మాజీ సీఎం జగన్ పై మంత్రి గొట్టిపాటి సెటైర్లు
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సెటైర్స్ వేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ అబద్ధాలను అందంగా అల్లటంలో వైకాపా అధినేత జగన్ ఆరితేరారని దుయ్యబట్టారు. విద్యుత్ రంగం గురించి జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఆయనకు ట్రూప్ అప్ ఛార్జీల గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు.
రూ.18 వేల కోట్ల భారం ప్రజల మీద మోపారని జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. రూ.20 వేల కోట్ల ట్రూ అప్ ఛార్జీలను ప్రజలపై మోపాలని ఈఆర్సీకి ప్రతిపాదన పంపింది వైకాపా ప్రభుత్వమేనని మంత్రి తెలిపారు. జగన్ చేసిన పాపాలే.. ప్రజలను శాపాలుగా పీడిస్తున్నాయన్నారు. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తుంటే మద్దతు ఇవ్వాల్సింది పోయి.. ఆయనపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాలెస్లో అబద్ధాలు చెప్పేందుకే ప్రెస్మీట్లు పెడితే.. ప్రజలు శాశ్వతంగా ప్యాలెస్కో పరిమితం చేస్తారని మంత్రి హితను పలికారు.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.