సమాజ సేవే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యం

జిల్లా కన్వీనర్ గుంటక వనజాక్షి

On
సమాజ సేవే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యం

మార్కాపురం: సమాజ సేవే లక్ష్యంగా మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ కృషి చేస్తుందని ఆ సంస్థ జిల్లా కన్వీనర్ గుంటక వనజాక్షి అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం ఆదివారం స్థానిక  శుభం కళ్యాణ మండపంలో పట్టణ అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన  జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన గుంటక వనజాక్షి మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ లో రాష్ట్రంలో ఇప్పటివరకు 70,000 మంది పైగా సభ్యులు ఉన్నారని అన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ మహోన్నతమైన లక్ష్యంతో రామచంద్ర రెడ్డి స్థాపించిన మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ నేడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిందని ఆమె అన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే మరోవైపు సమాజానికి స్ఫూర్తి కలిగించే విధంగా వినూత్న కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రతిభవంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు విద్యార్థులకు నైతిక విలువలు వ్యక్తిత్వ వికాసం, కెరీర్ గైడెన్స్ బోధన తోపాటు పేదలకు ఉచిత వైద్య శిబిరాలు అందించడం జరుగుతుందని అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టేందుకు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని అన్నారు. మార్కాపురం పట్టణంలో కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా ఉచిత మార్చురీ ఫ్రీజర్లు, ఉచిత శాంతి రథాలు అందిస్తున్నామని అన్నారు. అలాగే నిరుపేదలైన మహిళలకు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు వారికి ఉచితంగా కుట్టు మిషన్లను అందించడం జరిగిందని ఆమె అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్న దాతలకు ఈ సందర్భంగా గుంటక వనజాక్షి ధన్యవాదాలు తెలిపారు.సభకు అధ్యక్షత వహించిన ఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతన కమిటీ మరింత సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరి గుంటక చెన్నారెడ్డి, ఉపాధ్యక్షులు అర్ కె జి. నరసింహం తదితరులు పాల్గొన్నారు.

*నూతన కమిటీ ఎన్నిక*

మానవత స్వచ్ఛంద సంస్థ నూతన కమిటీని నియమించారు.అధ్యక్షులుగా వెలిశెట్టి చలమయ్య, ఉపాధ్యక్షులుగా, సీహెచ్ సుబ్బారావు, సెక్రటరీగా గుంటక  చెన్నారెడ్డి,  సహాయ కార్యదర్శిగా రావిక్రింది కిరణ్, అవెర్ నెస్ సెక్రటరి గా కొణిజేటి రమేష్, విద్యా కార్యదర్శిగా నారాయణం లావణ్య, హెల్త్ మెడికల్ సెక్రటరీగా కంచర్ల చెన్న కృష్ణ గౌడ్, ఏమరెన్సీ సర్వీసెస్ సెక్రటరీగా నటుకుల వెంకట కృష్ణ,కోశాధికారిగా గంగిశెట్టి కిరణ్ లు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.ఈ సందర్భంగా నూతన కమిటీని పలువురు అభినందించారు.

Screenshot_2024-04-05-18-53-43-27_99c04817c0de5652397fc8b56c3b3817

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

ఆత్మహత్యకు ప్రయత్నించిన అంగన్వాడీ ఆయ  ఆత్మహత్యకు ప్రయత్నించిన అంగన్వాడీ ఆయ 
పెద్దారవీడు:  మండలం లోని బి. చెర్లోపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడి ఆయా శివాంజలి, కార్యకర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.పరిస్థితి విషమంగా ఉండడంతో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు...
చెట్టును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
నేటి పంచాంగం: గురువారం, నవంబరు 14, 2024
నేటి పంచాంగం: బుధవారం, నవంబరు 13, 2024
వెలిగొండపై మళ్ళీ ఆశలు చిగురించాయి : బీజేపీ నేత డాక్టర్ ఏలూరి
డ్రోన్ల తో గంజాయి పై యుద్ధం.... బాబు సక్సెస్
మార్కాపురం లో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలి