ఉసిరికాయ... ఉపయోగాలు

On
ఉసిరికాయ... ఉపయోగాలు

ఉసిరికాయను సంస్కృతంలో ఆమలకి , శ్రీఫలా , ధాత్రికా , అమృతా అని అంటారు.

ఉసిరిచెట్టు పెద్ద వృక్షం , ఆకులు సన్నగా చింతాకు వలే ఉండును. పువ్వులు సన్నగా కాడల వెంట పచ్చగా పూయును. కాయలు గుండ్రముగా సన్నని ఆరురేఖలు కలిగి ఉండును. ఈ కాయలు ఫాల్గుణ మాసాంతం మొదలు పండుట ఆరంభించును. చైత్రమాసంలో పండి పరిపూర్ణంగా ఉండును. అప్పుడు తెచ్చి ఎండించి దాచి సంవత్సరం వాడవచ్చు . కాయపైన బెరడు ఔషధాల్లో ఉపయోగిస్తారు . ఇవి సర్వత్రా తోటల్లో అరణ్యాలలో ఉండును.

  ఉసిరికాయ ఉపయోగాలు  -

* ఉసిరికాయ వగరుగా, పులుపుగా , మధురంగా ఉండును. శీతలతత్వం కలిగి ఉండును.

* ఉసిరికాయ ఆయువు మరియు ఆరోగ్యాలను ఇచ్చును.

* శరీరంలోని వేడిని , వాంతిని , ప్రమేహాన్ని , నంజును హరించును .

* కఫాన్ని హరించును . రుచికరంగా ఉండును.

* రక్తములో దోషాన్ని హరించును . శరీర శ్రమని పోగొట్టును .

* మలబద్ధకాన్ని పోగొట్టును .  కడుపుబ్బరాన్ని తగ్గించును . అమృతంతో సమానం అయినది.

* ఉసిరికాయ కరక్కాయతో సమానమైన గుణం కలిగినది . రక్తపిత్త రోగాన్ని పోగొట్టును .

* ధాతువృద్ధిని కలిగించును. వాతం, పిత్తం, కఫం మూడింటిని హరించును . త్రిదోష హరమైనది.

* వెంట్రుకలకు మేలు చేయును . మంచి విరేచనకారి.

* నోరు అరుచి రోగమును పోగొట్టును . తొందరగా ముసలితనం రానివ్వదు.

* శరీరంలోని విషపదార్ధాలను హరించును . జ్వరాన్ని తగ్గించును .

* ఎండించిన ఉసిరికాయలను తీసుకొవడం వలన విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోనును.

* నేత్ర సంబంధ సమస్యలు ఉన్నవారు ఎండించిన ఉసిరికాయలు తీసుకోవడం వలన చాలా మంచి మేలు జరుగును.

* ఎండించిన ఉసిరికాయలను అరగదీసి శరీరముకు గంధం వలే పూయుట వలన శరీరం యొక్క కాంతి పెరుగును .

* శరీరము నందు కొవ్వు ఉన్న సమస్యతో ఇబ్బంది పడువారు ఎండించి ఉసిరికాయలను సేవించుట వలన కొవ్వు కరుగును.

* ఉసిరికాయలు నుంచి తీసిన ద్రవము త్రిదోషములను , రక్తదోషమును , పిత్తమును , మోహమును నాశనం చేయును .

* ఉసిరికాయ పచ్చడి అన్నం మొదటిముద్దలో తినడం వలన జీర్ణరసాలు సరిగ్గా ఊరతాయి.

* ముత్ర విసర్జన సమయంలో మంట , నొప్పి ఉంటే ఉసిరి కషాయం బెల్లంతో కలిపి తీసుకుంటే మంచి ఉపశనం ఉంటుంది.

* రాచ (పెద్ద ) ఉసిరి గింజలను బూడిదగా మార్చి కొబ్బరినూనెలో కలిపి చిక్కగా చేసి రాస్తుంటే శరీరం పైన వచ్చు చిడుము నివారణ అగును.

* ఉసిరికాయల కషాయం అరకప్పు తాగుతుంటే జ్వరం తగ్గును.

* ఆవనూనెలో రాచ ఉసిరికాయలు వేసి ఉసిరికాయలు మునిగేంత వరకు నూనె పోసి వారం రోజులు నానబెట్టి పైన తేరుకున్న నూనెని తలకు రాయుచున్న తలతిప్పు రోగం నయం అగును.

* ఉసిరికలో "సి" విటమిన్ పుష్కలంగా ఉంది. కావున "సి" విటమిన్ లోపం వలన వచ్చు వ్యాధులకు అద్భుత ఔషధం .

* "స్కర్వి" అనే ఈ వ్యాధిలో ఉసిరి అత్యద్భుత ఔషధం . ఈ వ్యాధి సముద్రప్రయాణం ఎక్కువుగా చేసే వారికి వచ్చును.

* ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఉసిరికాయలు తినుచున్నచో ఎక్కిళ్లు వెంటనే తగ్గును.

* ఉసిరికాయల రసంలో పసుపుకొమ్ము చూర్ణం కలిపి కుంకుడు గింజ అంత మాత్రలు చేసి ఉదయం , సాయంత్రం రెండు పూటలా తీసుకుంటూ చప్పిడి పథ్యం పాటిస్తే కామెర్ల వ్యాధిని తగ్గును.

* పేగుల్లో పురుగులు ఉన్నప్పుడు పెద్ద ఉసిరికాయలు తింటూ ఉంటే కడుపులో పురుగులు నశించును.

* పెద్ద ఉసిరికాయలను ఎండబెట్టి చూర్ణం చేసి దానికి సమానంగా పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం , సాయంత్రం రెండుపూటలా అరచెంచా చొప్పున తీసుకుంటూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది.

* కళ్లు ఎరుపెక్కి మంట పుడుతుంటే ఎండిన పెద్ద ఉసిరికాయలను గ్లాసెడు మంచినీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన ఆ నీటితో కంటిని కడుగుచున్న కంటి ఎరుపు తగ్గును.

* ఉసిరికాయల రసం తీసి అందులో కొంచం పంచదార కలిపి చేతి వ్రేలితో యోని రంధ్రంలో ఆ రసం వ్రాస్తే యోనిమంట తగ్గును.

              ఉసిరికాయలు దొరికినప్పుడు వాటిని ముక్కలుగా కోసి ఎండించి దాచుకొనవలెను. ఉసిరికాయలు దొరకనప్పుడు వాటిని వాడుకోవచ్చు . అలా ఎండిన వాటిని "ఉసిరిక వొరుగు " అని పిలుస్తారు .

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

చెన్నరాయుని పల్లె లే అవుట్ పరిశీలించిన ఎమ్మెల్యే కందుల  చెన్నరాయుని పల్లె లే అవుట్ పరిశీలించిన ఎమ్మెల్యే కందుల 
మార్కాపురం:  అర్బన్ పరిధిలోని చెన్నరాయుని పల్లి లే అవుట్ లో  ఉన్న ఇళ్లను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న...
ఎన్సీసీ ద్వారా దేశ సేవకు సిద్ధం కండి - సీఐ సుబ్బారావు 
శంకరాచార్యుల దశాబ్ది మహోత్సవం లో ఎమ్మెల్యే కందుల 
షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధం 
పొలాలలో దొంగలు..!. ఆందోళనలో రైతులు
IPL వేలంలో దోర్నాల కుర్రాడు.!
బెల్ట్ షాపు పై దాడి - అక్రమ మద్యం స్వాధీనం