ఆక్రమణల తొలగింపు లో అక్రమాలు - మాజీ ఎమ్మెల్యే అన్నా
మార్కాపురం: మార్కాపురం పట్టణంలో ఇటీవల ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులు ఒకే రీతిన కాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి కోసం, ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం, ఆక్రమణల తొలగింపుకు మేము అభ్యంతరం చెప్పమని అన్నారు. కాలువలు హద్దుగా తీసుకొని ఎంక్రోచ్మెంట్ చేశారా? ప్రభుత్వ భూమిని గుర్తించి ఎంక్రోచ్మెంట్ చేశారా ? స్పష్టత ఇవ్వాలన్నారు. కాలువలను హద్దుగా చేసుకుంటే కాలువలు దాటి లోపలికి వెళ్లి బిల్డింగ్ ఎందుకు కూల్చారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక్కడ మీరు పార్టీలను దృష్టిలో పెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు అనేది ప్రజలందరూ గుర్తించారని ఈ సందర్భంగా రాంబాబు పేర్కొన్నారు.సబ్ కలెక్టర్, కమిషనర్ ఇతర అధికారులు ఈ విషయంలో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రెస్మీట్లో రాజకీయాలకు అతీతంగా ఎంక్రోచ్మెంట్ చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నా వెంట వస్తే ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్ జరగలేదు, ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంటు జరగాల్సిన దానికన్నా ఎక్కువ జరిగిందో చూపిస్తానని స్పష్టత ఇచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో మీరు అధికారుల వద్ద నుండి పూర్తి సమాచారంతో వస్తే బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గత ప్రభుత్వంలో దేవాలయాల భూములు, ఇతర భూములు ఆక్రమించుకున్నారని మా పార్టీ మీద నిందలు వేస్తున్నావు. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా.. ఎవరైతే భూములు ఆక్రమించుకున్నారో వారిపై కేసులు పెట్టండి, ప్రజలకు న్యాయం చేయండి అని పిలుపునిచ్చారు. తప్పు చేస్తే మా పార్టీ కార్యకర్తలైన మందలించడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. మా పార్టీలో ఎవరైనా పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే, ప్రజా ద్రోహులుగా మిగిలితే పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని తీవ్రస్వరంతో పేర్కొన్నారు. పదేపదే మా పార్టీ మీద బురద చల్లడం కాకుండా అధికారంలో ఉన్న మీరు గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారిని కోర్టుకు ఈడ్చి ప్రజలకు న్యాయం చేయాలని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, ఎంపిపి కృష్ణారెడ్డి, తర్లుపాడు ఎంపీపీ సుబ్బారెడ్డి,మాజీ ఏఎంసి చైర్మన్ షంషీర్ ఆలీబేగ్, మునిసిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, మహిళా నాయకురాలు పోరుమామిళ్ళ విజయలక్ష్మి, కౌన్సిలర్లు ముంగమూరి శ్రీనివాస్,కొత్త కృష్ణ, బుశ్శెట్టి నాగేశ్వరరావు, సిరాజ్,షేక్షా,పార్టీ నాయకులు రవి, ఉత్తమ్,గుంటక చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.