మోడు బారిన రాళ్లపాడు ప్రాజెక్టు
ప్రకాశం/నెల్లూరు : జిల్లా లో చారిత్రాత్మకమైన సాగు త్రాగునీటి ప్రాజెక్టులు కంభం, మోపాడు, గండిపాలెం, రాళ్లపాడు. అందులో కందుకూరు నియోజకవర్గం లోని లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు చరిత్ర అమోఘం. స్వర్గీయ సోమరాజు పల్లి సుందర రామిరెడ్డి,స్వర్గీయ బెజవాడ గోపాల్ రెడ్డి చేత 1956 సంవత్సరము లో లింగసముద్రం మండలం రాళ్లపాడు వద్ద రాళ్లపాడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1958 సంవత్సరం రెండేళ్ల పాటు ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందించారు. 1956 సంవత్సరం ముందు గుడ్లూరు మండలం లింగసముద్రం మండలం పరిధిలోని రాళ్లపాడు ప్రాజెక్టు కుడి, ఎడమ కాలవ కింద మెట్ట ఫైర్లు రైతులు సాగు చేస్తూ ఉన్నారు. మెట్టపైర్లు సాగు చేసే భూములతో పాటు బీడు భూములు కూడా మాగాణి భూములుగా మారి రైతులు వరి పంటలు పండించారు. లింగ సముద్రం,గుడ్లూరు మండలాలలోని వివిధ గ్రామాలలో ఉన్న భూములు పచ్చని పైర్లతో కనిపించాయి. 1956 సంవత్సరం నుండి 1992- 93 సంవత్సరం వరకు రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు వరి పంటలు పండించారు. ఆయా గ్రామాలలోని రైతుల లోగిళ్లలో ధాన్యం రాశుల తో నిండి ఉండేవి. రాళ్లపాడు రిజర్వాయర్ ఆయకట్టు కింద రైతులు అధిక శాతం వరి పంటలు సాగు చేసి దాదాపు వెయ్యి లారీల ధాన్యాన్ని వ్యాపారులకు విక్రయించేవారు. 1994 - 96 సంవత్సరము లో భారీ వర్షాలకు రాళ్లపాడు ప్రాజెక్టు కట్టకు గండ్లు పడి నీటి ప్రవాహానికి రాళ్లపాడు ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వ కింద ఉన్న గ్రామాలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పాలయ్యారు. అప్పటిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో యుద్ధ ప్రతిపాదన ప్రాజెక్టు పనులు పూర్తిచేసి రైతుల భూములకు సాగునీరు అందించేందుకు ప్రయత్నం చేసింది. అయితే మళ్లీ రాళ్లపాడు రిజర్వాయర్ కరకట్టకు గండ్లు పడి సాగునీరు అంతా సముద్రం పాలు అయింది. రాళ్లపాడు ప్రాజెక్టు కుడి ఎడమ కాలువ ఆయకట్టు కింద ఉన్న పొలాలు ఇసుక మేటలు వేయడంతో ఏడాది రైతులు తమ పొలాలలో వరి పంటలు సాగు చేయలేదు. అప్పట్లో రాళ్లపాడు రిజర్వాయర్ లో చేప పిల్లలను వేసి పెంపకం చేపట్టారని అవి పెద్దవి అయి ఉండడంతో రిజర్వాయరు గేట్లు ఎత్తితే చేపలు పోతాయనే భావనతో ప్రాజెక్టు గేట్లు ఎత్తకపోవడంతో కరకట్టపై వరద నీరు ప్రవహించి వివిధ గ్రామాలలోని ప్రజలు పక్కా భవనాలు ఎక్కి అరచేతిలో ప్రాణాలు పట్టుకొని బయటపడ్డారు. అప్పటిలో ప్రజలకు, రైతులకు అపార నష్టం వాటిల్లింది. అప్పటిలో ప్రజా ప్రతినిధి అపవాదు పాలయ్యారు. జర్మనీ, నాబార్డు తో పాటు ఉపాధి హామీ పథకం కోట్లాది రూపాయల నిధులతో రాళ్లపాడు గేట్లు, కుడి ఎడమ కాలవలకు మరమ్మత్తులు చేయించారు. అయినా కుడి కాలవ కింద ఉన్న ఆయకట్టు భూములకు సాగునీరు అందేది కాదు. అందువలన ఎడమ కాలవ కింద ఆయకట్టు రైతులు బోరుబావుల కింద తమ పొలాలలో వరి పంటలు పండించేవారు. 2022- 23 సంవత్సరాల లో రాళ్లపాడు రిజర్వాయర్ ఆయకట్టు కింద ఉన్న రైతులు వరి పంటలు వేయకుండా క్రాఫ్ట్ హాలిడే ప్రకటించారు. ఈ రెండు సంవత్సరాలు రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న రైతులు తమ పొలాలలో తెల్ల బంగారం పత్తి పంటలు పండించారు. ఒక ఏడాది తెల్ల బంగారానికి గిట్టుబాటు ధర ఉంటే మరో ఏడాది కనీస ధర లేక రైతులు అప్పులు పాలు అయినారు. ప్రస్తుతం ఏడాది ఖరీఫ్ సాగు దాటుతున్న కందుకూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఒక ఒక మోస్తర వర్షాలు పడుతుండడంతో ప్రాజెక్టులో కి వర్షపు నీరు రాక అరకొర నీరు నిలవ ఉండడంతో రాళ్లపాడు రిజర్వాయర్ మోడు భారీ కనిపిస్తుంది. కోట్లాది రూపాయలు రాళ్లపాడు ప్రాజెక్టుకు గేట్ల నిర్మాణానికి మరియు కాలువ మరమ్మతులకు ఖర్చు చేసిన రైతులకు సాగునీరు అందించక పోవడంతో రైతులు ఇతర పంటల పై దృష్టి పెట్టారు. అంతే కాకుండా రాళ్లపాడు ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఉన్న పిల్లా పేరు నదిపై గండిపాలెం వద్ద రిజర్వాలను నిర్మించడంతో దిగువ ప్రాంతం లో ఉన్న రాళ్లపాడు ప్రాజెక్టుకు వర్షపు నీరు ప్రవహించడం లేదు. ఇది ఇలా ఉండగా పిల్లయేరు నదిపై, మన్నేరు నదిపై దాదాపు అక్కడక్కడ చెక్ డ్యాములు నిర్మించడంతో వర్షపు నీరు అందులోకి ప్రవహించడంతో రాళ్లపాడు ప్రాజెక్టు లోకి వర్షపు నీరు ప్రవహించడం లేదు. రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు కమిటీ చైర్మన్ సీతారామపురం గ్రామానికి చెందిన స్వర్గీయ నరసింహారావు, ఇతరులు చైర్మన్ గా ఉన్నప్పుడు రాళ్లపాడు రిజర్వాయర్ ఆలన పాలన పట్టించుకోక పోవడంతో ప్రస్తుతం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాళ్లపాడు వద్ద అధికారులకు,సిబ్బందికి బంగ్లా లు ఇతర భవనాలు నిర్మించినప్పటికీ అక్కడ నివాసాలు ఉండకుండా పట్టణాలకి పరిమితమై విధులు నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో బంగ్లాలు శిధిల అవస్థకు చేరుకొని పాడుబడి ఉన్నాయి. ఇది ఇలా ఉండగా స్వర్గీయ ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే హయాంలో గండిపాలెం రిజర్వాయర్ లోని నాలుగు అడుగుల నీరు రాళ్లపాడు ప్రాజెక్టుకు వచ్చే విధముగా ఏర్పాటు చేశారు. ఇటీవల సోమశిల రిజర్వాయర్ నుండి రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు విడుదల అవుతుంది. అయితే సోమశిల రిజర్వాయర్ నుండి విడుదలయ్యే సాగునీరు డైరెక్టుగా రాళ్లపాడు ప్రాజెక్టులోకి నీరు వేరే పరిస్థితి లేకపోవడంతో ప్రాజెక్టు లో అరకొరగా సాగునీరు ఉంది. రాళ్లపాడు ప్రాజెక్టు నుండి రోళ్ళపాడు,గుడ్లూరు మండలాలకు తాగునీరు అరకొరగా సరఫరా అవుతుంది. ఇది ఇలా ఉండగా కృష్ణారెడ్డి సప్లై ఛానల్ కాలవ మరమ్మతులకు మాచవరం అత్తా కోడలు చెరువులకు మరమ్మతులకు దాదాపు మూడు కోట్లు నిధులు గతంలో విడుదల చేశారు. ఆ నిధులతో కాలవ మరమ్మతులు జంగిల్ పనులు మోపాడు అత్తా కోడలు చెరువులకు మరమ్మతులు చేసి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం కృష్ణారెడ్డి సప్లై ఛానల్ కాలవ లో చిల్ల చెట్లు భారీ స్థాయిలో ఉండడంతో కాలువ రూప రేఖలు మారిపోయాయి. కృష్ణారెడ్డి సప్లై ఛానల్ కాలవ నుండి గుడ్లూరు మండలం కొత్తపేట పంట చెరువుకు బద్దిపూడి . భీమవరం చెరువులకు నీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం రెడ్డి కాలవ లోని జంగిల్ పనులు పూడిక పనులు చేపట్టక పోవడంతో వర్షపు నీరు చెరువులకు చేరడం లేదని ఆయా గ్రామాల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం లో రాళ్లపాడు ప్రాజెక్టు కాలువ మరమ్మతులు పనులను ఉపాధి హామీ పథకం పనులతో చేయించాలని ఆయా గ్రామాల రైతులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. అలాగే రాళ్లపాడు ప్రాజెక్టు పరిరక్షణ కమిటీ సభ్యులు చైర్మన్ జోక్యం చేసుకొని రాళ్లపాడు రిజర్వాయర్ అభివృద్ధికి కృషి చేస్తారని రాళ్లపాడు రిజర్వాయర్ ఆయకట్టు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.