ఖాళీ కుర్చీలతో దర్శనం ఇస్తున్న నాగెళ్లముడుపు సచివాలయం

సచివాలయం ను సందర్శించిన ఈపిఓఆర్డీ టి సుకుమార్ 

On
ఖాళీ కుర్చీలతో దర్శనం ఇస్తున్న నాగెళ్లముడుపు సచివాలయం

     ఉన్నతాధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో సచివాలయ ఉద్యోగులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. సమయపాలన పాటించకుండా మొక్కుబడిగా ఉద్యోగాలు వెలగబెడుతున్నారు. దీంతో చిన్న చిన్న పనులకు సచివాలయం కు వెళ్లే ప్రజలకు నిరాశ ఎదురవుతుంది. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని జనం వాపోతున్నారు.  ఈ పి ఓ ఆర్ డి తనిఖీలు చేయగా మండలంలోని నాగెళ్ళ ముడుపు సచివాలయం బోసిపోతు కనిపించింది. ఉద్యోగులు సకాలంలో కార్యాలయానికి రాకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు సరిగా నిర్వహించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

అగ్ని న్యూస్,తర్లుపాడు : మండలంలోని నాగెళ్ల ముడుపు గ్రామంలో గ్రామ సచివాలయ సిబ్బంది సమయ పాలనకు తగ్గట్లుగా విధులకు హాజరుకాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా నాగెళ్లముడుపు పంచాయితీ లో ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థను సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నీరు కారుస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నాగెళ్ళముడిపి సచివాలయంలో మంగళవారం ఉదయం 11 గంటల సమయం అయినప్పటికీ  ఉద్యోగులు ఒకరు కూడా హాజరు కాలేదు. ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ఏమి మాట్లాడలేక వెనుతిరిగి వెళ్ళారు ఈ విషయం తర్లుపాడు మండల ఈపిఓఆర్డీ ఆకస్మిక తనిఖీ లో సచివాలయ సిబ్బంది వేలకు రావట్లేదని తెలిసింది ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి నిర్లక్ష్యం వహిస్తున్న సచివాలయ సిబ్బంది పై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు 

సచివాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన ఈపిఓఆర్డీ టి సుకుమార్

సచివాలయ సందర్శనలో భాగంగా నాగెళ్ళముడుపు సచివాలయం ను సందర్శించగా ఈవో ఆర్ డి సుకుమార్ అక్కడ ఉద్యోగులు ఎవరు లేకపోవడంతో కంగుతిన్నారు. వెంటనే సంబంధిత పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి వివరణ అడిగారు. కొందరు సెలవుల్లో ఉన్నారని మరికొందరు ఏవో పనుల నిమిత్తం వెళ్లారని సమాధానం ఇచ్చారు. దీంతో ఈఓఆర్డి  ఇంజనీరింగ్ అసిస్టెంట్ కు ఫోన్ చేసి సచివాలయం కి ఎందుకు రాలేదని మూమెంట్ రిజిస్టర్ లో రాయకుండా ఏ విధంగా వెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.సిబ్బంది అందరికి  విధులకు ఎందుకు హాజరవలేదో వివరణ ఇవ్వాలని తెలిపారు.

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

ఊపిరి ఉన్నంత వరకు వైకాపా లోనే:మాజీ మంత్రి ఎ. సురేష్ ఊపిరి ఉన్నంత వరకు వైకాపా లోనే:మాజీ మంత్రి ఎ. సురేష్
ఒంగోలు: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల తప్పుడు ప్రచారం ఎవరు నమ్మవద్దని, తన తుది శ్వాస వరకు వైఎస్ జగన్ వెంటే ఉంటానని రాష్ట్ర మాజీమంత్రి...
తాగు నీటి సమస్య రాకుండా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి: కలెక్టర్ అన్సారియా
నాగబాబుకు బ్రేక్...! మంత్రి పదవికి నో చెప్పిన చంద్రబాబు.. డిఫెన్స్‌లో పవన్..?
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ జెఈఓ గా సిఎస్ఆర్ మూర్తి 
గిద్దలూరు రైల్వే స్టేషన్ ముందు బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి 
తల్లికి వందనం' పథకంపై కీలక ప్రకటన
పొదిలి లో దొంగల హల్చల్