20 సూత్రాల పథకం కమిటీ చైర్మన్ లంకా దినకర్ ను కలిసిన శాసనాల
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ లోని ఆయన నివాసంలో దినకర్ ను, రాష్ట్ర టిడిపి పరిశీలకులు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనాల మాట్లాడుతూ తనకు చిరకాల మిత్రులు లంకా దినకర్ కి కీలకమైన నామినేటెడ్ పదవి రావడం హర్షణీయమని అన్నారు.ప్రకాశం జిల్లాలో నాడు టిడిపి ఆవిర్భావ సమయంలో దినకర్ తండ్రి బోస్ పోషించిన పాత్ర కీలకమని గుర్తు చేశారు.దినకర్ కుటుంబ సభ్యులతో గత నాలుగు దశాబ్దాలకు పైగా నాకు సంబంధాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.