ఇక్కడ అంతే! క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలా? ₹500 కొట్టాల్సిందే!!

ఆందోళన చేపట్టిన కూటమి నాయకులు

On
ఇక్కడ అంతే! క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలా? ₹500 కొట్టాల్సిందే!!

తర్లుపాడు : తహసీల్దార్ కార్యాలయం లో ప్రతి పనికి ఒక రేటు కేటాయించి ప్రజలను జలగల్లా పీక్కొని తింటున్నారు. విద్యార్థులకు చదువులకు కావలసిన కులం, ఆదాయం, నేటివిటి, ధ్రువపత్రాలకు కూడా 500 రూపాయలు ఇస్తేనే సంతకం చేస్తున్నారు. లేదంటే ఆ సర్టిఫికెట్స్ అక్కడే ఉంటాయి. వి ఆర్ ఓ లు, డిప్యూటీ తహసీల్దార్ సంతకం చేసి పంపించిన తహసీల్దార్ జయవర్ధన్ చేయి తడపనిదే సంతకం ముందుకు సాగే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. విద్యార్థుల తల్లి తండ్రులు సర్టిఫికెట్స్ కూడా డబ్బులు ఇవ్వాలని ప్రశ్నిస్తే ఇక్కడికి తహసీల్దార్ గా వచ్చేందుకు లక్షలు వెచ్చించి వచ్చినట్లు బహిరంగంగా చెప్పడం విశేషం. తహసీల్దార్ కంప్యూటర్ ఆపరేటర్ ను తన రూమ్ లో తన సమీపంలో పెట్టుకొని డబ్బులు ఇచ్చిన వారికే అప్రూవల్ కొట్టేలా ఏర్పరుచుకొని ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నాడు. తహసీల్దార్ బరితెగించి కార్యాలయంలో చిన్నపాటి ఉద్యోగి చేత వసూలు చేపిస్తు దండుకుంటున్నాడు. తర్లుపాడు గ్రామానికి చెందిన సయ్యద్ అల్లాబక్షు తన కుమార్తె రహీమున్ డి ఎస్ సి పరీక్షల కొరకు రెసిడెన్సీయల్ సర్టిఫికెట్ అక్టోబర్ ఒకటవ తేదీ న దరఖాస్తు చేసుకోగా వి ఆర్ ఓ నూనె విజయ భాస్కర్ రెడ్డి దరఖాస్తును పరిశీలించి నివేదికను తహసీల్దార్ కు పంపించారు. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ విజయకుమార్ పరిశీలించి సంతకం చేసి తహసీల్దార్ సంతకం కోసం ఫైల్ పెట్టారు. తహసీల్దార్ సంతకం పెట్టాలంటే 500 రూపాయలు ఇస్తేనే పెడతా అని భీష్మించుకుని కూర్చోవడంతో అల్లాబక్షు ఈ విషయాన్నీ పత్రిక విలేకరులకు తెలియపర్చగా తహసీల్దార్ కు డబ్బులు ఇస్తూ ఫోటో తీయబోగా  ఫైల్ ఇసిరి వేసి అల్లాబక్షును గెంటి వేశాడు.ఈ విషయం టీడీపీ జనసేన నాయకులకు సమాచారం అందడంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అవినీతి తహసీల్దార్ డౌన్ డౌన్ అంటూ ధర్నా చేశారు. ఎట్టకేలకు ధర్నా చేస్తున్న కూటమి నాయకుల వద్దకు వచ్చి తప్పు అయిందంటూ సయ్యద్ రహీమున్ రెసిడెన్సీయల్ సర్టిఫికెట్ మీద సంతకం చేసి ఇచ్చారు.కొన్ని రోజుల క్రితం ఒక విద్యార్థికి ఆర్మీలో ఉద్యోగం వచ్చిందని కౌంటర్ సర్టిఫికెట్ కోసం తన చుట్టూ 4రోజులు తిప్పుకున్నాడని, తర్లుపాడు గ్రామములో ఒకరికి ప్రాపర్టీ సర్టిఫికెట్ కోసం డబ్బులు డిమాండ్ చేసాడని ఆరోపణలు ఉన్నాయని ఈ అవినీతి తహసీల్దార్ జయవర్ధన్ పై చర్యలు తీసుకోవాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కి, మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాధ్ కు ఫోన్ లో పిర్యాదు చేశారు.ఈ నిరసన కార్యక్రమం లో టీడీపీ మండల అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి, వాణిజ్య విభాగం సభ్యులు పుచ్చనూతల గోపినాధ్, మాజీ కోప్షన్ అఫ్రోజ్, టీడీపీ నాయకులు షేక్ ఖాసీంవలి, పొదిలి కృష్ణ, సయ్యద్ పీరా,జనసేన నాయకులు సిద్ధం భాస్కర్, మువ్వా సురేష్, జి బాలరాజుతో 20మంది పాల్గొన్నారు.

IMG-20241004-WA0081

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం
అమరావతి: 'ఔట్ సోర్సింగ్ విధానంలో ఆప్కాస్  ద్వారా ఉద్యోగాల్లో చేరాము. మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 23 నెలలుగా విధులు నిర్వహిస్తున్నాము. విధుల్లో చేరిన...
శ్రీవాణి టికెట్ల సంఖ్య పెంపు
ఒంగోలు కమర్షియల్ టాక్స్ ఆఫీస్ లో ఎసిబి దాడులు
వాట్సాప్ లో కలెక్టర్ కు మెసేజ్...గంటల వ్యవధిలో రిజల్ట్ 
ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడి
నేటి పంచాంగం:  బుధవారం, నవంబరు 20, 2024
సినీ నటుడు పోసాని పై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ