శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని రహస్య, విశిష్ట, మహిమాన్వితమైన శివాలయాలు..
🔸 మహానంది శివలింగం అడుగునుండి వచ్చే నీటితో కొన్ని వందల ఎకరాలు పంటభూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది. ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది..
🔸 ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య ) కె.అగ్రహారంలోని కాశివిశ్వేశ్వర దేవాలయంలోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు..
🔸 ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గ రామేశ్వరాలయం.
ఈ ఆలయంలో శివలింగం నుండి నీరు ఊరుతూ ఉంటుంది..
🔸 కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరము దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణం వైపు తిరుగుతుంది. ఇది వండర్..
🔸 అలంపూర్ బాల బ్రహ్మేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి, కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు..
🔸 వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి, ఇక్కడ సంగీత స్తంభాలు గలవు. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది..
🔸 ద్రాక్షారామం ఈ శివలింగం పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి..
🔸 భీమవరంలో సోమేశ్వరుడు, ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా, పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు..
🔸 కోటప్పకొండ ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి, ఇక్కడికి కాకులు అసలు రావు..
🔸 గుంటూరు జిల్లా చేజర్ల ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి. లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే శవంకుళ్లిన వాసన వస్తుంది. ఉత్తరభాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు..
🔸 బైరవకొన ఇక్కడ కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు..
🔸 యాగంటి ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు..
🔸 శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక గోడకు చెవి ఆనించి వింటే, ఒకప్పుడు "జుం" అని తుమ్మెద శబ్దం వినపడేదట..
🔸 కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది. 6 నెలలు ఈ దేవలయం నీటిలో మునిగి ఉంటుంది. 6 నెలలు బయటకు కనిపిస్తుంది..
🔸 శ్రీకాళహస్తిలో పంచ భూతాలలో ఒకటైన వాయులింగేశ్వర రూపములో శివలింగం ఉంటుంది. ఇక్కడ స్వామి వారికి కుడివైపున (మనకు ఎడమ వైపున) రెండు జ్యోతులతో దీపం వెలుగుతూ ఉంటుంది. స్వామి వారి వాయు తత్వాన్ని నిరూపిస్తూ ఎల్లప్పుడూ దీపం కదులుతూ ఉంటుంది..
🔸 అమరనాథ్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచుతో శివలింగం ఏర్పడుతుంది..
🔸 కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యి వుంచితే వెన్న అవుతుంది. ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది. మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు..
🔸 మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది..
🔸 కంచి ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు..
🔸 తమిళ నాడు తిరు నాగేశ్వరము ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి..
🔸 చైనాలో కిన్నెర కైలాసము ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం తెలుపుగా, రాత్రి నీలంగా మారుతాడు..
నమః పార్వతీ పతయే నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.