ఆకర్షణీయ డిపాజిట్ పథకాలు రావాలి.. ఆర్ధిక మంత్రి నిర్మల
న్యూఢిల్లీ: ఆకర్షణీయమైన పథకాలు తీసుకురావాలని బ్యాంకులకు నిర్మలా సీతారామన్ సూచించారు.
బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గుతున్న వేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు కీలక సూచన చేశారు. ప్రజల నుంచి డిపాజిట్లను ఆకర్షించడానికి వినూత్న ఉత్పత్తులను తీసుకురావాలని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సమావేశం అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. రుణాలకు, డిపాజిట్లకు సమతూకం ఉండాలన్నారు.డిపాజిట్ల సేకరణ విషయంపై బ్యాంకులు దృష్టి సారించాలని నిర్మలా సీతారామన్ అన్నారు. తద్వారా వచ్చిన నిధులను అవసరమైన వారికి రుణాలుగా సమకూర్చాలన్నారు. అప్పుడే డిపాజిట్లకు, రుణాలకు మధ్య ఉన్న అంతరం తగ్గుతుందన్నారు. ఇందులో భాగంగా వినూత్న, ఆకర్షణీయ డిపాజిట్ పథకాలను తీసుకురావాలని బ్యాంకులకు సూచించారు.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సైతం దీనిపై మాట్లాడారు. వడ్డీ రేట్లను డీ రెగ్యులేట్ చేశామని, బ్యాంకులు సొంతంగా డిపాజిట్లను పెంచుకోవడానికి రేట్లను పెంచుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో బ్యాంకులకు ఆ స్వేచ్ఛ ఉందన్నారు. ఇటీవల ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంలోనూ డిపాజిట్ల అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.