిక, టీవీ లో పోసాని ఎకిలి చేష్టలను, టీడీపీ నాయకులపై ఆయన బూతు డైలాగులను ఎలివేషన్ ఇచ్చి ప్రెజెంటేషన్ ఇచ్చారు. వీటన్నింటినీ మౌనంగా భరించిన టీడీపీ నాయకులు, అధికారంలోకి వచ్చాక దృష్టి సారించారు. పోలీసులు ,పోసాని పై కేసు నమోదు చేశారు.బహుశా పోసాని స్టైల్ లోనే ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారు, అందుకే రాజకీయాలకు దూరం అంటూ కబుర్లు చెపుతున్నాడు అని నెటిజన్లు పంచ్ లు విసురుతున్నారు.
Read More...
Stories  State 

విడదల రజినీకి షాక్ ఇచ్చిన జగన్‌...!

విడదల రజినీకి షాక్ ఇచ్చిన జగన్‌...! విడదల రజినీ... తెలుగు రాజకీయాల్లో పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికపైన సైబరాబాద్‌లో మీరు నాటిన మొక్కను సార్‌ నేను అంటూ చంద్రబాబుపైన పొగడ్తల జల్లు కురిపించిన రజిని... సరిగ్గా ఏడాదికే వైసీపీలో చేరిపోయారు. సీనియర్లను కాదని ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకున్నారు. అనతి కాలంలోనే పార్టీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న రజినీ... సోషల్‌ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌ కూడా. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉంది. ఇక మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో మంత్రిపదవి కూడా పొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రజినీని మంత్రి పదవి వరించడం వెనుక వైసీపీలో నెంబర్‌ టూ స్థాయి వ్యక్తి లాబీయింగ్‌ ఉందనే పుకార్లు పెద్ద ఎత్తున షికారు కూడా చేశాయి. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి సీనియర్‌ నేత, రాజకీయ గురువు ప్రత్తిపాటి పుల్లారావుపై ఘన విజయం సాధించిన విడదల రజినీకి జగన్‌ గట్టి షాక్ ఇచ్చారు. సరిగ్గా ఎన్నికలకు ఐదు నెలల ముందు రజినీని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. టీడీపీ కంచుకోటగా గుర్తింపు తెచ్చుకున్న గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో గెలవాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. అందుకే అప్పట్లో కార్యాలయంపై దాడి చేశారని... తనపై హత్యాయత్నానికి ప్రయత్నించారంటూ హడావుడి చేశారు కూడా. అదే సమయంలో తన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ వైసీపీ నేతలే బహిరంగంగా ఆరోపణలు చేయడంతో.. రజినీ ఒక్కసారిగా సైలెంట్‌ అయ్యారు. బీసీ కార్డు ద్వారా ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమించినప్పటికీ... పెద్దగా ఫలితం చూపించలేదు.ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్‌గా ఉన్నారు. ఒకదశలో రజినీ కూడా పార్టీ మారుతారనే మాట బలంగా వినిపించింది. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని బుజ్జగించే బాధ్యతలను విడదల రజినీకే జగన్ అప్పగించారు. అందుకోసం రజినీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక మొన్నటి ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన కావలి మనోహర్‌ నాయుడు ఓడిన తర్వాత అడ్రస్‌ లేకుండా పోయారు. దీంతో చిలకలూరిపేట నియోజకవర్గం ఇంఛార్జ్‌ బాధ్యతలను విడదల రజినీకి మరోసారి అప్పగించారు జగన్‌. వాస్తవానికి రజినీకి చిలకలూరిపేటలో మంచి పేరు లేదు. భూ కబ్జా ఆరోపణలతో పాటు స్థానిక క్యాడర్‌తోనే సఖ్యత లేదు. అందుకే రజినీని గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గానికి జగన్‌ మార్చారు. అయితే ఇప్పుడు మళ్లీ చిలకలూరిపేట బాధ్యతలు అప్పగించడంతో స్థానిక నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రజినీని మార్చకపోతే... తామంతా మారిపోతామని జగన్‌కు అల్టిమేటం జారీ చేశారు.
Read More...
Stories  State 

డ్రోన్ల తో గంజాయి పై యుద్ధం.... బాబు సక్సెస్

డ్రోన్ల తో గంజాయి పై యుద్ధం.... బాబు సక్సెస్ అమరావతి: కొద్ది రోజుల క్రితం అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. డ్రోన్ల టెక్నాలజీ ఓ గేమ్‌ ఛేంజర్‌ అని, డ్రోన్ల సాయంతో రౌడీ షీటర్లకు, అసాంఘిక శక్తులకు చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. డ్రోన్ల ద్వారా విజిబుల్ పోలీసింగ్ తగ్గిస్తామని, ఇన్విజిబుల్ పోలీసింగ్ ద్వారా అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్ల ఆట కట్టిస్తామని అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు విజన్ ను ఏపీ పోలీసులు రియాలిటీలో చేసి చూపించారు. డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి గంజాయి పంటను ఏపీ పోలీసులు ధ్వంసం చేసిన వైనం చంద్రబాబు విజన్ కు తాజా నిలువెత్తు తార్కాణంగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా సాగు చేస్తున్న గంజాయి పంటను డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి ఏపీ పోలీసులు ధ్వంసం చేశారు. డ్రోన్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీని ఉపయోగించిన అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు…5 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న గంజాయి పంటను గుర్తించారు. జీ మాడుగుల మండలంలోని డేగలరాయి గ్రామంలో గుర్తించిన ఆ గంజాయి పంటను పోలీసులు తగులబెట్టారు. ఆ గంజాయి పంటను పండిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తాజా ఘటన నేపథ్యంలో చంద్రబాబుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. టెక్నాలజీని వాడడంలో, ఆ టెక్నాలజీని సమాజహితం కోసం ఉపయోగించడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విజన్ 2020 అంటూ ఆనాడు ఐటీ రంగంలో జరగబోయే డెవలప్ మెంట్ ను చంద్రబాబు 20 ఏళ్ల ముందే గుర్తించారని, అదే తరహాలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం గురించి విజన్ 2047 అంటూ చంద్రబాబు 20 ఏళ్ల ముందే చెప్పారని అంటున్నారు. అమరావతిని డ్రోన్ క్యాపిటల్ చేస్తే ప్రపంచం మొత్తం ఏపీవైపు చూస్తుందని చెబుతున్నారు.
Read More...
Stories 

వైసీపీని టెన్షన్ పెడుతున్న ఇద్దరు మేడమ్స్

వైసీపీని టెన్షన్ పెడుతున్న ఇద్దరు మేడమ్స్ AP: గుంటూరులో జగన్ ఎప్పుడు పర్యటించినా పక్కన విడదల రజనీ ఉంటున్నారు. కానీ ఆమె ఒక్క మాట మాట్లాడటం లేదు. గతంలో ప్రెస్మీట్లు పెట్టేవారు. ఈ మధ్య అదీ కూడా లేదు. శ్యామల మాట్లాడేదే ఎక్కువ అన్నట్లుగా ఉంది. అయితే మరో గుంటూరు మేడమ్ మేకతోటి సుచరిత జగన్ తో పాటు పర్యటనల్లో కూడా పాల్గొనడం లేదు ఓ వైపు జగన్‌తో పాటు టూర్లలో పాల్గొంటున్నా జనసేన తో విడదల రజనీ చర్చలు అయిపోయాయని చెప్పుకుంటున్నారు. సుచరిత అయితే ఏ పార్టీతో టచ్ లోకి వెళ్లారో కూడా అర్థం కావడం లేదు కానీ ఆమె కూడా రెడీగా ఉన్నారంటున్నారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణిస్తే తాను మునిగిపోవడమే కాదు తమనూ ముంచుతారని అందరికీ ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అడ్డగోలు పనులతో ఎలా తప్పించుకోవాలో తెలియక సతమతమవుతూంటే.. పార్టీపై ఆశల్లేకుండా జగన్ రెడ్డి కుటుంబ వివాదాలను సైతం సిల్లీ కారణాలతో ప్రజల్లోకి చర్చకు పెడుతున్న విధానం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇలాంటి విషయాల్లో ప్రజల్లో ఎలాంటి పరిణామాలకు కారణం అవుతాయో కనీసం ఊహించలేకపోతున్నారని.. ఆ మాత్రం తెలివి తెలివిలేదా అనుకుంటున్నారు. గుంటూరులో జగన్ రెడ్డికి నికంగా మిగిలేది నలుగురు చిల్లర పనులు చేసే రౌడీ బ్యాచ్ ను వెంటేసుకుని తిరిగే అప్పిరెడ్డి మాత్రమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మద్దాళి గిరి కూడా గుడ్ బై చెప్పారు. బతికుంటే బలుసాకు తినవచ్చు కానీ జగన్ తో ఉంటే అది కూడా ఉండదని ఆయన ఫిక్సయిపోయారు. చాలా మంది నేతలు జనసేనతో సంప్రదిపుల్లో ఉన్నారు. సమయం చూసి ఒక్కొక్కరు గట్టిగా షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read More...
Stories  State 

ఎపి లో 4 గ్రీన్ ఫీల్డ్ హైవే లు

ఎపి లో 4 గ్రీన్ ఫీల్డ్ హైవే లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సర్కార్ భారీ శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మెరుగు పర్చటంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రముఖ పట్టణాల మధ్య కనెక్టివిటీ పెరిగేలా రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.  ఈమేరకు.. రాష్ట్రంలో నాలుగు గ్రీన్ ఫీల్ట్ హైవేలు నిర్మించనున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో నిర్మించబోయే 4 గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలకు సుమారు 45 వేల 300 కోట్లు అవసరమవుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఇందులో.. హైదరాబాద్ నుంచి మచిలీపట్నాన్ని కనెక్ట్ చేసేలా గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుందని చంద్రబాబు వెల్లడించారు. 18 వేల కోట్లతో ముందుగా పనులు పూర్తి చేస్తారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. జాతీయ రహదారుల అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయని.. 70 ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యలు, 21 ప్రాజెక్టులకు అటవీ భూముల సమస్యలు, 3 ప్రాజెక్టులకు టోల్‌ప్లాజా సమస్యలు ఉన్నాయని వివరించారు. ఆరు ప్రాజెక్టులు బిడ్డింగ్ దశలో ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ 3 నెలల్లో సరిచేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులన్నింటికీ 3 నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో.. రణస్థలం నుంచి శ్రీకాకుళానికి హైవే మంజూరు చేయటాన్ని స్వాగతిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎన్‌హెచ్‌-42లో పాడేరు బైపాస్, బైరెడ్డిపల్లి నుంచి వి.కోట, బెంగళూరు హైవే విషయంలోనూ చర్చించినట్టు చంద్రబాబు తెలిపారు. ఏపీకి మరో మూడు పోర్టులు రానున్నాయని తెలిపిన సీఎం చంద్రబాబు.. లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ మారనుందని తెలిపారు. ఆక్వా కల్చర్, హార్టికల్చర్ వల్ల ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. రైల్వేలో 70 వేల కోట్ల ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంకా ఎఫెక్టివ్‌గా ఉండాలని అధికారులను చంద్రాబాబు ఆదేశించారు. పరిటాల దగ్గర మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు రానున్నట్టు చెప్పుకొచ్చారు. ప్రతి సామాన్యుడికి ఇసుక అందించాలనే ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. ఇసుక విధానంలో గత ప్రభుత్వంలో మోనోపోలీ తీసుకొచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం సహజ వనరులను లూటీ చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు ఇసుక కావాల్సిన వాళ్లే తవ్వుకుని తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. ఒక్కొక్కటిగా అన్ని అంశాలను ట్రాక్‌లో పెడుతున్నామన్నారు. నాలుగు నెలల్లో ఆలోచనా విధానంలో మార్పు తెచ్చామని చంద్రబాబు తెలిపారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొస్తున్నామని.. దానిపై లోకేష్ ఆ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారని చెప్పుకొచ్చారు. విధ్వంసానికి చిరునామాగా ఉన్న ఏపీని అభివృద్ధికి చిరునామాగా చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో అమరావతి రైల్వే లైన్ మరింతగా పెంచుకోవాల్సి వస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మిగిలిన రైళ్లు కూడా వస్తే.. అన్నిరకాల అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు.
Read More...
Stories 

పోలవరం ఇంకో వందేళ్లయినా పూర్తి కాదు.

పోలవరం ఇంకో వందేళ్లయినా పూర్తి కాదు. అమరావతీ: పోలవరం సంగతులు తెలుసుకునేందుకు నేను హైదరాబాద్ వెళ్లాను. నలుగురు ముఖ్యమంత్రి వద్ద పనిచేసిన ఒక పెద్ద అధికారిని కలిశాను. ఆయన చెప్పుకొచ్చాడు పోలవరం కట్టాలంటే 30 లక్షల మంది గిరిజనులను తరలించాల్సి ఉంటుందన్నారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు కట్టే సామర్థ్యం ఇక్కడి కాంట్రాక్టర్లకు, కంపెనీలకు లేదని, ఒకవేళ కట్టినా అది కూలిపోతుందని ఆ అధికారి నాతో అన్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టగలిగే కంపెనీలు ప్రపంచంలో మూడే ఉన్నాయి. అవి చైనా, అమెరికా, జర్మనీ లో ఉన్నట్లు చెప్పారు. జల యజ్ఞం ధనయజ్ఞంగా మారింది. పోలవరం పొలిటీషియన్లకు వరంగా మారింది.పోలవరం పేరు పెట్టి, కొందరు పెద్దలు దోచుకు తిన్నారు. అమరావతి పూర్తి కాలంటే ఇంకో వందేళ్లు పడుతుంది. అప్పటికీ పూర్తవుతుందన్న నమ్మకం నాకు లేదు.1905 ఢిల్లీ రాజధాని మొదలైతే, ఢిల్లీ ఒక మహానగరంగా తయారు కావడానికి ఇన్నేళ్లు పట్టింది. చంద్రబాబు నాయుడు పొద్దున లేస్తే రాత్రి వరకు అమరావతి, పోలవరం అంటారు. మొన్న లడ్డూ, నిన్న డ్రోన్ ఇలా నెలకో అంశాన్ని తెరమీదకు తెచ్చి, అబద్ధాలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు.  భారతదేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరపాలి. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న చోట బిజెపి ఈవీఎం ల ట్యాంపరింగ్ చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయింది. కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితి లేదు.14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసి, పెద్ద అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు బిజెపితో ఉన్న పరిచయాలతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టుకోవచ్చు కదా!?రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది? మాట్లాడితే ఆమె చేసింది! ఆయన వల్ల జరింది అంటుంటారు కొందరు. రాష్ట్ర విభజనకు అసలు సంగతి వేరే ఉంది.1994లో కాన్సిరాం అనే వ్యక్తి యూపీ తర్వాత ఏపీలో అడుగు పెట్టాడు. ఆ మూల నుంచి ఈ మూల వరకు తిరిగాడు. కత్తి పద్మారావు వంటి దళిత నాయకులను ఉత్తేజపరిచాడు.‌ దళితులు ఐక్యం చేశాడు. దళితుల ఐక్యతమనకు మనకు నష్టం చేస్తుందని గ్రహించిన కొందరు నాయకులు దళితులను మాల- మాదిగలుగా విడగొట్టారు. వేరు చేశారు.  నేడు మాల మాదిగలు వీధుల్లోకొచ్చారు. కొట్టుకుంటున్నారు."చెడపకురా చెడేవు అన్న చందంగా" ఒక్కటి గా ఉన్న దళితులను మాల - మాదిగలుగా విభజించడం వల్ల రాష్ట్రం రెండు ముక్కలైంది.నిన్న నేను హైదరాబాదులో ఉన్నాను. సెక్రటేరియట్ వెళ్లి చూశాను. నా కళ్ళు చాలలేదు ఆ సెక్రటేరియట్ ని చూసేదానికి. అంత అద్భుతంగా కట్టుకున్నారు. తెలంగాణ మంత్రుల ఛాంబర్లు మహారాజా ప్యాలస్ లాగా వుంది.మన దగ్గర ఐదు షెడ్లు వేసుకున్నారు. ఎవరెక్కడ ఉంటారో ఎవరికీ తెలీదు.  హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి రెండు ప్రధాన కారణాలు. ఒకటి కాంగ్రెస్ నాయకుల ఓవర్ కాన్ఫిడెన్స్. రెండు ఈవీఎం ట్యాంపరింగ్. ఎన్నికల ఫలితాలు రాకముందే, హర్యానా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో కూర్చొని, పదవుల పంపకాలుపై మంతనాలు జరిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవమున్న చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలోని నిరుద్యోగం, టాక్స్ లు తగ్గించడం, ఆకలి, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు.
Read More...
Stories  State 

పాపం బీఆర్ఎస్.... అన్నీ ఎదురుదెబ్బలే....!

పాపం బీఆర్ఎస్.... అన్నీ ఎదురుదెబ్బలే....! Telangana: పదేళ్లు ఏకఛత్రాధిపతిగా వెలుగు వెలిగిన బీఆర్ఎస్‌కు ఇప్పుడు కాలం అస్సలు కలిసి రావడం లేదు. నా మాటే శాసనం అన్నట్లుగా పదేళ్ల పాటు పాలన సాగింది. అయితే ఉద్యమ పార్టీగా మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా మార్చారో... అప్పటి నుంచి అన్ని కష్టాలే. ఇక ఎన్నికల ఓడిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారిపోయింది. మనదే గెలుపు అని ధీమా వ్యక్తం చేసిన నేతలంతా ఓడిపోయారు. హ్యాట్రిక్ కొడుతున్నామని గొప్పగా చెప్పుకున్న కేటీఆర్‌కు షాక్ తగిలింది. దానికి తోడు ఏడాది కాలంగా పార్టీ అధినేత బయటికి వచ్చిన సందర్భాలే లేవు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచారం చేసినప్పటికీ కనీసం ఒక్కచోట కూడా గెలవలేదు. పైగా డిపాజిట్లు రాలేదనే అపవాదు మూటగట్టుకుంది.  ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసిన ప్రతిసారి బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తొలి రోజుల్లో సూపర్ సిక్స్ అమలు ఎప్పుడూ అని ప్రశ్నించారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేయడంతో కొద్ది రోజులు సైలెంట్ అయ్యారు. ఇక ఆ తర్వాత రైతు రుణమాఫీ అంశంపై సవాళ్లు చేశారు. ఆగస్టు 15 నాటికి హామీ ఇచ్చినట్లుగా రైతు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తానంటూ మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. అయితే చెప్పినట్లుగానే రూ.1.50 లక్షల లోపు ఉన్న రుణాలను తెలంగాణ సర్కార్ మాఫీ చేసింది. దీంతో... రూ.2 లక్షల రుణం మాఫీ చేయలేదు కదా అంటూ ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు. ఇక ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రాను తెరపైకి తీసుకువచ్చిన కాంగ్రెస్. దీంతో హైడ్రా అక్రమం అంటూ తెగ గోల పెట్టారు. చివరికి హైకోర్టుకు కూడా వెళ్లారు. అయితే హైకోర్టులో పిటిషన్ దారులకు చుక్కెదురైంది. హైడ్రా వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని... దానిని కొనసాగించవచ్చంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో హైడ్రా మరోసారి రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో మూసీ ప్రక్షాళన అంశంపై వివాదం చెలరేగింది. దీంతో మరో అంశం దొరికింది అంటూ బీఆర్ఎస్ నేతలు ధర్నాలు, ఆందోళనకు పిలుపునిచ్చారు. దీనికి చెక్ పెట్టేలా ఆక్రమణ దారులకు రేవంత్ సర్కార్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించింది. అలాగే మూసీ ప్రక్షాళనకు కేంద్ర పెద్దలు కూడా లోపాయికారిగా మద్దతు తెలపడంతో బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారు.  ఇక తాజాగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష విషయంలో బీఆర్ఎస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. పరీక్ష వాయిదా వేయాలని... జీవో రద్దు చేయాలంటూ కొంతమంది నిరుద్యోగులతో కలిసి ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. అలాగే హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఇక సరిగ్గా పరీక్ష రోజు సుప్రీం కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని... పరీక్షల నిర్వహణపై స్టే వస్తుందని గంపెడంత ఆశ పెట్టుకున్నారు గులాబీ పార్టీ నేతలు. అయితే సుప్రీం కోర్టు మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. స్టే ఇచ్చేది లేదని తేల్చేసింది. దీంతో పరీక్షలు ప్రారంభమయ్యాయి కూడా.  ఎన్నికల హామీల అమలుతో పాటు హైదరాబాద్ నగరాభివృద్ధి, మూసీ ప్రక్షాళన, హైడ్రా, గ్రూప్ -1, రైతు రుణ మాఫీ... ఇలా ఏ అంశం తీసుకున్నా సరే... బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. దీంతో గులాబీ పార్టీ నేతలు ఏం చేయాలో కూడా అర్థం కాని స్ధితిలో ఉన్నారు.
Read More...
Stories  State 

రంగంలోకి సోనియా.... గెలుపే లక్ష్యమా...?

రంగంలోకి సోనియా.... గెలుపే లక్ష్యమా...? New Delhi: ప్రియాంక గాంధీ రాజకీయ ఆరంగేట్రానికి ముహుర్తం ఖరారైంది. వయానాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రియాంక సిద్ధమయ్యారు. అచ్చు పోలినట్లు నానమ్మ ఇందిరా గాంధీలా ఉండటంతో ప్రియాంకకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇక పబ్లిక్‌‍ను ఆకట్టుకోవడంలో కూడా ప్రియాంక ఆరితేరిపోయారు. అన్న రాహుల్ గాంధీతో కలిసి ఇప్పటికే ఎన్నో రాజకీయ వేదికలపై ప్రసంగించారు. అలాగే పార్టీ గెలుపు కోసం దేశవ్యాప్త పర్యటన చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతను ప్రియాంక భుజానికెత్తుకున్నారు కూడా. తెలంగాణలో మహిళా డిక్లరేషన్ సహా పలు కీలక హామీలను ప్రియాంక స్వయంగా చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రియాంకను ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ తెగ ప్రచారం కూడా చేశారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియా పుకార్లే అని అప్పట్లో తేల్చేశారు. ఇక గత పార్లమెంట్ ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలి నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... రెండు చోట్ల గెలిచారు. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాయ్ బరేలిని అట్టిపెట్టుకుని వయానడ్‌ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ఇటీవల జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశారు. నవంబర్ 13న జరగనున్న ఉప ఎన్నిక కోసం బుధవారం ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవంబర్ 23 న ఫలితాలు వెలువడనున్నాయి.  అయితే వయనాడ్ నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న ప్రియాంక కోసం ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలంతా రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు సోనియా గాంధీ వయనాడ్‌లో ప్రియాంక కోసం ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య సమస్యల కారణంగా ఈ మధ్యకాలంలో సోనియా గాంధీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తొలిసారి తనయ ప్రియాంక పోటీ చేస్తుండటంతో... గెలుపే లక్ష్యంగా సోనియా ప్రచారం చేయనున్నారు. దీంతో వయనాడ్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
Read More...
Stories  State 

బీ కేర్ ఫుల్... రంగంలోకి పెద్దాయన...!

బీ కేర్ ఫుల్... రంగంలోకి పెద్దాయన...! Amaravati: మద్యం మాఫియా... గత ఐదేళ్ల వైసీపీ సర్కార్‌లో ఇదే మాట పెద్ద ఎత్తున వినిపించింది. ఇంకా చెప్పాలంటే అధికార పార్టీపై ప్రతి రోజు విమర్శలు చేశారు ప్రతిపక్ష నేతలు. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నిర్వహించడం వల్ల ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖజనాకే వస్తుందని వైసీపీ సర్కార్ చెప్పుకొచ్చింది. అయితే ఎక్కడా యూపీఐ చెల్లింపులు లేకపోవడం... కేవలం నగదు బదిలీ వల్లే అమ్మకాలు చేయడం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి తోడు నాసిరకం బ్రాండ్‌లతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారనే అపవాదు కూడా వైసీపీ సర్కార్ మూటగట్టుకుంది. బ్రాండెడ్ మద్యం కోసం మందుబాబులు ఇతర రాష్ట్రాలకు క్యూ కట్టారు కూడా. విచిత్రమైన పేర్లతో నాసిరకం మద్యం అంటగట్టింది వైసీపీ సర్కార్. దీంతో మందు బాబులు సైతం జగన్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన మద్యం పాలసీపై చంద్రబాబు సర్కార్ కసరత్తు చేసింది. అక్టోబర్ నుంచి ప్రైవేటు మద్యం షాపులకు అనుమతి మంజూరు చేసింది. అలాగే ఏపీ వ్యాప్తంగా 3,396 షాపులకు ఆన్ లైన్ ద్వారా టెండర్లు ఆహ్వానించింది. ఇక అంతే... తన మన అనే బేధం లేకుండా నేతలు రంగంలోకి దిగారు. ఐదేళ్ల పాటు మద్యం వ్యాపారానికి దూరంగా ఉన్న నేతలంతా ఇప్పుడు జూలు విదిలించారు. అప్లికేషన్ దాఖలుకు కూడా తమ అనుమతి తీసుకోవాల్సిందే అని కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హుకుం కూడా జారీ చేశారు. కొన్ని చోట్ల అయితే రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి టీడీపీ, వైసీపీ నేతలు చెట్టాపట్టాలేసుకుని మరి మద్యం టెండర్లు దాఖలు చేశారు. ఈ విషయం బయటకు తెలియటంతో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో కొందరు నేతలు వెనక్కి తగ్గారు. ఇక లాటరీలో షాపుల కేటాయింపు పూరైన తర్వాత అసలు సినిమాకు తెరలేపారు కొందరు ప్రజాప్రతినిధులు. షాపు దక్కించుకున్న వారిని నేరుగా బెదిరించారు. కొన్ని చోట్ల దాడులు కూడా చేశారు. షాపు ఎలా నడుపుతావో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. మాకు ఇచ్చేసి... మేము ఇచ్చింది తీసుకుని పో అంటూ భయపెట్టారు. పైకి పారదర్శకంగానే షాపుల కేటాయింపు జరిగినప్పటికీ... తెర వెనుక మాత్రం వ్యాపారం కోసం వచ్చిన వారికి బెదిరింపులు ఎదురయ్యాయి. చివరికి డీడీలు తీసిన తర్వాత కూడా కొందరు వ్యాపారులు బెదిరింపులకు భయపడి రాజీ చేసుకునేందుకు నేరుగా ప్రజాప్రతినిధితోనే సమావేశమయ్యారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో... స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఈ నెల 18న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇసుక, మద్యం వ్యవహారాల్లో వస్తున్న ఆరోపణలపైనే చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన ఇసుక, మద్యం వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు వార్నింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సమావేశానికి రావాల్సిందిగా కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో పార్టీ ఎమ్మెల్యేలు కలవరపడుతున్నారు. ఏ విషయంపై అధినేతతో మాట పడాల్సి వస్తుందో అని భయపడుతున్నారు.
Read More...
Stories  State 

సార్.. మీరు పార్టీ ఆఫీసుకు వస్తారా.. రారా...?

సార్.. మీరు పార్టీ ఆఫీసుకు వస్తారా.. రారా...? Amaravati: ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్న విజయ గర్వం తెలుగుదేశం పార్టీ నేతల్లో ఏమాత్రం కనిపించటం లేదు. పార్టీ గెలుపు కోసం ఎంతో శ్రమించిన నేతలు సైతం ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే అధినేత చంద్రబాబు పార్టీ గెలుపుపై ఫోకస్ పెట్టారు. పార్టీలో కిందిస్థాయి కార్యకర్తలతో కూడా మమేకం అయ్యారు.. జిల్లాల్లో పర్యటించారు. అలాగే వారంలో నాలుగు రోజులు తప్పనిసరిగా పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు.  అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తీరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. యువగళం పాదయాత్ర చేశారు. స్థానిక సమస్యలు తీరుస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే మూడేళ్లుగా మంగళగిరి కేంద్ర కార్యాలయానికి రావడానికి మాత్రం చినబాబుకు సమయం లేకుండా పోయింది. పార్టీ నేతలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలనేది అధినేత ఆదేశం. అందులో భాగంగానే పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఓ మంత్రి, పార్టీ సీనియర్ నేతతో పాటు అనుబంధ సంఘాలకు చెందిన నేతలు కూడా ఉండాలన్నారు.  అలాగే ప్రతి శనివారం స్వయంగా పార్టీ కార్యాలయానికి వచ్చి స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అయితే మంత్రి నారా లోకేష్ మాత్రం పార్టీ కార్యాలయం వైపు రావటం లేదు. పైగా ఇంటి దగ్గర విడిగా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. కిందిస్థాయి కార్యకర్త మొదలు జాతీయ స్థాయి నేత వరకు.. ఎవరైనా సరే లోకేష్ ను కలవాలంటే ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లాల్సిందే. అంతే తప్ప మంగళగిరి ఆఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు.  పార్టీ కార్యాలయాన్ని తెలుగు తమ్ముళ్లు దేవాలయంగా భావిస్తారు. అందుకే వైసీపీ మూకలు పార్టీ కార్యాలయంపై దాడి చేసిన తర్వాత ఆవేదనకు గురయ్యారు. దాడికి నిరసనగా చంద్రబాబు దీక్ష చేస్తున్న సమయంలో మేమంతా మీ వెంటే అంటూ తోచినంత సాయం కూడా చేశారు. ఎన్టీఆర్ భవన్ అంటే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఓ భరోసా. కానీ అలాంటి కేంద్ర కార్యాలయానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాకపోవడం పై నేతలు చర్చించుకుంటున్నారు. మరి ఈ అనుమానాలకు, పుకార్లకు చెక్ పెట్టాలంటే.. ఇకనుంచి చినబాబు పార్టీ ఆఫీసుకు రావాల్సిందే.
Read More...