మానవులందరికి భగవద్గీత పుస్తకావిష్కరణ
ఒంగోలు : తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచారపరిషత్, స్థానిక వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులచే డా. ఆకెళ్ళ విభీషణశర్మ చే రచించ బడిన మానవులందరికి - భగవద్గీత అనే పుస్తకావిష్కరణ మంగళవారం టిటిడి కల్యాణమండపం నందు జరిగినది. భగవద్గీత లోని 18 అధ్యాయాలలోని విషయాలు క్రోడీకరించి సామాన్య మానవులకు ముఖ్యంగా విద్యార్థులకు భగవద్గీత సారమును అందించడమే ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఉభయ రాష్ట్రాల విద్యార్థులకు ఉచితంగా ఈ పుస్తకాలను టిటిడి అందిస్తున్నది. ప్రకాశం జిల్లా కు 20,000 పుస్తకాలు పంపించడం జరిగింది. ఈ పుస్తకాలు కావలసిన పాఠశాల యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు పుస్తకాలు కావాలంటే టిటిడి కల్యాణమండపం, సంతపేట, ఒంగోలు వద్ద నుండి కార్యాలయ సమయం లో స్కూల్ ముద్ర, సంతకం చేసి ఉచితంగా పొందవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాధనోపాధ్యాయులు సైకం వెంకటరెడ్డి, ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం మాజీ సభ్యులు పాలపర్తి లక్ష్మీ నారాయణ, శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు జంధ్యం రమణ గుప్తా, పౌర్ణమి గిరి ప్రదక్షిణ నిర్వాహకులు బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, హిందూ చైతన్య వేదిక జిల్లా సహా కన్వీనర్ దగ్గుమాటి వెంకారెడ్డి, శ్రీరామాలయం, అంబేద్కర్ నగర్ కరవది చైర్మన్ గొలిమి వేంకటేశ్వర్లు, శ్రీవారి సేవకులు మద్దు అరవిందలక్ష్మి, చీమకుర్తి శివప్రసాద్, పత్రికా ప్రతినిధి ఉబ్బా అశోక్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్నారు. టిటిడి ప్రోగ్రాం అసిస్టెంట్ రావినూతల రామకృష్ణ మాట్లాడుతూ చిన్ననాటి నుండే విద్యార్థుల్లో జీవితం పట్ల అవగాహన కలిగిస్తూ మేధో వికాసాన్ని పెంపొందించి పరిపూర్ణమైన మానవునిగా ఎదగడానికి ఉపయుక్త పడే అపూర్వ గ్రంథం భగవద్గీత. అట్టి భగవద్గీత 18 అధ్యాయాల లోని శ్లోకాల సారాన్ని భావి తరాలకు అందించడమే అని తెలిపారు. మరిన్ని వివరములకు 7386662048 నెంబర్ లో సంప్రదించవలసినదిగా కోరారు.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.