కారుకు సైడ్ ఇవ్వలేదని యువకుడిని చంపేశారు

ఈపూరుపాలెంలో కిరాతకం

On
కారుకు సైడ్ ఇవ్వలేదని యువకుడిని చంపేశారు

చీరాల:కారుకు సైడ్ ఇవ్వలేదని 18 ఏళ్ల యువకుడిని కత్తులతో అతికిరాతకంగా పొడిచి చంపిన సంఘటన మంగళవారం రాత్రి బాపట్ల జిల్లా ఈపూరుపాలెం-ఆదినారాయణపురం మధ్య చోటుచేసుకుంది. మృతుడి స్నేహితుడు మనోజ్ తెలిపిన వివరాల మేరకు.మనోజ్,సయ్యద్ ఆరిఫ్ (18) ఇద్దరూ స్నేహితులు.మనోజ్ బైక్ పై,ఆరిఫ్ సైకిల్ పై మాట్లాడుకుంటూ చీరాల నుంచి ఈపూరుపాలెం వస్తున్నారు.వెనుక నుంచి వస్తున్న ఓ పెద్ద కారు చీరాల నుంచి బాపట్ల వైపు వెళ్తుంది.అందులో ఐదుగురు యువకులున్నారు.వాళ్ల కారుకు సైడ్ ఇవ్వలేదని ఆరిఫ్ ఘర్షణకు దిగారు.వెంటనే కారులో ఉన్న కత్తులు తీసుకుని ఆరిఫ్పై విచక్షణారహితం గా పొట్ట,మెడ, గుండెలపై పొడిచారు.తీవ్రంగా గాయపడ్డ ఆరిఫ్ ను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆరిఫ్ మరణించాడు.మృతుడి తండ్రి చీరాలలో వస్త్ర దుకాణ యజమానికి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.సైడ్ ఇవ్వలేదని చంపారా,లేక పక్కా ప్లాన్ తో చంపారా అనేది పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది.సంఘటనా స్థలాన్ని టూటౌన్ సీఐ సోమశేఖర్ పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో హత్య జరగడంతో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండే విధంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.ఎది ఏమైనా బాపట్ల జిల్లా చీరాల కేంద్రాల నేరాలకు కేరాఫ్ గా మారిందని చెప్పవచ్చు.ఇప్పటికే వరుస హత్యాలతో చీరాల-ఈపురుపాలెం ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి
విజయవాడ: పశ్చిమ ప్రకాశం జిల్లా అభివృద్ధి,వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయుట,మార్కాపురం మెడికల్ కాలేజి నిర్మాణం , జిల్లాలో దొనకొండ ఇండస్ట్రియల్ క్యారిడర్, కనిగిరి నిమ్స్ పూర్తికి సహకరించమని...
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బాలినేని
నూతన మున్సిపల్ కమిషనర్ ను కలిసిన టిడిపి కౌన్సిలర్లు
అట్టహాసంగా డిసిసి అధ్యక్షుడు సైదా ప్రమాణస్వీకారం
తర్లుపాడు ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన బ్రహ్మనాయుడు
కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నారాయణ
అగ్రికల్చర్ ఆఫీస్ లో పాము కలకలం