వెలిగొండపై మళ్ళీ ఆశలు చిగురించాయి : బీజేపీ నేత డాక్టర్ ఏలూరి

On
వెలిగొండపై మళ్ళీ ఆశలు చిగురించాయి : బీజేపీ నేత డాక్టర్ ఏలూరి

విజయవాడ: పశ్చిమ ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు ఎన్డీఏ ప్రభుత్వం నిధులు కేటాయించింది. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా రూ. 445 కోట్ల రూపాయల నిధులు వెలిగొండ కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సర్వత్రా హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి అని బీజేపీ రాష్ట్ర నాయకుడు డా. ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబుకు, మంత్రి నిమ్మల రామానాయుడు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వెలిగొండ పూర్తికి ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని.. అందులో భాగంగా ప్రజలకు చెప్పిన విధంగానే బడ్జెట్ లో నిధులు వెచ్చించిందని వెల్లడించారు. గత వైకాపా ప్రభుత్వం పనులను నిర్లక్ష్యం చేసిందని తెలిపారు.. సీఎం చంద్రబాబు కృషితో నేడు ఈ ప్రాజెక్టు పూర్తయ్యే ఆశలు ప్రజల్లో చిగురించాయని అన్నారు.. గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వెలిగొండ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదన్న ఏలూరి.. పైపెచ్చు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు హడావుడిగా పనులు పెండింగ్ లో ఉండగానే ప్రారంభించారని చెప్పారు.. ప్రజలకు వాస్తవాలు తెలుసు గనుకనే వైకాపాను ఓడించారని గుర్తు చేశారు.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత వాసులకు సీఎం చంద్రబాబు ఆశాదీపం లా కనిపించారు.. గతంలో చంద్రబాబు చేతుల మీదుగానే వెలిగొండ కు తొలుత శంకుస్థాపన జరిగిందని.. మళ్ళీ ఆయన చేతుల మీదుగానే ప్రారంభానికి నోచుకోవడం చారిత్రాత్మక విషయం అన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి నిధులు కూడా వీలైనంత త్వరగా విడుదల చేసి రైతుల కళ్ళల్లో ఆనందం నింపాలని డాక్టర్ ఏలూరి ప్రభుత్వాన్ని కోరారు.

Screenshot_2024-04-05-18-53-43-27_99c04817c0de5652397fc8b56c3b3817

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News