వరద బాధితులతో సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?
విజయవాడ : కృష్ణానదికి ఊహించని విధంగా వరద వచ్చింది - గత ప్రభుత్వ తప్పిదాలతో విజయవాడ అతలాకుతలమైంది - గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పూడ్చలేదు - టీడీపీ హయాంలో మంజూరు చేసిన నిధులను పక్కన పెట్టారు. # వైసీపీ హయాంలో తప్పుడు పత్రాలతో అక్రమ కట్టడాలు నిర్మించారు.# వైసీపీ పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురిచేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి.. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చారు. వైసీపీ పాలనలో తప్పుడు బిల్లులతో డబ్బును కాజేశారు. # అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి.. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుతున్నారు. # ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ప్రజలే ఎక్కువ నష్టపోతారు. # నిమ్మల రామానాయుడు బుడమేరు వద్ద 5 రోజులు ఉండి గండ్లు పూడ్చించారు. బుడమేరు గండ్లు పూడ్చారు కాబట్టే విజయవాడకు వరద నిలిచింది.# పడవలు వదిలిపెట్టి తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. పడవలు వదిలిపెట్టింది వైసీపీకి చెందిన వారే. # బ్యారేజీ వద్దకు వచ్చింది.. అక్రమ ఇసుక వ్యాపారం చేసిన పడవలే - బోట్లపై వైసీపీ రంగులు ఉన్నాయి.. అవి వైసీపీ వాళ్లవే.# అప్పుడు బాబాయిని చంపి.. గుండెపోటుగా చూపించారు - ఇప్పుడు బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి.. ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారు. # తనను ఓడించిన ప్రజలపై జగన్ కక్షకట్టారు .నా పాలనలో రౌడీయిజాన్ని సమూలంగా తుడిచిపెట్టాం.40 ఏళ్లలో రాజకీయపార్టీ ఆఫీసులపై దాడులు చూడలేదు. వైసీపీ పాలనలో మా పార్టీ ఆఫీస్‌పై దాడి చేశారు.# ఓ నేరస్థుడితో రాజకీయం చేయడం నాకు నామోషీగా ఉంది - ప్రజల కోసమే జగన్‌తో పోరాటం చేస్తున్నా - ఐదేళ్లలో వరదలు వచ్చినా ప్రజలను పట్టించుకున్న పాపన పోలేదు - ప్రజల్లోకి వచ్చి పరామర్శించలేని వ్యక్తి రాజకీయం మాట్లాడుతున్నాడు.# ఐదేళ్ల వైసీపీ దుర్మార్గ పాలన ప్రజలకు శాపంగా మారింది - వరదల సమయంలోనూ వైసీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది . రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చాడు - ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా వరద బాధితులను ఆదుకుంటాం - వరదలతో ఎక్కువగా నష్టపోయింది రైతులే - # వరి పంట నష్టానికి ఎకరానికి రూ.10 వేల ఇవ్వాలని నిర్ణయం - ఈనెల 17 లోపు వరద బాధితులకు నష్టపరిహారం అందిస్తాం - # పోలవరంతో కాలువలను అనుసంధానం చేస్తాం - ఉప్పుటేరు, ఎర్రకాలువ వరద నివారణ చర్యలు చేపడుతాం.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.