ఇంటింటి సర్వేకు సర్వం సిద్ధం

On
ఇంటింటి సర్వేకు సర్వం సిద్ధం

సమగ్ర కుటుంబ సర్వేకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న సర్వేలో ప్రతి కుటుంబం వివరాలను సేకరించనున్నారు.

సర్వే కోసం 1,979 మంది ఎన్యుమరేటర్లు, 180 మంది సూపర్‌వైజర్లను నియమించారు. ఒక్కో ఎన్యుమరేటర్‌ 150 నుంచి 175 ఇళ్లను సర్వే చేయాల్సి ఉంటుంది. సూపర్‌వైజర్లు సైతం దాదాపు 10 శాతం కుటుంబాలను ర్యాండమ్‌గా తనఖీ చేసి.. సర్వే సవ్యంగా జరిగిందీ లేనిదీ పరిశీలిస్తారు. తమ పరిధిలోని ఎన్యుమరేటర్లకు అవసరమైన సూచనలివ్వడంతో పాటు ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కరిస్తారు. 

56 అంశాలు..75 ప్రశ్నలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో 56 అంశాలతో పాటు 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలతో సమాచారం సేకరించనున్నారు. సర్వే నిమిత్తం ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను ఎన్యుమరేటర్లుగా నియమించడంతో విద్యార్థులకు ఉదయం పూట మాత్రమే తరగతులు కొనసాగనున్నాయి. మధ్యాహ్నభోజనం అనంతరం టీచర్లు సర్వేలో పాల్గొంటారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు యథావిధిగా నడుస్తాయి. జిల్లాలో 580 ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. 1,117 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులతో పాటు, హెచ్‌ఎంలు, సీఆర్సీలు, సమగ్రశిక్ష సిబ్బంది, ఇతర ఉద్యోగులు 355 మంది పనిచేస్తున్నారు. వీరిని గణకులుగా నియమించి సర్వేలో పాల్గొనాలని డీఈఓ గోవిందరాజులు పేర్కొన్నారు. 

గతంలో మాదిరిగా...

సర్వేలో భాగంగా జిల్లావ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రజల వివరాలను సేకరించనున్నారు. 2014లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 2,20,673 నివాసాలు, 9,21,623 జనాభా ఉన్నట్లు లెక్క తేలింది. ప్రస్తుతం దాదాపు 2.5 లక్షల నివాసాలకు చేరి ఉంటాయని అంచనా. అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. అవసరం మేరకు అదనపు ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల సేవలను వినియోగించుకుంటారు. 

రంగంలోకి 1,979 మంది ఎన్యుమరేటర్లు 

సర్వేలో ఎన్నో వివరాలు..

సర్వేలో భాగంగా కుటుంబ యజమానితో పటు సభ్యులందరి వివరాలు.. యజమానితో వారికున్న సంబంధం.. సభ్యులందరి విద్యార్హతలు, ఉద్యోగం లేదా ఉపాధి వివరాలు, మాతృభాష, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏమైనా సంక్షేమ ఫలాల పొందారా.. అద్దె ఇల్లా..సొంతిల్లా.. ఉంటున్న ఇంటికి ఉచిత విద్యుత్‌ సదుపాయం పొందుతున్నారా? వంటి వివరాలు సైతం సేకరించనున్నారు. ఇక స్థిరాస్థిలో భాగంగా భూములు, ఇల్లు వంటి వివరాలతో పాటు చరాస్థి వివరాల్లో భాగంగా ద్విచక్ర వాహనాలతో పాటు కంప్యూటర్లు వాడుతుంటే ఆ వివరాలను సైతం సేకరిస్తారు.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

తిరుమల శ్రీవారి ని దర్శించుకున్న సిఎస్ఓ యశ్వంత్  తిరుమల శ్రీవారి ని దర్శించుకున్న సిఎస్ఓ యశ్వంత్ 
తిరుమల: సిఎం చంద్రబాబు నాయుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సియస్ఓ) తంగిరాల యశ్వంత్ శుక్రవారం శ్రీవారి ని దర్శించుకున్నారు. యశ్వంత్,తన తల్లిదండ్రులు టియన్ జగన్నాథ్, శార్వాణి లతో...
శ్రీశైలం మల్లన్న దారిలో మనసు దోచే భారీ నిర్మాణం
పార్టీలకు అతీతంగా అక్రమ కట్టడాలను తొలగించాం - ఎమ్మెల్యే కందుల 
ఆ సైకోలను వదిలే ప్రసక్తే లేదు.. !
ఈ రూపాయి నోటు ఉంటే రూ.7 లక్షలు మీ సొంతం?
ఎలాంటి రాత పరీక్ష లేకుండా RTC లో 606  కొలువులకు నోటిఫికేషన్‌..
కోతకు తరలిస్తున్న గోవులని అడ్డుకున్న బీజేపీ నేతలు