దేవాలయాల్లో హిందు ఉద్యోగులు మాత్రమే ఉండాలి 

ఆరెస్సెస్ రాష్ట్ర సహ బౌద్ధిక్ ప్రముఖ్ రామకృష్ణ 

On
దేవాలయాల్లో హిందు ఉద్యోగులు మాత్రమే ఉండాలి 

ఒంగోలు: హిందూ దేవాలయాల్లో హిందూ ఉద్యోగులు మాత్రమే పని చేయాలని,ఇతర మతాలకు చెందిన ఉద్యోగులను వెనక్కి పంపించాలి అని ఆరెస్సెస్ రాష్ట్ర సహ బౌద్ధిక్ ప్రముఖ్ కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఒంగోలు ఎకెవికె కళాశాల లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే జనవరి 5 వ తేదీన విజయవాడ లో నిర్వహించనున్న హైందవ శంఖారావం కు పల్లె పల్లె నుంచి హిందువులు కదలి రావాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
 తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం యొక్క పవిత్రత విషయంలో వెలువడిన సమాచారం ప్రపంచ వ్యాప్తంగా హిందువులను దిగ్భ్రాంతికి, ఆందోళనకు, ఆక్రోశానికి గురిచేసిందని అన్నారు. దేవాలయాల నిర్వహణలో హైందవేతరులను నియమించి హిందువుల విశ్వాసాలతో ఆటలాడుకునే ధోరణి అనేక దేవాలయాల నిర్వహణలో కనపడుతోందని,దేవదాయ ధర్మదాయ శాఖ ద్వారా నిర్వహించబడుచున్న ఆలయాలలో హిందువులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన ముడుపులు, కానుకలు దేవాలయ అధికారులు, పాలక మండళ్ళ ద్వారా దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. హిందూ సమాజం స్వతంత్రంగా దేవాలయాలు నిర్వహించుకున్న నాడు హిందువుల ఆలయాలు, ధార్మిక విశ్వాసాలు, పవిత్రత కాపాడబడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల ద్వారా హిందూ దేవాలయాల నిర్వహణ చేయడం అనేది రాజ్యాంగంలోని 12, 25, 26 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే కాకుండా హిందూ విశ్వాసాలపై తీవ్రమైన దాడి అవుతుంది అన్నారు. దేవాలయ నిర్వహణలలోను, ఆస్తుల విషయంలోనూ ప్రభుత్వాలు దూరంగా ఉండాలని గౌరవ న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు కూడా ఇచ్చాయని గుర్తు చేశారు. విదేశీ, విధర్మీయ దురాక్రమణదారులు మరియు పాలకులు హిందూ దేవాలయాలపై దాడులు,దోపిడీలు చేశారని, ఆలయాలను కబ్జాచేసి నిరంతరం లూటీ చేశారని,నేడు కొన్ని రాజకీయ పార్టీలు సెక్యులర్ ముసుగులో హిందూ సాంప్రదాయాలను నాశనం చేయాలనే సంకల్పం చేసుకొని దేవాలయాలను తమ గుప్పెట్లో పెట్టుకొని ఆలయ వ్యవస్థను ఒక పథకం ప్రకారం నాశనం చేస్తున్నాయి అని అన్నారు. దేశం స్వతంత్రాన్ని పొంది 77 సంవత్సరాలు పూర్తి అయినా హిందువులకు మాత్రం తమ దేవాలయాలు తాము నిర్వహించుకునే స్వతంత్రత నేటికీ రాలేదు అని అన్నారు. హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తంచేసి, స్వయంప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్టసవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయోద్యమానికి శ్రీకారం చుట్టిందని, దీనిలో భాగంగా సెప్టెంబర్ 30 వతేదీన దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కలిగిస్తూ చట్టసవరణ చేయాలని కోరుతూ దేశంలోని అన్నిరాష్ట్రాల గవర్నర్లకు మెమొరాండం సమర్పించినట్లు తెలిపారు. హిందువుల మనోభావాలను, సమస్యలను అర్థం చేసుకొని ప్రభుత్వాలు వెంటనే స్పందించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో 2025 జనవరి 5వ తేదీన “హైందవ శంఖారావం" భారీ బహిరంగ సభ నిర్వహించబడుతున్నదని తెలిపారు. హిందూ బంధువులంతా లక్షలాదిగా పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసినదిగ, ఈ ఉద్యమానికి బాసటగా, ఊపిరిగా నిలువవలసినదిగ రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘఛాలక్ రాం ప్రసాద్,నగర సంఘచాలక్ మహేష్,విశ్వ హిందూ పరిషత్ నాయకులు సోమ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Screenshot_2024-10-19-22-17-10-83_c37d74246d9c81aa0bb824b57eaf7062

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

ఆత్మహత్యకు ప్రయత్నించిన అంగన్వాడీ ఆయ  ఆత్మహత్యకు ప్రయత్నించిన అంగన్వాడీ ఆయ 
పెద్దారవీడు:  మండలం లోని బి. చెర్లోపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడి ఆయా శివాంజలి, కార్యకర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.పరిస్థితి విషమంగా ఉండడంతో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు...
చెట్టును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
నేటి పంచాంగం: గురువారం, నవంబరు 14, 2024
నేటి పంచాంగం: బుధవారం, నవంబరు 13, 2024
వెలిగొండపై మళ్ళీ ఆశలు చిగురించాయి : బీజేపీ నేత డాక్టర్ ఏలూరి
డ్రోన్ల తో గంజాయి పై యుద్ధం.... బాబు సక్సెస్
మార్కాపురం లో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలి