బయోగ్యాస్ కంపెనీ కోసం భూముల పరిశీలన
ప్రకాశం జిల్లా: కొనకనమిట్ల మండలంలో బయోగ్యాస్ కంపెనీ ఏర్పాటు కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, రిలయన్స్ కంపెనీ ప్రతినిధులు మండలం లోని పెదారికట్ల, వాగుమడుగు కొనకనమిట్ల, ఇరసలగుండము గ్రామాల్లోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో భూములు పరిశీలించే సమయం లో వర్షం కురుస్తున్నా, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జాయింట్ కలెక్టర్ వారి బృందము ఆయా గ్రామాలు తిరిగి భూములను తనిఖీ చేశారు. వారి వెంట మండల తహసిల్దార్ ఆవుల సురేష్, ఆర్ఐ మహదేవరెడ్డి, వీఆర్వో దిలీప్ కుమార్, గ్రామ సర్వేయర్లు శివశంకర్ రెడ్డి, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.