వైకాపా నేత అన్నా రాంబాబు వి అర్దరహిత విమర్శలు 

శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి

On
వైకాపా నేత అన్నా రాంబాబు వి అర్దరహిత విమర్శలు 

మార్కాపురం: దీర్ఘకాలం తర్వాత పట్టణంలో జరుగుతున్న ఆక్రమణ ల తొలగింపు విషయంలో యావత్ పుర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఒక వైఎస్సార్సీపి నాయకులే మంచిలో చెడును వెతుకుతూ లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలలో అశాంతిని సృష్టిస్తున్నారని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి  అన్నారు. స్థానిక జవహర్ నగర్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు పాత్రికేయుల సమావేశంలో ఆవేశ పూర్వక అంశాన్ని తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీపై, నేతలపై అర్థంపర్థం లేని విమర్శలు చేశారని అన్నారు. విమర్శలలో నైతికత ఉండేలా ఆ నాయకులు చూసుకోవాలని హితవు పలికారు. వైకాపా నేతలు ప్రతి అడుగు ప్రజలను మోసం చేసే దిశగానే వేస్తున్నారని అన్నారు. ఆక్రమణల తొలగింపులో వివక్ష చూపుతున్నామని పేర్కొనడం పట్ల శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తీవ్రంగా స్పందించారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలల కాలం పూర్తి అయిందని వివక్ష అంటూ పోతే ఆక్రమణల తొలగింపులో వైఎస్సార్సీపీ నాయకుల ఏ ఒక్క భవనం మిగలదని అన్నారు. కొన్ని సంవత్సరాల కాలం నుండి భవన నిర్మాణదారులు రోడ్డుపక్కనున్న సైడు కాలువలను పూడ్చి స్లాబులు వేసుకొని భవనాల ముందు భాగాలను అద్దెలకు ఇచ్చుకొని ఇష్టారాజ్యంగా ఆక్రమణలకు పాల్పడ్డారని, ఈ కారణంగా కాలువలు ఉన్నప్పటికీ పూడిక తీయక సంవత్సరాల కాలం  పట్టిందని,, కాలువలు బయటికి తీసేందుకు భవనాల ముందు భాగాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కూల్చాల్సి వచ్చిందని ఆ మాత్రం ప్రతిపక్ష నాయకులకు తెలియదా అని చురకలు అంటించారు. తాను మార్కాపురంలో పుట్టి పెరిగిన వ్యక్తినని, సోదరుడు అన్నా రాంబాబు  పక్క నియోజకవర్గంలో పుట్టి అక్కడ పెరిగి ఇక్కడికి వచ్చారని ఇక్కడి పరిస్థితులు ఆయనకు తెలియవని అన్నారు. నియోజకవర్గ ప్రతి సమస్య తనకు తెలుసునని, నిన్నటి వరకు గిద్దలూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉంటూ ఇంపోర్ట్ బ్రదర్ గా అన్నా రాంబాబు ఈ ప్రాంతానికి వచ్చారని, ఇక్కడి స్థితిగతులు ఆయనకు ఏ మాత్రం తెలియవు అని అన్నారు. కొందరు భజనపరులు ఆయన చుట్టూ చేరి లేనిపోనివి చెబుతున్నారని, వాటిని నమ్మి గుడ్డిగా విమర్శలకు దిగితే నష్టపోతారని వైకాపా నేతకు హితబోధ చేశారు. మెడికల్ కాలేజీ తరలింపు విషయంలో అన్నా రాంబాబు అర్థరహిత విమర్శలతో ఆరోపణలు చేశారని, నిండుగా నిధులు ఇవ్వకపోతే ఏ గుత్తేదారుడైన ఏమి చేస్తాడని అన్నారు. నిధులను దిగమింగి ప్రజలకు ఆ పార్టీ నాయకుడు మోసం చేశారని పేర్కొన్నారు. తరలించేందుకు సిద్ధంగా ఉన్న కాలేజీని అడ్డుకొని ప్రైవేటు భాగస్వామ్యంతో కళాశాలను పనులు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేటు పాఠశాలలకు తారతమ్యాన్ని చూపిన ఓ కళాశాల అధినేతగా ప్రతిపక్ష పార్టీనేత అన్నా రాంబాబు కు ఆ మాత్రం తెలియదా అన్నారు. నిన్నటి వరకు గిద్దలూరు నియోజకవర్గంలో ఉండి రాజకీయ వలస వచ్చిన అన్నా రాంబాబుకి ఇక్కడి పరిస్థితులు పూర్తిగా తెలియవని చమత్కరించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కూడా బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాలు విసరడం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వెలుగొండ ప్రాజెక్టు పురుడు పోసుకుందని, నిర్మాణ పనులు కూడా ఆ సమయంలో వేగవంతంగా జరిగాయని, ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం పరిణామాలు చేజారిపోవడం తో వెలుగొండ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి చేసింది ఏమీ లేదని, ఎంత శాతం చేసింది బడ్జెట్ నిధులు ఏంటి లెక్క పత్రాలు అన్ని తమ వద్ద ఉన్నాయని ఈ విషయంలో ఏ ప్రాంతంలోనైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని అన్నారు. ప్రజలకు మభ్యపెట్టి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిందని జాతికి అంకితం చేయడం ఆ పార్టీకి ఆ పార్టీ నేతల మోసపూరిత విధానాలకే దక్కిందని అన్నారు, ప్రతిరోజు నిరంతరంగా పనులు చేస్తూ పోతే ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు మరో రెండున్నర సంవత్సరాలు కాలం పడుతుందని ప్రాజెక్టులో అనేక విభాగాలు సగం సగం లోనే నిలిచి ఉన్నాయని వివరించారు. మార్కాపురాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి జిల్లాగా మార్చి, ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తానంటే ఏమిటో చేసి చూపుతానని కందుల నారాయణ రెడ్డి అన్నారు. టిడిపిలో ఆక్రమణదారులు ఉన్నారని ప్రభుత్వ భూములు కాజేశారని తమ పార్టీలో అలాంటి వారు ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని బహిరంగ మీడియా ముందు చెప్పిన అన్నా రాంబాబు,ఆ మాటకు కట్టుబడి ఉండాలని అన్నారు. నియోజకవర్గం లోని కొనకన మెట్ల మండలంలో పాటిబండ్ల గోపాల స్వామి అనే ఒక పెద్ద మనిషికి సంబంధించిన పొలాన్ని వైకాపా పార్టీ నేతలు దొంగ డాక్యుమెంట్లను సృష్టించి సొంతం చేసుకున్నారని, ఆ భూముల పై బ్యాంకులలో రుణాలు తీసుకొని జల్సాలు చేస్తున్నారని, ఈ విషయం పక్క నియోజకవర్గం నుండి వచ్చిన మీకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. అలాగే పట్టణంలోని 206B సర్వేనెంబర్ లోని 6 ఎకరాల దేవస్థానం భూమిని మీ పార్టీ నాయకుడు గొలమారి శ్రీనివాసరెడ్డి కబ్జా చేసి స్వాధీనం చేసుకుని అందులో కాటా నడుపుకుంటున్నారని, ఈయనతో పాటు నాదెళ్ల సుబ్రహ్మణ్యం అనే మీ పార్టీ పారిశ్రామికవేత్త దేవాదాయ శాఖ భూములు కాజేసి ఉన్నారని వీరిపై చర్యలు తీసుకొని మీ చిత్తశుద్ధి, మీ విధేయత చూపాలని అన్నారు. తమ పార్టీ టిడిపిలో అలాంటి నాయకులు ఎవరైనా ఉంటే నాలాగే మీరు కూడా వారి పేర్లతో పాటు వారి అవినీతిని బయట పెడితే నేను వారితో మాట్లాడి ఆక్రమణ భూములను తిరిగి స్వాధీనం చేయిస్తానని అన్నారు. మార్కాపురంలో జరుగుతున్న ఆక్రమణల తొలగింపు అభివృద్ధి కోసమేనని అన్ని రకాలుగా మార్కాపురాన్ని అభివృద్ధి పరిచి అందరి ఆదరాభిమానాలు చూరగొంటానని, ప్రతిపక్షాలు మిత్రపక్షాలు ప్రజా సంఘాలు అభిమాన సంఘాలు అందరూ నన్ను ప్రోత్సహించి అభివృద్ధి కి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో  తెలుగుదేశం నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున,నాలి కొండయ్య యాదవ్, కనిగిరి బాల వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

గొంతు సంబంధ సమస్యలకు నివారణా యోగాలు గొంతు సంబంధ సమస్యలకు నివారణా యోగాలు
చలికాలంలో సాధారణంగా ప్రతి ఒక్కరికీ గొంతు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో జలుబు,దగ్గు. అలాగే పెద్దవాళ్ళు దగ్గు తో ఇబ్బంది పడతారు. వంటింటి చిట్కాలతో...
10 న శ్రీ కృష్ణ యాదవ అన్నదాన సేవాసంస్థ సర్వ సభ్య సమావేశం
జాతీయ సైన్స్ ఫెయిర్ కు ఏకేవికే  విద్యార్థులు
పొదిలి ఎయంసీ రేసు లో బాబురావు!
భవనం పెద్ద వెంకటరెడ్డి ని పరామర్శించిన మాజి ఎమ్మెల్యే అన్నా
జగన్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మార్కాపురం వైకాపా నేతలు 
వైసిపి జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడిగా వెన్న శివ కృష్ణారెడ్డి