మేడం గారిని కలవాలంటే...? కాస్తా కష్టమే!!

On
మేడం గారిని కలవాలంటే...? కాస్తా కష్టమే!!

ఏపీలో కూటమి సర్కార్ నేతలపై రోజుకో విమర్శ వెల్లువెత్తుతోంది. పార్టీ అధినేత ఎంత ఘాటుగా చెప్పినా... ఎన్ని నీతి వ్యాఖ్యాలు చెప్పినా... కఠిన చర్యలు తప్పవని ఎంతగా హెచ్చరించినా సరే... పార్టీ నేతలు మాత్రం ఏ మాత్రం లెక్క చేయడం లేదు. పైగా తమపై ఎవరి వల్ల అయితే విమర్శలు వస్తున్నాయో.. వారినే వెంటబెట్టుకుని తిరిగేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ హోమ్ మంత్రి వంగలపూడి అనిత తీరుపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం... మేడం గారికి పదవి వచ్చిన నాటి నుంచి ఆమె వ్యవహరిస్తున్న తీరు. వాస్తవానికి ఐదేళ్లు పార్టీ తెలుగు మహిళ అధ్యక్షురాలిగా వ్యవహరించిన సమయంలో అనితకు అన్ని వర్గాల మహిళలు ఎంతో సహకరించారు. ఇంకా చెప్పాలంటే... తెలుగు మహిళా అధ్యక్షురాలిగా అనిత ఏ ఊరుకు పర్యటనకు వెళ్లినా సరే... అక్కడ బ్రహ్మరథం పట్టారు. ఇక సోషల్ మీడియాలో అనిత పైన వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేసిన ప్రతిసారి... తెలుగు మహిళలు ఏపీ వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. చివరికి అరెస్టులు కూడా అయ్యారు. అయితే ఇదంతా ఎన్నికలకు ముందు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వంగలపూడి అనిత హోమ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి మేడం చుట్టూ భజనపరులే చేరారు. ఇంకా చెప్పాలంటే... ఒకరిద్దరు నేతలు పక్కనే చేరడంతో.. ఇన్ని రోజులు కష్టపడిన వారికి కనీసం మేడం అపాయింట్‌మెంట్ కూడా దొరకడం లేదు. చివరికి రాష్ట్రస్థాయి పదవిలో ఉన్న వారిని కూడా కాదని... జిల్లా నేతలను తన పక్కనే తిప్పుకుంటున్నారని హోమ్ మంత్రి అనితపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు మహిళ పదవికి టీడీపీలో చాలా పవర్ ఉంటుంది. అందుకే ఆ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడతారు కూడా. తెలుగుదేశం పార్టీకి మహిళలే అండ. అందుకే మహిళా విభాగాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు చంద్రబాబు. వంగలపూడి అనితతో నిత్యం ఓ నేత ఉంటున్నారని... వాళ్ల వల్లే మిగిలిన వారికి అన్యాయం జరుగుతోందంటున్నారు తెలుగు మహిళలు. సొంత పార్టీ నేతలకు వ్యతిరేకంగా రాజకీయాలు చేసిన వారిని, వైసీపీ నేతల బంధువులను మేడం తన పక్కనే తిప్పుకుంటున్నారు. తెనాలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ సొంత వదిన అన్నాబత్తుని జయలక్ష్మి తీరుపై ఇప్పుడు తెలుగు మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 2019లో టీడీపీ ఓటమికి జయలక్ష్మి భర్త పరోక్ష కారణమనే మాట బలంగా వినిపిస్తోంది. ఇందుకు కారణం.. ఆ ఎన్నికల్లో అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ తరఫున పోటీ చేశారు. జయలక్ష్మి వర్గం తొలి నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజాకు వ్యతిరేకం కూడా. అందుకే గత ఎన్నికల్లో రాజా ఓటమికి పరోక్షంగా పని చేశారనేది బహిరంగ రహస్యం. ఇక 2024 ఎన్నికల్లో రాజాకు బదులుగా తనకే టికెట్ కావాలని అధిష్ఠానం దగ్గర దరఖాస్తు కూడా చేశారు. అయితే పొత్తులో భాగంగా టికెట్ జనసేనకు కేటాయించడంతో... రాజా పార్టీ మారుతున్నారనే ఫేక్ ప్రచారం కూడా చేయించారనేది కిందిస్థాయి నేతలు చెప్పే మాట. ప్రస్తుతం గుంటూరు జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న అన్నాబత్తుని జయలక్ష్మి... హోమ్ మంత్రి ఎక్కడికి వెళ్లినా సరే.. ఆమె వెంటే ఉంటున్నారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా.. హోమ్ మంత్రి వెంట ఏం పని అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జయలక్ష్మి తీరు పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. మేడంను కలవాలంటే.. ముందు జయలక్ష్మి భర్త అనుమతి అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిని దూరం పెట్టకపోతే... పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు ఖాయమంటున్నారు కూడా.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్‌కౌంటర్ జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్‌కౌంటర్
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో తాజాగా భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఓ నివాసంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్...
కొమరోలు ఎస్సైగా వెంకటేశ్వర నాయక్
ప్రధాని మోదీకి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ఏలూరి
మార్కాపురం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు
గణేశ్ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నా
జిల్లాలో 13 మంది ఎస్ఐ లకు స్థాన చలనం
దేశద్రోహి రాహుల్ గాంధీ... రిజర్వేషన్ల వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ