తిరుమల లడ్డు వివాదం పై మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్
విజయవాడ: తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం పై మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం లో మాట్లాడారు. జగన్ మాట్లాడుతూ 100 రోజుల పాలన పై ప్రజల్లో వ్యతిరేకత వస్తె తిరుమల లో నెయ్యి కల్తీ అంటూ డైవర్షన్.దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకునే దారుణమైన మనస్తత్వం చంద్రబాబుకే ఉంది.ఇంతకంటే దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు తప్ప ప్రపంచంలో ఎవరూ చెయ్యరు..సిఎం హోదాలో ఉంటూ ఇలాంటి దారుణమైన అబద్ధాలు మాట్లాడటం ధర్మమా..?ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వామివారి మనోభావాలతో ఆడుకోవడం దర్మమేనా..?
నెయ్యి సప్లై కొత్తగా జరిగేది కాదు.. ప్రతీ ఆరునెలకు ఒకసారి టెండర్లు ద్వారా సప్లై కాంట్రాక్టు ఇస్తారు.లడ్డూ, నైవేద్యం తయారీ అనేది దశాబ్దాలుగా జరుగుతుంది కొత్తగా మార్పులు చేసేది ఏమి ఉండదు.తయారీ కి నియమనిబంధనలు దశాబ్దాలుగా ఫాలో అవుతున్నారు..పంపిణీ చేసే సంస్థలు NABL certification తీసుకొని రావాలి.. మళ్ళీ టీటీడీ లో మూడు రకాల టెస్టుల్లో పాస్ అవ్వాలి.ఇవన్నీ పాస్ అయితే తప్ప సరుకులు లోపలకి రావు.. తేడా వస్తే బండి వెనక్కి పంపేస్తారు.ఏ రిపోర్టులో తేడా వచ్చినా వచ్చిన నెయ్యి, సరుకులు వాడకం జరగదు.మా ఐదేళ్ల పాలనలో 18 సార్లు టెస్టింగ్ ఫెయిల్ అయితే వెనక్కి పంపాం.గతంలో చంద్రబాబు హయంలోనూ అనేక సార్లు వెనక్కి పంపారు.ఇలాంటి గొప్ప టెస్టింగ్ వ్యవస్థ టీటీడీలో ఉంది.. ఇది గొప్పగా చెప్పుకోవాలి.టీటీడీలో ఉన్న ఇలాంటి మంచి వ్యవస్థ ఉందని అందరికీ చెప్పాల్సింది పోయి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు.జూలై 12 తేదిన శ్యాపుల్స్ తీసుకున్నారు.. జూలై 17 టెస్ట్ కి పంపారు.. జూలై 23 తేదిన రిపోర్ట్ వచ్చింది.ఈ రెండు నెలలుగా ఈ విషయం చెప్పకుండా చంద్రబాబు ఏమీ చేస్తున్నాడు.. అలాంటి రిపోర్ట్ ను టిడిపి కార్యాలయంలో విడుదల చేస్తారా..?టీటీడీ లడ్డూకి ప్రపంచ ప్రసిద్ధి ఉంది.. ఇక్కడ తయారీ వ్యవస్థలో ఉన్న నిబంధనలు గొప్పగా చెప్పుకోవాలి..ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఆ క్రెడిట్ తీసుకోకుండా అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు.వేంకటేశ్వర స్వామి పవిత్రని చంద్రబాబు అపవిత్రం చేస్తున్నాడు..టీటీడీ అనేది చాలా విశిష్టమైనది.. క్యాబినెట్ కూర్పు కంటే టీటీడీ బోర్డు కూర్పు అతి కష్టం..కేంద్రం నుండి చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిఫార్సు చేస్తారు.విశిష్టమైన మనుషులు అంతా బోర్డులో సభ్యులుగా ఉంటారు..అలాంటి వాళ్ళంతా టెండర్ల ప్రక్రియను చూస్తారు.. టీటీడీ అనేది గొప్ప వ్యవస్థ.. ప్రతీ దాంట్లో గొప్ప గొప్ప ప్రాక్టీస్ లు ఉంటాయి.
Yv సుబ్బారెడ్డి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
Yv సుబ్బారెడ్డి 45 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాడు.. అయ్యప్ప కొండకి వెళ్ళాడు.Yv సుబ్బారెడ్డి అయ్యప్ప మాల లో గురు స్వామి హోదా లో ఉన్నారు.ఈ వ్యవహారం పై ప్రధానికి, సుప్రీం కోర్టు జస్టిస్ కి లేఖలు రాస్తా..ఇందులో నిజమైన విచారణ జరగాలి.. చంద్రబాబుకి అక్షింతలు పడాలి. యెందుకు ఇలాంటివి చేస్తున్నాడో.. బాబు కు బుద్ధి రావాలి అని ఆ ఏడుకొండల స్వామి వారి ని ప్రార్ధిస్తున్నాను.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.