గ్రామీణ ప్రాంతాల్లో తాము చేసిన సేవలకు విలువ లేకుండా పోయింది - డాక్టర్ రాహుల్

జీ.వో. 85కి వ్యతిరేకంగా ప్రభుత్వ పిహెచ్సి వైద్యులు దశల వారీ ఆందోళన

On
గ్రామీణ ప్రాంతాల్లో తాము చేసిన సేవలకు విలువ లేకుండా పోయింది - డాక్టర్ రాహుల్

మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, జీ.ఓ 85కి వ్యతిరేకంగా తమ ఆందోళనను, నిరసనను వ్యక్తం చేస్తూ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి బుధవారం విధులు నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాహుల్, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఖాదర్ మస్తాన్ బీలు మాట్లాడుతూ జీ.ఓ.నం. 85 ద్వారా, గిరిజన ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో తాము అందించిన సర్వీసుకు విలువ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అకస్మాత్తుగా జీవోను మార్చి సర్వీస్ కోటాను 30% నుండి 15% తగ్గించడం అన్యాయం అని, తమ వృత్తి ప్రగతికి ఇది తీవ్రంగా విఘాతం కలుగజేస్తోందని అన్నారు. కోవిడ్ -19 సమయంలో తమ జీవితాలను, తమ కుటుంబ సభ్యుల జీవితాలను ప్రమాదంలో, పణంగా పెట్టి సేవలు అందించినప్పటికీ, ఇప్పుడు జీ.ఓ. 85 ద్వారా పీజీ అవకాశాలు తగ్గించడం అన్యాయమని, ఇది ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని నిరుపేద ప్రజలకు నష్టం అని వారు అన్నారు.

Screenshot_2024-04-05-18-53-43-27_99c04817c0de5652397fc8b56c3b3817

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News