పోలవరం ఇంకో వందేళ్లయినా పూర్తి కాదు.

కేంద్ర మాజీ మంత్రి & కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్

On
పోలవరం ఇంకో వందేళ్లయినా పూర్తి కాదు.

అమరావతీ: పోలవరం సంగతులు తెలుసుకునేందుకు నేను హైదరాబాద్ వెళ్లాను. నలుగురు ముఖ్యమంత్రి వద్ద పనిచేసిన ఒక పెద్ద అధికారిని కలిశాను. ఆయన చెప్పుకొచ్చాడు పోలవరం కట్టాలంటే 30 లక్షల మంది గిరిజనులను తరలించాల్సి ఉంటుందన్నారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు కట్టే సామర్థ్యం ఇక్కడి కాంట్రాక్టర్లకు, కంపెనీలకు లేదని, ఒకవేళ కట్టినా అది కూలిపోతుందని ఆ అధికారి నాతో అన్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టగలిగే కంపెనీలు ప్రపంచంలో మూడే ఉన్నాయి. అవి చైనా, అమెరికా, జర్మనీ లో ఉన్నట్లు చెప్పారు. జల యజ్ఞం ధనయజ్ఞంగా మారింది. పోలవరం పొలిటీషియన్లకు వరంగా మారింది.పోలవరం పేరు పెట్టి, కొందరు పెద్దలు దోచుకు తిన్నారు. అమరావతి పూర్తి కాలంటే ఇంకో వందేళ్లు పడుతుంది. అప్పటికీ పూర్తవుతుందన్న నమ్మకం నాకు లేదు.1905 ఢిల్లీ రాజధాని మొదలైతే, ఢిల్లీ ఒక మహానగరంగా తయారు కావడానికి ఇన్నేళ్లు పట్టింది. చంద్రబాబు నాయుడు పొద్దున లేస్తే రాత్రి వరకు అమరావతి, పోలవరం అంటారు. మొన్న లడ్డూ, నిన్న డ్రోన్ ఇలా నెలకో అంశాన్ని తెరమీదకు తెచ్చి, అబద్ధాలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు. 

భారతదేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరపాలి. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న చోట బిజెపి ఈవీఎం ల ట్యాంపరింగ్ చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయింది. కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితి లేదు.14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసి, పెద్ద అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు బిజెపితో ఉన్న పరిచయాలతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టుకోవచ్చు కదా!?
రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది? మాట్లాడితే ఆమె చేసింది! ఆయన వల్ల జరింది అంటుంటారు కొందరు. రాష్ట్ర విభజనకు అసలు సంగతి వేరే ఉంది.
1994లో కాన్సిరాం అనే వ్యక్తి యూపీ తర్వాత ఏపీలో అడుగు పెట్టాడు. ఆ మూల నుంచి ఈ మూల వరకు తిరిగాడు. 
కత్తి పద్మారావు వంటి దళిత నాయకులను ఉత్తేజపరిచాడు.‌ దళితులు ఐక్యం చేశాడు. దళితుల ఐక్యతమనకు మనకు నష్టం చేస్తుందని గ్రహించిన కొందరు నాయకులు దళితులను మాల- మాదిగలుగా విడగొట్టారు. వేరు చేశారు.  నేడు మాల మాదిగలు వీధుల్లోకొచ్చారు. కొట్టుకుంటున్నారు.
"చెడపకురా చెడేవు అన్న చందంగా" ఒక్కటి గా ఉన్న దళితులను మాల - మాదిగలుగా విభజించడం వల్ల రాష్ట్రం రెండు ముక్కలైంది.నిన్న నేను హైదరాబాదులో ఉన్నాను. సెక్రటేరియట్ వెళ్లి చూశాను. నా కళ్ళు చాలలేదు ఆ సెక్రటేరియట్ ని చూసేదానికి. అంత అద్భుతంగా కట్టుకున్నారు. తెలంగాణ మంత్రుల ఛాంబర్లు మహారాజా ప్యాలస్ లాగా వుంది.మన దగ్గర ఐదు షెడ్లు వేసుకున్నారు. ఎవరెక్కడ ఉంటారో ఎవరికీ తెలీదు. 

హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి రెండు ప్రధాన కారణాలు. ఒకటి కాంగ్రెస్ నాయకుల ఓవర్ కాన్ఫిడెన్స్. రెండు ఈవీఎం ట్యాంపరింగ్.

ఎన్నికల ఫలితాలు రాకముందే, హర్యానా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో కూర్చొని, పదవుల పంపకాలుపై మంతనాలు జరిపారు.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవమున్న చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలోని నిరుద్యోగం, టాక్స్ లు తగ్గించడం, ఆకలి, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

ఒంగోలు కమర్షియల్ టాక్స్ ఆఫీస్ లో ఎసిబి దాడులు ఒంగోలు కమర్షియల్ టాక్స్ ఆఫీస్ లో ఎసిబి దాడులు
ఒంగోల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్, కేఎస్ శ్రీనివాస ప్రసాద్,  లక్ష 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు...
వాట్సాప్ లో కలెక్టర్ కు మెసేజ్...గంటల వ్యవధిలో రిజల్ట్ 
ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడి
నేటి పంచాంగం:  బుధవారం, నవంబరు 20, 2024
సినీ నటుడు పోసాని పై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ
నేటి పంచాంగం మంగళవారం, నవంబరు 19, 2024
దోర్నాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి