ఎమ్మెల్యే ల తీరుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
పార్టి క్యాడర్ ని కాపాడుకోవడానికి చంద్రబాబు రోడ్ మ్యాప్
(అగ్ని ప్రతినిధి, అమరావతి) : రాష్రంలో పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తితో పార్టీ క్యాడర్ రగిలిపోతున్నదని టీడీపీ అధిష్టానం గుర్తించింది. అలాంటి నియోజకవర్గాలలో జరుగుతున్న పరిణామాల పై దృష్టి సారించిన టీడీపీ హై కమాండ్ చర్యలకు సిద్దమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సమస్యలు ఉన్న నియోజకవర్గాలలో మండలాల వారీగా పార్టి కోసం కష్టపడిన నాయకులను గుర్తించి త్రీమెన్ కమిటీలు వేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు వినికిడి. పార్టి కోసం ఎవరు కష్టపడ్డారు, పార్టి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆర్ధికంగా అండగా నిలిచారు, ఏ నాయకుడు ఎంతమేర పార్టి కోసం పనిచేశారు అనేది పూర్తి సైంటిఫిక్ డేటా అధినేత తన వద్ద ఉంచుకోని అంతర్గతంగా సమీక్షిస్తున్నారని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెపుతున్న మాట. దీంతో సమస్యలు ఉన్న నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు ఝలక్ తప్పదని విశ్లేషకులు బావిస్తున్నారు. ఏ నాయకుడిని, కార్యకర్తని పార్టికి దూరం కానివ్వడానికి వీలు లేదు అని, ఏ స్ధాయి నాయకుడికి అయినా నష్టం జరగడానికి వీలు లేని విధంగా యాక్షన్ ప్లాన్ సిధ్దం చేస్తున్నట్లు టిడిపి హైకమాండ్ ముఖ్యమైన నేతలతో అన్నట్లు సమాచారం.
2014-2019 మద్య తరహాలో శాసనసభ్యుల మీద పార్టిని వదిలేసి నష్టపోయిన పరిస్ధితి కనపడింది. మరలా అదేవిధంగా వ్యవహరిస్తే కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు చేసే అరాచకాలు, అక్రమ సంపాదన, క్యాడర్ ని నిర్లక్ష్యం చేయడం వంటి చర్యలతో రాబోయే ఎన్నికలలో పార్టి తీవ్రంగా నష్టపోతుంది అని అధిష్టానం బావిస్తుంది.
ముఖ్యంగా పార్టి సెంట్రల్ ఆఫీసుకి కనుక ఎమ్మెల్యే వలన ఇబ్బంది పడుతున్నాం అని గాని, ఏదైనా సమస్య ఎమ్మెల్యే పరిధిలో ఉన్నప్పటికి కూడా పరిష్కరించ లేకపోవడం , కొన్ని చోట్ల కార్యకర్తలు ఆగ్రహాలతో కట్టలు తెంచుకోని రోడ్లపైకి రావడం, మీడియా ముందు వారి ఆవేదన వెలిబుచ్చడం వంటి వాటి గురించి సదరు ఎమ్మెల్యే లపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు మీ నియోజకవర్గాలలో సమన్వయం చేసుకోలేకపోవడం వలనే కదా వారు సెంట్రల్ ఆఫీసు వరకు వచ్చి వేడుకుంటున్నారు, దీని పై సదరు ఎమ్మెల్యే లను ఉద్దేశించి "ఇంత అసమర్ధంగా ఉన్నారా, ఒంటెద్దు పోకడ మంచిది కాదు అని ఆ ఎమ్మెల్యేలపై అధినేత ఆగ్రహిస్తున్నారని పార్టీ వర్గాలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. రాజకీయాలలో భేదాబిప్రాయాలు ఉండటం సహజం, వాటిని చర్చించుకోని సమన్వయం చేసుకోవాలి, అంతే కానీ క్యాడర్ ను గాలికి వదిలేస్తా అంటే పార్టి హైకమాండ్ చూస్తూ ఊరుకోదు అని కొందరు సీనియర్ నేతలకు బాబు చురకలు అందించాడని విశ్వసనీయ వర్గాల భోగట్టా.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.