పశువుల బీడు ను ఆక్రమణదారుల నుండి కాపాడండి 

- తహసీల్దార్ కి గ్రామస్థుల వినతి

On
పశువుల బీడు ను ఆక్రమణదారుల నుండి కాపాడండి 

అగ్ని న్యూస్,తర్లుపాడు : మండలం లోని కారుమాను పల్లి గ్రామ ఇలాకాలో గల సర్వే నంబర్ 72 లో గల 122 ఎకరాల పశువుల బీడు అయిన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకొని, ప్రభుత్వ భూమి గా బోర్డు పెట్టాలని తహసీల్దార్ యు విజయ భాస్కర్ కి కాకుమాను పల్లె  ప్రజలు వినతి పత్రం అందజేశారు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి పశువుల బీడు ను కాజేయాలని అక్రమణదారులు కన్నేశారని తెలిపారు. పశువుల బీడు పై గ్రామం లో ప్రజలు, పశు సంపద పై ఆధారపడి జీవించే వారు ఎక్కువ గా ఉన్నారని చెప్పారు. పశువుల బీడు అన్యాక్రాంతం అయితే పశువులకు మేతకు ఇబ్బంది పడి, పశు సంపద పై జీవించే వారి జీవనానికి ప్రమాదం ఉందని అన్నారు.  4 సంవత్సరాల క్రితం ఈ పశువుల బీడు పై వివాదం తలెత్తింది అని తహసీల్దార్ గ్రామంలో, గ్రామస్తుల సమక్షంలో ఈ బీడు పశువుల బీడు అని ఎవరికి చెందినది కాదు అని సదరు భూమిని గ్రామస్తులు ఎవరైనా పశువుల ను మేపుకునేందుకు ఉపయోగించు కోవచ్చని తెలిపారు అని వివరించారు. స్పందించిన తహసీల్దార్ విజయభాస్కర్, వి ఆర్ ఓ కి ఆదేశాలు ఇచ్చి ఈ సమస్యపై సత్వరమే స్పందించి సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమి అయితే బోర్డు పెట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో కారుమానుపల్లి గ్రామ రైతులు దొండపాటి వెంగల్ రెడ్డి,గాయం శ్రీనివాసరెడ్డి, డి వెంకటేశ్వర రెడ్డి, మూర్తయ్య,వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Screenshot_2024-02-14-16-53-36-22_99c04817c0de5652397fc8b56c3b3817

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Related Posts

Advertisement

Latest News

పెద్దిరెడ్డికి షాక్ ? జనసేన పార్టీకే పీఏసీ చైర్మన్ !! పెద్దిరెడ్డికి షాక్ ? జనసేన పార్టీకే పీఏసీ చైర్మన్ !!
పిఏసీ ఛైర్మన్ ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షానికి దక్కే పీఏసీ ఛైర్మన్ పదవి ఈ సారి కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు దక్కనుంది. వైసీపీకి...
ఆ ఇద్దరు ప్రముఖుల నడుమ దుమ్ము రేపుతున్న ట్వీట్లు!
గ్యాస్ట్రిక్ సమస్య ... ఎసిడిటీ తో విసిగిపోతున్నారా?
శాసనసభ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కు భాష్యం ప్రవీణ్ ఆత్మీయ సన్మానం
హిందూ ధర్మమే శ్రేష్టమైనది - ఆరెస్సెస్ నేత యుగంధర్
పశువుల బీడు ను ఆక్రమణదారుల నుండి కాపాడండి 
మాజీ సీఎం జగన్ పై మంత్రి గొట్టిపాటి సెటైర్లు