జనసేనలోకి బాలినేని?
ఇతర నేతలు వెళ్లకుండా వైసీపీ హైకమాండ్ జాగ్రత్తలు!
విజయవాడ: వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు. తాజాగా జగన్ సమీప బంధువు, మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రేపోమాపో ఆయన అధికారిక ప్రకటన చేయనున్నట్లుగా చెబుతున్నారు. పార్టీలో తనకు అవమానాలు ఎదురవుతున్నాయని కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారు. కనీసం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఇంత కాలం చెబుతూ వస్తున్నారు.తాను ఈవీఎంలపై చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడం లేదని కూడా గతంలో పార్టీపై అసంతృృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ తరపున గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో యర్రగొండ పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఒకరు. ఆయన బాలినేనికి సన్నిహితుడు. ఆయన సిఫారసు ద్వారానే సిట్టింగ్ గా ఉన్న మంత్రి ఆదిమూలం సురేష్ ను తప్పించి .. తాటిపర్తికి టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు బాలినేని పార్టీ మారిపోతే ఆయన కూడా వెళ్తారన్న ఉద్దేశంతో.. పార్టీ ఆఫీసు నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ కు పిలుపు వచ్చింది . జగన్ ఆయనతో మాట్లాడి.. పార్టీకి విధేయంగా ఉండాలని.. బాలినేనితో కలిసి నడవవొద్దని చెబుతారని అంటున్నారు. బాలినేనికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తే.. ఆయన పార్టీని చక్క బెడతారని పలువురు ప్రకాశం జిల్లా నేతలు ఇటీవలి కాలంలో జగన్ తో పాటు పార్టీ నేతల్ని కలిసి చెబుతున్నారు. అయితే అసలు బాలినేనికి ఎలాంటి బాధ్యతలు ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా లేరని తెలియడంతో ... ఆయనకు మరో మార్గం లేకుండా పోయింది. ఇప్పుడు బాలినేనిని టీడీపీలోకి రానివ్వరు. బీజేపీలో చేరలేరు. పవన్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంటోంది. గతంలో కూడా బాలినేనిపై ఈ ప్రచారం జరిగింది. అప్పట్లో ఖండించారు కానీ.. ఇప్పుడు ఖండించడం లేదు. తనను ఆ పార్టీలోకి వెళ్లాలని కోరుకునేవారు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.