'పవర్' కు కేరాఫ్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అంతా పవన్ నామస్మరణ జరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ఇప్పుడు ప్రతిపక్ష నేతలు సైతం పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. ఇక విజయసాయిరెడ్డి లాంటి నేతలైతే పవన్ ను సీఎం కుర్చీలో చూడాలనుంది అంటూ కామెంట్ చేశారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు వరకు పవన్ పై ఒంటికాలిపై దూకిన నేతలు... ఇప్పుడు జయహో పవన్ అనటం విడ్డూరంగా కనిపిస్తుంది.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు... శాశ్వత శత్రువులు ఉండరు అనేది జగమెరిగిన సత్యం. నిన్నటి వరకు కలిసిమెలిసి తిరిగిన నేతలు రాత్రికి రాత్రే బద్ధశత్రువులైపోతారు. అలాగే బూతులు తిట్టుకున్న నేతలు... చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తారు. ఏపీలో ప్రస్తుతం ఇదే సీన్ కనిపిస్తోంది. ఎన్నికల ముందు వరకు పవన్ ను నానా మాటలన్న వైసీపీ నేతలు ఇప్పుడు మాత్రం ఏకంగా సీఎం పదవిలో చూడాలని ఉందంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేయటం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని... భార్యలను మారుస్తాడని... ముఖానికి రంగులేసుకుంటాడని... పూనకం వచ్చినట్టు ఊగిపోతాడంటూ కామెంట్లు చేసిన విజయసాయిరెడ్డి... ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ సీఎం కుర్చీలో కూర్చుంటే బాగుంటుందంటూ సోషల్ మీడియాలో పోటీ చేశారు. ఈ పోస్ట్ వెనుక పెద్ద గేమ్ ప్లాన్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పవన్ పై విమర్శలు చేశారు. కానీ ఎన్నికల ముందు మాత్రం పవన్ సీఎం అయితే బాగుంటుందని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి. అప్పట్లోనే బాలినేని జనసేనలో చేరతారనే ప్రచారం జోరుగా జరిగింది. సీన్ కట్ చేస్తే... ఎన్నికల తర్వాత బాలినేని జనసేనలో చేరారు.
ఇక చీరాల టికెట్ ఆశించి భంగపడిన ఆమంచి కృష్ణమోహన్ కూడా ఎన్నికల ముందు జనసేనలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఇప్పుడు ఆమంచి కూడా పవన్ సీఎం అయితే బాగుంటుందని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఓటింగ్ శాతం సింగిల్ డిజిట్ దాటడం ఇప్పట్లో చాలా కష్టం. అందుకే ఆమంచి కూడా తన రాజకీయ భవిష్యత్ కోసం జనసేనలో చేరేందుకు ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
అయితే విజయసాయిరెడ్డి పోస్ట్ మాత్రం కూటమిలో విబేధాలు సృష్టించేందుకు అని టీడీపీ, జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య విబేధాలు రావాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని... కానీ అది అసాధ్యమంటున్నారు. చంద్రబాబు సీఎం అని పవన్ స్వయంగా చెప్పిన మాటలను కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.