విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్లు..

ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం

On
విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్లు..

AP: విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఊపిరులూదింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న కర్మాగారాన్ని పునరుజ్జీవింపజేయడానికి ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్యాకేజీకి గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఆర్థిక ప్యాకేజీ తక్షణం అమల్లోకి..

“ఇది భారీ రివైవల్ ప్యాకేజీ. స్టీల్ రంగంలో విశాఖ ఉక్కు ప్రధానమైన సంస్థ. విశాఖ ఉక్కు.. పోర్టు ఆధారిత స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమను ఏళ్ల తరబడి సమస్యలు వేధిస్తున్నాయి. విశాఖ ఉక్కుకు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ తక్షణం అమల్లోకి వస్తుంది. త్వరలో రెండు బ్లాస్ట్ ఫర్నేస్లు ప్రారంభమవుతాయి ఆగస్టు నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు అందుబాటులోకి వస్తాయి. ముడి సరకు సరఫరా కోసం ఎన్ఎండీసీతో చర్చిస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్లో విశాఖ ఉక్కు కీలక పాత్ర పోషిస్తుంది. దేశ ఉక్కు అవసరాలు తీర్చడంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కీలక పాత్ర. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మికులకు శుభాకాంక్షలు” అని అశ్వినీవైష్ణవ్ తెలిపారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టిన రోజు నుంచి విశాఖ ఉక్కుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిలతో సమావేశమై కర్మాగారం పునరుజ్జీవంపై చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇటీవల ప్రధానిని మరోమారు కలిసి విశాఖ ఉక్కుకు అవసరమైన ఆర్థిక సాయం అందించా కోరారు. దీనిపై విభిన్న కోణాల్లో చర్చించిన అనంతరం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటి ఈ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.

నష్టాల నుంచి గట్టెక్కించేందుకు 

ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యమున్న విశాఖ ఉక్కు కర్మాగారం 2023-24లో . 4,848.86 5, 2022-235 5.2,858.74 5 నష్టాన్ని మూటగట్టుకొంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో స్టీల్ ప్లాంట్పై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంటును సందర్శించారు. ప్లాంటు నిలదొక్కుకోవడానికి రూ.18 వేల కోట్లు అవసరమని విశాఖ ఎంపీ శ్రీభరత్, తెదేపా రాష్ట్ర అద్యక్షులు పల్లా శ్రీనివాసరావు, కార్మిక సంఘాల నేతలు ఆయనకు విన్నవించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే కేంద్ర ఉక్కుశాఖ ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద.. జీఎస్టీ చెల్లింపులకు రూ.500 కోట్లు, ముడిసరకుకు సంబంధించి బ్యాంకు అప్పుల చెల్లింపులకు రూ.1,150 కోట్ల చొప్పున రెండు విడతల్లో సాయం చేసింది.

సమగ్ర ప్రణాళికతో ముందుకు..

వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పుల భారం, తగినంత ముడిసరకు లేకపోవడం, కోర్టు ఎటాచ్మెంట్లు, ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ తో విశాఖ ఉక్కు కర్మాగారం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వీటిని తీర్చడంతోపాటు భవిష్యత్తులో తలెత్తే కష్టాల నుంచి తప్పించడానికి ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పార్లమెంటు స్థాయీసంఘానికి చెప్పింది. దానిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది.దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది.

 కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం

విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్యాకేజీపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రివైవల్ ప్యాకేజీ కింద కేంద్రం ₹11,440 కోట్లు కేటాయించిందని మంత్రి వెల్లడించారు. ప్యాకేజీ కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. నష్టాలను అధిగమించేందుకు, ప్లాంట్ పూర్తి ఉత్పాదనతో లాభాల బాట పట్టేందుకు కేంద్ర ప్యాకేజీ దోహద పడుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు.

ఆంధ్రుల కలను తెచ్చిన కేంద్రం - సీఎం చంద్రబాబు

విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయం. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదు. విశాఖ ఉక్కుకు ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్నీ మంచి రోజులే. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు" అని చంద్రబాబు అన్నారు.

లక్షలాది జీవితాలను మార్చే మంచి నిర్ణయం - లోకేశ్

విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడంపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన స్పందిస్తూ.. "ఉక్కు రెక్కల ఆయుధాలతో ఏపీ కొత్త శిఖరాలకు ఎదుగుతుంది. ఇది లక్షలాది జీవితాలను మార్చే మంచి నిర్ణయం. కూటమి ప్రభుత్వంలో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. విశాఖ ఉక్కుకు పూర్వవైభవనం వస్తుంది. విశాఖ ఉక్కును కాపాడుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన కృషిని దగ్గర నుంచి చూశా. లక్షల మందికి ఉపాధి కల్పించే ప్లాంట్ను కాపాడినందుకు ప్రధాని మోదీ, నిర్మ సీతారామన్, కుమారస్వామికి నా కృతఙ్ఞతలు” అని లోకేష్ తెలిపారు.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

టీ స్పాట్ మిత్రమండలి చేసిన పనికి అందరూ ఏమంటున్నారంటే! టీ స్పాట్ మిత్రమండలి చేసిన పనికి అందరూ ఏమంటున్నారంటే!
మార్కాపురం: పట్టణంలోని హిందూ స్మశాన వాటిక చిల్లకంపతో అత్యంత దయనీయంగా మారిపోయింది. మునిసిపల్ పాలకులు, అధికారులు చోద్యం చూస్తున్నారే తప్పా ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా వాటిని తొలగించి,...
లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా 23 న రక్తదాన శిబిరం 
మహా కుంభ మేళా కు వెళుతున్నారా ? అయితే ఇది మీ కోసమే..!
నేటి పంచాంగం: బుధవారం, జనవరి 22, 2025
బాపట్ల జిల్లా కలెక్టర్ ఫోన్ హ్యాక్
ఎపి పాలిటిక్స్ లో తుఫాన్ రేపుతున్న లోకేష్ డిప్యూటీ సీఎం వ్యవహారం?
ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరికీ పింఛన్లు కట్!