రుషి కొండ ప్యాలెస్ చూస్తే నాకే కళ్ళు తిరిగాయి.. చంద్రబాబు

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగంలో ముఖ్య అంశాలు 

On
రుషి కొండ ప్యాలెస్ చూస్తే నాకే కళ్ళు తిరిగాయి.. చంద్రబాబు

అమరావతి: రాష్ట్రాన్ని నిలబెట్టాలనే కూటమిగా ఏర్పడి పోటీ చేశాం 

- 93 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలవడం ఒక చరిత్ర 
-  మోదీ, పవన్, నాపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు 
-  గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం 
- గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు అనేక విధానాలు తీసుకు వచ్చాం 
- రాష్ట్ర విభజన సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాం
-  2014లో మనకు లోటు కరెంట్ ఉండేది - అనేక విధానాలు తీసుకువచ్చి మిగులు కరెంట్ పరిస్థితికి తెచ్చాం 
- రాష్ట్రంలో సరికొత్త ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాం 
- అమరావతి రైతులు ఎంతో నమ్మకంతో భూములు ఇచ్చారు
-  మేం ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది..ఫలితాలు చూసేవాళ్లం 
- ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు
-  మేం ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం చేశారు
-  వైసీపీ ప్రభుత్వం జీవోలు కూడా ఆన్‌లైన్‌లో ఉంచలేదు
- గత ప్రభుత్వం కాగ్ కు కూడా నివేదికలు ఇవ్వలేదు 
- విభజన నష్టం కంటే గత ఐదేళ్లలోనే ఎక్కువ నష్టం జరిగింది 
-  ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోయేందుకు సిద్ధంగా లేనని చెప్పా
- అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల కోసమే పనిచేశాం
- ఇప్పుడు భావితరాలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం 
-  గత ఐదేళ్లలో వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారు
-  వాళ్ల దోపిడీ కొనసాగించేందుకు వ్యవస్థలను కూడా నాశనం చేశారు 
-  వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయి
- స్కాముల కోసమే స్కీములు అమలు చేశారు
-  అమరావతి గొప్ప నగరంగా తయారు కాకుండా ఐదేళ్లు అడ్డుకున్నారు 
- రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని దెబ్బ తీశారు 
- నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రంలో కరవు అనేదే ఉండదు
-  పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోతే రెండేళ్లపాటు పట్టించుకోలేదు
- వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయాం 
- తప్పుడు విధానాలతో విద్యుత్ కొన్నారు.. ఆ సంస్థలను నష్టాల్లోకి నెట్టారు
-  గ్రామాల్లో ఉచితంగా లభించే ఇసుకపై వ్యాపారం చేసుకున్నారు 
-  మద్యంపైనా ఇంతలా అవినీతి చేస్తారని మేం ఊహించలేదు
-  చెత్తపైనా పన్ను వేసి ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టారు 
-  ఐదేళ్లపాటు హింసా రాజకీయాలు, కక్షపూరిత కార్యక్రమాలు చేపట్టారు 
-  ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు అనేక పనులు చేశారు
- గత ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించింది 
-  ప్రజలు విశ్వసించే ఓటేస్తే..దుర్మార్గంగా ప్రవర్తించారు 
- గత ప్రభుత్వం సంపద సృష్టించే ఒక్క పని కూడా చేయలేదు
-  పెట్టుబడులు పెట్టేందుకు వస్తే తరిమేశారు 
-  రూ.431 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించారు 
-  రుషికొండ ప్యాలెసను చూస్తే నాకే కళ్లు తిరుగుతున్నాయి 
-  ప్రజాధనంతో ఇంత పెద్ద ప్యాలెస్‌ను కడతారా? 
-  పర్యావరణాన్ని విధ్వంసం చేసి రుషికొండ ప్యాలెస్ కట్టారు 
- రూ.700 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేశారు - 
- సాక్షికి రూ.400 కోట్ల ప్రకటనలు ఇచ్చారు 
-  రూ.500 కోట్లు ఖర్చు పెట్టుంటే రోడ్లు బాగుయ్యేవి 
- కన్నతల్లి శీలాన్ని శంకించేలా పోస్టులు పెట్టించారు 
-  ఆడబిడ్డలను కించపరిచేలా పోస్టులు పెడితే ఉపేక్షించం
-  అవినీతి, అక్రమాలు చేసేందుకు కొందరు రాజకీయాల్లోకి వచ్చారు 
-  టీడీపీ స్థాపించి 45 ఏళ్లు అయ్యింది.. మాకే పేపర్, టీవీ లేవు
-  మద్యంపై రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చారు
-  గత ప్రభుత్వం అన్ని రంగాలను సర్వనాశనం చేసింది 
-  ఇప్పటివరకు రూ.9,74,556 లక్షల కోట్ల అప్పు తేలింది
-  గత ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టాం
-  ఇసుకను మేం ఉచితంగా ఇస్తే.. గత ప్రభుత్వం టన్ను రూ.475కు విక్రయించింది 
- మా హయాంలో వ్యవసాయంలో 16.06 శాతం వృద్ధిరేటు నమోదైంది 
-  గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయంలో వృద్ధిరేటు 10.05 శాతానికి తగ్గింది 
-  గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు పెట్టుబడులు రాలేదు 
-  గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లాయి 
- గత ప్రభుత్వం నిర్వాకం వల్ల అధికారులు జైలు కెళ్లారు 
-  గత ప్రభుత్వం ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తెచ్చింది 
-  ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తున్నాం
-   మేం అధికారంలోకి వచ్చే సరికి రాష్ట్రం వెంటిలేటర్పై ఉంది 
-  ప్రజలు ఇచ్చిన గెలుపు వల్ల ఢిల్లీలో మన పరపతి పెరిగింది 
-  నా దగ్గర డబ్బుల్లేవు.. నూతన ఆలోచనలు ఉన్నాయి
-  నూతన ఆలోచనలతో సంపద సృష్టిద్దాం.. పేదలకు పంచుదాం 
-  సంవత్సరానికి రూ.33 వేల కోట్ల పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ 
-  ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం 
-  64.50 లక్షల మందికి ఒకటో తేదీనే పింఛన్లు ఇస్తున్నాం 
- ఆడబిడ్డల భద్రతకు భరోసా ఇస్తాం 
-  రాజకీయ ముసుగులో నేరాలు చేయాలని చూస్తే ఉపేక్షించం
-  రాబోయే రెండేళ్లలో పోలవరం పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నాం 
-  రోడ్లపై గుంతలు ఏర్పడినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు
-  రూ.850 కోట్లతో గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం 
- 4 పారిశ్రామికవాడల కోసం రూ.10 వేల కోట్ల ఖర్చు చేస్తున్నాం
-  సంపదను సృష్టిస్తాం.. ఆదాయాన్ని పెంచుతాం 
- పెంచిన ఆదాయాన్ని పేదల సాధికారత కోసం ఖర్చు చేస్తాం.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

రుషి కొండ ప్యాలెస్ చూస్తే నాకే కళ్ళు తిరిగాయి.. చంద్రబాబు రుషి కొండ ప్యాలెస్ చూస్తే నాకే కళ్ళు తిరిగాయి.. చంద్రబాబు
అమరావతి: రాష్ట్రాన్ని నిలబెట్టాలనే కూటమిగా ఏర్పడి పోటీ చేశాం  - 93 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలవడం ఒక చరిత్ర -  మోదీ, పవన్, నాపై ప్రజలు...
నిరుద్యోగులకు శుభవార్త! ఈ నెల 18 న జాబ్ మేళా!!
15 మద్యం బాటిళ్లు స్వాదీనం 
ఏపీలో ఈ నెల 25 నుంచి 108 సేవలు బంద్
నేడు అన్నవరం సత్యదేవుని గిరిప్రదక్షిణ
ఈ నెల 29 న ఏపీకి ప్రధాని మోడీ 
జ్వాలాతోరణం విశిష్టత తెలుసా...?