గుడిమెట్ట లో పొలం పిలుస్తుంది

On
గుడిమెట్ట లో పొలం పిలుస్తుంది

రాచర్ల :  మండలం లోని గుడిమెట్ట, సోమదేవిపల్లి గ్రామాలలో  బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు షేక్. ఖాసీంబీ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ అధికారులు చెప్పేటటువంటి సూచనలు  పాటించి పంటలలో అధిక దిగుబడి పొందవలెనని  తెలిపారు. అనంతరం గుడిమెట్ట గ్రామ సర్పంచి రెడ్డి కాశి రెడ్డి  మాట్లాడుతూ  కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసేటటువంటి రైతులు  ఉద్యానవన శాఖ ద్వారా అమలవుతు న్నటువంటి  పథకాలను ఉపయోగించు కోవాలని తెలిపారు. బోరు ఉండి  కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసేటటువంటి రైతులు  90% రాయితీపై  డ్రిప్పు వేసుకొని తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించవలెనని రైతులను కోరారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి షేక్. అబ్దుల్ రఫీక్  మాట్లాడుతూ ప్రస్తుతం కంది పంట కళ్ళే దశలో ఉందని  ఈ దశలో శనగ పచ్చ పురుగు మరియు మారూక మచ్చల పురుగు ఆశించే అవకాశం ఉందని  ముందుగానే 5% వేప గింజల కషాయము లేదా వేప నూనె 5 మి లి లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసినట్లయితే పురుగు రాకుండా ఉంటుందని తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్నటువంటి వివిధ పథకాలను గురించి  రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఉద్యానవన శాఖ అధికారి  పి.విష్ణు ప్రియ  మాట్లాడుతూ ఉద్యానవన శాఖ లో ఎంఐడిహెచ్ పథకం ద్వారా పండ్లు, హైబ్రిడ్ కూరగాయల, పూల తోటల విస్తిర్ణత కింద 40% రాయితీ అందిస్తారు అని తెలిపారు, 1 ఎకర పూల తోటలకు 6400 రూపాయల సబ్సిడీ . ప్లాస్టిక్ ముల్చింగ్ కు ఎకరాకు 6400 సబ్సిడీ, సేద్యపు కుంటలు (20.20.3 ఎంట్స్ ) 75000 సబ్సిడీ , ప్యాకేహౌస్ (30,20 ఫీట్ ) కు 200000 సబ్సిడీ, కలెక్షన్సెంటర్ (60*40 ఫీట్ ) కు 6,00,000 ,కోల్డ్ రూమ్ (30 ఎంటి ) కి 5.25 లక్షల సబ్సిడీ ఇస్తారని తెలిపారు. అనుముల వీడు పశువైద్యాధికారి  డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటం వలన  పశువులలో గాలికుంటు వ్యాధి సోకే అవకాశం ఉందని దానికి తీసుకోవలసినటువంటి తగు జాగ్రత్తలను గురించి  పాడి రైతులకు వివరించడం జరిగినది. అనంతరం ఏపీఎంఐపీ ఏరియా ఆఫీసర్ ఎన్. మోహన్ కృష్ణ  మాట్లాడుతూ డ్రిప్పు మరియు స్పింకులర్స్ కావాల్సినటువంటి రైతులు  రైతు సేవ కేంద్రం నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, పశు వైద్య సిబ్బంది మరియు గ్రామంలోని రైతులు పాల్గొనడం జరిగింది.

Screenshot_2024-02-14-16-51-16-09_99c04817c0de5652397fc8b56c3b3817

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

ఆత్మహత్యకు ప్రయత్నించిన అంగన్వాడీ ఆయ  ఆత్మహత్యకు ప్రయత్నించిన అంగన్వాడీ ఆయ 
పెద్దారవీడు:  మండలం లోని బి. చెర్లోపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడి ఆయా శివాంజలి, కార్యకర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.పరిస్థితి విషమంగా ఉండడంతో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు...
చెట్టును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
నేటి పంచాంగం: గురువారం, నవంబరు 14, 2024
నేటి పంచాంగం: బుధవారం, నవంబరు 13, 2024
వెలిగొండపై మళ్ళీ ఆశలు చిగురించాయి : బీజేపీ నేత డాక్టర్ ఏలూరి
డ్రోన్ల తో గంజాయి పై యుద్ధం.... బాబు సక్సెస్
మార్కాపురం లో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలి