తర్లుపాడు లో ఉన్న మానవతావాదులారా కలిసిరండి
సామాజిక కార్యకర్త కశ్శెట్టి జగన్ బాబు పిలుపు
తర్లుపాడు ( ప్రకాశం జిల్లా): అన్ని జన్మలలో మానవ జన్మ గొప్పది అంటారు. అయితే మరణించిన అనంతరం దహన సంస్కారాలు చేసుకునే హిందూ స్మశాన వాటిక తర్లుపాడులో చాలా ఘోరంగా ఉంది. అది గమనించిన తర్లుపాడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కశ్శెట్టి జగన్ బాబు, మిగతా ఆర్యవైశ్య సభ్యుల సహకారంతో 75 శాతం అభివృద్ధి పనులు పూర్తి చేశారు. మిగతా పనులు పూర్తి చేయడానికి గ్రామంలోని హిందువులంతా సహకరించ వలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.ఇది అందరికీ ఉపయోగపడే కార్యక్రమం ప్రతి ఇంటి నుంచి మీకు తోచిన సహాయం చేస్తే దాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం. మీరు లక్షలు ఇవ్వవలసిన అవసరం లేదు. ప్రతి కుటుంబం నుంచి 500 లేదా1000 రూపాయలు ఇచ్చినా కూడా సరిపోతుంది. మనము ఎన్నో దానధర్మాలు చేస్తుంటాము ఇలాంటి పుణ్య కార్యక్రమాలకు మీ వంతు సహకారం అందించవలసిన గా కోరుతున్నాం. ఇప్పటివరకు మేము చేసిన అభివృద్ధి పనులు మీకు తెలియజేస్తున్నాము.
1) నీటి సౌకర్యం కొరకు బోర్ వేయించడం జరిగింది.
2) గుంతలు పూడ్చడానికి 130 ట్రాక్టర్లు మట్టితో చదును చేయడం జరిగింది
3) అడవిని తలపించే పిచ్చి చెట్లను తొలగించడం జరిగింది
4) దహన సంస్కారాలు చేయడానికి బర్నింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది.
5) శరీరం కాల్చిన తర్వాత వచ్చే బూడిదను , అస్థికలను భద్రపరచడానికి ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది.
6) కర్మకాండలు చేసుకోవడానికి ఒక పంచ ఏర్పాటు చేయడం జరిగింది.
7) తదనంతరం స్నానాలు చేయడానికి ఒక బాత్రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది.
8) శవాన్ని మోయడానికి ఇబ్బంది పడే వాళ్లకు ఒక ఐరన్ బండిని తయారు చేయించడం జరిగింది.
9) ఆ ఇనుప బండిని భద్రపరచడానికి ఇంకొక రూమ్ ఏర్పాటు చేశాము
10)స్మశాన వాటిక రక్షణకు గేట్ తయారు చేయించడం జరిగింది.
ఇంకా చేయవలసిన పనులు
1)బర్నింగ్ ప్లేస్ లో వర్షం పడ్డప్పుడు ఇబ్బంది లేకుండా రేకులు వేయించాలి.
2) బిల్డింగ్ కి ప్లాస్టింగ్ మరియు కరెంటు పనులు మరియు షెటర్లు బిగించాలి.
3) తయారుచేసిన గేటుకు రెండువైపుల పిల్లర్లు వేయాలి.
4) లోపలికి వెళ్లే రహదారిని శుభ్రం చేసి గేటును అమర్చాలి.
ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ప్రభుత్వం చేస్తాదని అనుకోకూడదు. కొన్ని సందర్భాల్లో అది కుదరకపోవచ్చు. కనుక గ్రామస్తులంతా కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి సహకరించ వలసిందిగా కోరుతున్నామని ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్త కశ్శెట్టి జగన్ బాబు కోరుతున్నారు.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.