పంచాయతీ రాజ్ లో లంచాల పంచాయతీ

ఇరకాటంలో యువ ఐఎఎస్ అధికారి

On
పంచాయతీ రాజ్ లో లంచాల పంచాయతీ

(అగ్ని ప్రతినిధి: అమరావతి)

ప్రభుత్వం మారింది. పాలకులు మారారు. అధికారులను మారుస్తున్నారు. అయితే కొందరు అధికారులు కొన్ని శాఖలు తమ జాగిర్దారు లాగా భావిస్తూ తిష్ట వేశారు. ప్రక్షాళనకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చేతివాటం చూపిస్తున్నారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో అవినీతి అడ్డగోలుగా సాగుతుంది. ఏరి కోరి తెచ్చుకున్న కృష్ణ తేజ ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.  పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్ లో అవినీతి అనకొండలు కుర్చీని వదలక పోవడం గమనించాల్సిన విషయం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ గా యువ ఐఏఎస్ ను కేరళ నుంచి డిప్యూటేషన్ పై నియమించినా.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో అధికారులు, కొంత మంది సిబ్బంది ఫైళ్లు సక్రమంగా ముందుకు కదలకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.డైరక్టర్ కృష్ణతేజ ఫైల్ ప్రాసెస్ వేగవంతం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎప్పటి నుంచో తిష్ఠ వేసిన అధికారులు ససేమిరా అంటున్నారు. ఓ వైపు బదిలీల ప్రక్రియ ఈ నెల 22తో ముగియాల్సి ఉంది. అయితే ఆ కసరత్తు పూర్తి చేసేందుకు కమిషనరేట్ కార్యాల యంలో అధికారులు, సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. బదిలీలు ఫైళ్లను ప్రాసెస్ చేయించుకోవడం కోసం వచ్చిన అధికారుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నారని సమాచారం. సచివాలయం సెక్షన్ అధికారులతో సంబంధాలు పెట్టుకున్న కమిషనరేట్ సిబ్బంది అవసరమైతే వారి చేతులు తడపని వారి ఫైల్ ను సచివాలయంలో లాక్ చేసి లంచాలు భారీగా గుంజుకుంటున్నారని వినికిడి. ఇటీవల ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో ఓ అధికారి డ్వామా పీడీ పోస్టు కోసం ఆ జిల్లా మంత్రులతో సిఫారసు చేయించుకున్నారు. వి షయం తెలుసుకున్న పీఆర్ కమిషనరేట్లోని సిబ్బంది ఆ అధికారికి, డిప్యూటీ కమిషనర్ ని అంటూ ఫోన్ చేసి రూ.1.50 లక్షలు డిమాండ్ చేశారు. అయితే ఆ అధికారి అంత మొత్తంలో తాను చెల్లించలేనంటూ మొత్తుకున్నారు. అయినా వదలని ఆ అవినీతి జలగలు ముందుగా రూ.25 వేలు ఇవ్వాలంటూ ఖాతాలో వేయించుకున్నారు. ఆ తర్వాత ఆ అధికారి ఫోన్ చేసిన వ్యక్తి డిప్యూటీ కమిషనర్ కాదని తెలుసుకుని గట్టిగా మాట్లాడటంతో డబ్బులు వెనక్కి పంపినట్లు సమాచారం. ఇదే పరిస్థితి ఇంకో అధికారికి కూడా ఎదురయిందని తెలిసింది. పీఆర్ సిబ్బంది వసూళ్లలో ఆరితేరి ఉంటే గ్రామీణాభివృద్ధి శాఖలో ఎస్టాబ్లిష్మెంట్ అధికా రులు, సిబ్బంది పరిస్థితి మరో రకంగా ఉంది. కమిషనరేట్లో తిష్ఠ వేసిన అధికారులు ఫైల్ ప్రాసెస్ విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎన్నిసార్లు బతిమిలాడుకున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడంతో కార్యా లయం చుట్టూ తిరగలేక అధికారులు, సిబ్బంది సతమతమవుతున్నారు. ఇటీవల నెల్లూరు డ్వామా పీడీ కార్యాలయంలో ఏపీడీగా ఉన్న ఓ అధి కారి ఆ పోస్టు నుంచి రీపాట్రియేట్ అయ్యేందుకు 20 రోజులకు ముందు దరఖాస్తు చేసుకున్నారు. దానిని ప్రాసెస్ చేసేందుకు ఆ అధికారి కాళ్లరి గేలా తిరిగినా మోక్షం లభించలేదు. ఈ వ్యవహారంపై కమిషనరు ఫిర్యాదు చేయడంతో ఆయన మండిపడినట్లు తెలుస్తోంది. కొత్త కవి షనరు ఇవన్నీ తలనొప్పిగా మారాయి. ఈ పరిస్థితి నుంచి బయటప డేందుకు ఈ నెల 22 నుంచి కమిషనరేట్లో అధికారులను, సిబ్బందికి స్థానం చలనం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

తిరుమల శ్రీవారి ని దర్శించుకున్న సిఎస్ఓ యశ్వంత్  తిరుమల శ్రీవారి ని దర్శించుకున్న సిఎస్ఓ యశ్వంత్ 
తిరుమల: సిఎం చంద్రబాబు నాయుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సియస్ఓ) తంగిరాల యశ్వంత్ శుక్రవారం శ్రీవారి ని దర్శించుకున్నారు. యశ్వంత్,తన తల్లిదండ్రులు టియన్ జగన్నాథ్, శార్వాణి లతో...
శ్రీశైలం మల్లన్న దారిలో మనసు దోచే భారీ నిర్మాణం
పార్టీలకు అతీతంగా అక్రమ కట్టడాలను తొలగించాం - ఎమ్మెల్యే కందుల 
ఆ సైకోలను వదిలే ప్రసక్తే లేదు.. !
ఈ రూపాయి నోటు ఉంటే రూ.7 లక్షలు మీ సొంతం?
ఎలాంటి రాత పరీక్ష లేకుండా RTC లో 606  కొలువులకు నోటిఫికేషన్‌..
కోతకు తరలిస్తున్న గోవులని అడ్డుకున్న బీజేపీ నేతలు