కాపులు ఐకమత్యంతో ముందుకు కదలాలి
రాష్ట్ర కాపు నేత శాసనాల పిలుపు
వినుకొండ : కాపులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఐక్యత లేకపోవడంతో అన్ని రంగాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని, అలా కాకుండా ఐక్యమత్యంతో ముందుకు కదలాలని రాష్ట్ర కాపు సంఘం నాయకులు, ప్రకాశం జిల్లా టిడిపి అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం పిలుపు నిచ్చారు. జై వీరాంజనేయ స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వినుకొండ పట్టణంలో కాపు సంఘం బంధువుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మాజీ సర్పంచ్ యేలిసెట్టి నరసింహారావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనాల మాట్లాడుతూ ఉన్నత ఆలోచనలతో, సమిష్టి నిర్ణయాలతో, స్వయం సమృద్ధితో అన్ని రంగాలలో రాణిస్తూ సమాజంలో గౌరవప్రదంగా జీవించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. మంచి విజ్ఞానవంతులుగా ఉంటూ ఆర్థిక లేమితో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి వారికి ఆర్థిక సహకారాన్ని అందించి, వారి ఉన్నత విద్యకు పాటుపడేందుకు ప్రతి ఒక్కరు శాయ శక్తుల కృషి చేయాలని ఆయన కోరారు. రోజురోజుకు పెరుగుతున్న పోటీ ప్రపంచంలో ఆర్థిక సంబంధాలే కాకుండా మానవ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు అప్పుడప్పుడు ఇలాంటి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పిల్లలకు విద్యారంగ ప్రాముఖ్యతను వివరిస్తూనే మరోవైపు బంధుత్వాలు, మిత్రులు, సమాజసేవ, అన్నిటికి మించి వ్యక్తిగత క్రమశిక్షణ, ఉన్నత విలువలు తదితర అంశాల పట్ల ఆలోచనలను పెంపొందించాలని ఆయన కోరారు.సేవా దృక్పథంతో అనేక మంచి కార్యక్రమాలను చేపడుతున్న జై ఆంజనేయస్వామి సేవా సంఘం పనితీరు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ కమిటీ సభ్యులను శాసనాల వీరబ్రహ్మం అభినందించారు.
ఆత్మీయ సమ్మేళనం నిర్వాహకులు పాపారావు, యేలిశెట్టి నరసింహారావులు మాట్లాడుతూ తమ పూర్వీకుల యొక్క స్థితి గతులు, బందువుల ప్రాముఖ్యతను నేటి తరం వారికి వివరించి, వారిలో ఆత్మీయతను కలిగించేందుకే ఈ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పలు కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి.
సభ అనంతరం 70 సంవత్సరాలు వయస్సు పైబడిన పెద్దలను నిర్వాహకులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాల్వ రామ మోహన్ రావు, మార్కాపురం పట్టణ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు యేలిశెట్టి చలమయ్య, ఆదినారాయణ, శాసనాల సత్యనారాయణ, శాసనాల నాగ సైదులు తో పాటు వివిధ జిల్లాల నుండి సభ్యులు పాల్గొన్నారు.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.