మిల్లంపల్లి ఆలయం లో బయల్పడిన 15 వ శతాబ్దపు తెలుగు శాసనం

On
మిల్లంపల్లి ఆలయం లో బయల్పడిన 15 వ శతాబ్దపు తెలుగు శాసనం

ప్రకాశం జిల్లా: జిల్లా లో మరో తెలుగు శాసనం వెలుగులోకి వచ్చింది. మిల్లంపల్లె వేణుగోపాలస్వామి ఆలయంలో 15వ శతాబ్దానికి చెందిన తెలుగుశాసనం బయటపడింది. 1440లో మిల్లంపల్లె గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో నిత్యాన్నదానం కోసం ఓ గ్రామాన్ని కానుకగా ఇచ్చినట్టు శాసనంలో రాసి ఉంది. శ్రీమన్‌ మహా మహామండలేశ్వర అనివారణ సింహారావు అనే పాలకుడు వరదరాజులుకు కొలుకులసీమలోని కూనెబోయినపల్లెని బహుమతిగా ఇచ్చి స్వామివారి ఆలయంలో నిత్యాన్నదానం చేయాలని సూచించినట్టు శాసనంలో గుర్తించారు.

పురావస్తుశాఖ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. శాలివాహనశకం 1440 వైశాఖ శుద్ద పంచమినాడు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన మిల్లంపల్లె గోపినాధదేవరకు (ఇప్పటి వేణుగోపాలస్వామి) నిత్యాన్నదానం నిర్వహించేందుకు శ్రీపోతరాజు సింగరయ్య గారికుమారుడు వరదరాజులుగారి ఏలుబడిలో ఉన్న కొలుకుల సీమలోని కూనబోయినపల్లి అనేగ్రామాన్ని స్వామివారి నైవేద్యాలకు సమర్పించారు. అనివారణ సింహారావు బిరుదుకలిగిన ఈ రాజులు గుత్తి పాలకులుగా కూడా ఉన్నారు. ఇది ఇక్కడ లభించిన మొదటి శాసనంగా రికార్డు చేశారు.

కొద్ది రోజుల క్రితం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో 14వ శతాబ్దం నాటి మరో శాసనం వెలుగు చూసింది. ఆలయ ప్రాంగణంలోని నంది పక్కనే ఉన్న ఓ స్తంభంపై ఈ శాసనం చెక్కి ఉన్నట్టు గుర్తించారు. అయ్యంగార్లకు భూములు, సంపదలు ఉన్నా భిక్షాటన చేయడం ద్వారా వచ్చిన ఆదాయంతో ఆలయాల పునరుద్ధరణ, నిర్వహణ చేసేవారు. అలా 14వ శతాబ్దంలో త్రిపురాంతకేశ్వరాలయం భిక్షవృత్తి అయ్యంగార్ల ఆధీనంలో ఉందన్న వివరాలను ఈ శాసనం తెలియచేస్తోంది. తాజాగా ఈ శాసనాన్ని చారిత్రక పరిశోధకులు తురిమెళ్ళ శ్రీనివాసప్రసాద్‌ గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చారు. శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విలసిల్లుతున్న త్రిపురాంతకం క్షేత్రం శైవ, శాక్తేయ ఆలయాల్లో అతి పురాతనమైంది.

ఇక్కడ వేద విశ్వవిద్యాలయం నడిపినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. త్రయంబకాయ- త్రిపురాంతకాయ.. త్రికాగ్నికాలాయ-కాలాగ్నిరుద్రాయ అంటూ ఈ ఆలయంలో నిత్యం రుద్రం వల్లె వేస్తుంటారు. శ్రీచక్ర ఆకారంలో శక్తి పీఠాల ఆలయాలను నిర్మిస్తుండటం ఆనవాయితీ కాగా త్రిపురాంతకేశ్వరుని ఆలయం శ్రీచక్ర పీఠంపై నిర్మితం కావడంతో ఈ ఆలయానికి ప్రత్యేక విశిష్టత సమకూరింది. ఈ ఆలయం శ్రీశైల ఆలయం కంటే అతి పురాతనమైందిగా చెబుతారు. 7వ శతాబ్ధంలోని కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన అతి ప్రాచీన ఆలయం త్రిపురాంతక క్షేత్రంగా చెబుతారు. ఆలయానికి వేసిన రంగులను ఇటీవల తొలగించడంతో శిల్ప సంపదతో పాటు గోడలపై శాసనాలు వెలుగులోకి వస్తున్నాయి.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

నేటి పంచాంగం: శుక్రవారం, నవంబరు 15, 2024 నేటి పంచాంగం: శుక్రవారం, నవంబరు 15, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం      దక్షిణాయణం - శరదృతువుకార్తీక మాసం -  శుక్ల పక్షం  తిథి: పౌర్ణమి  తె3.07 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం  : భరణి...
ఆత్మహత్యకు ప్రయత్నించిన అంగన్వాడీ ఆయ 
చెట్టును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
నేటి పంచాంగం: గురువారం, నవంబరు 14, 2024
నేటి పంచాంగం: బుధవారం, నవంబరు 13, 2024
వెలిగొండపై మళ్ళీ ఆశలు చిగురించాయి : బీజేపీ నేత డాక్టర్ ఏలూరి
డ్రోన్ల తో గంజాయి పై యుద్ధం.... బాబు సక్సెస్