తప్పుడు ప్రచారం నమ్మవద్దు...కొందరు పనిగట్టుకుని చేస్తున్న కుట్ర

మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల

On
తప్పుడు ప్రచారం నమ్మవద్దు...కొందరు పనిగట్టుకుని చేస్తున్న కుట్ర

మార్కాపురం: మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పై గత కొన్ని రోజులుగా వస్తున్న కథనాలపై ఎట్టకేలకు చైర్మన్ ల బాలమురళీకృష్ణ స్పందించారు కొందరు పార్టీలోని వ్యక్తులు కుట్రలు పని తప్పుడు ప్రచారం చేస్తూ పార్టీ పరువును బజారుకుడిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు అని హితవు పలికారు. ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ చైర్మన్ పదవిపై పలు సోషల్ గ్రూపులలో వస్తున్నటు వంటి వతందులు ఎవరు నమ్మవద్దు. మాపై కక్ష కట్టి కొందరు వ్యక్తులు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.అసలు వాస్తవాలను గోప్యంగా పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.గత ప్రభుత్వంలో ఎన్నికైన శాసనసభ్యులు ఆదేశాల మేరకు గత మున్సిపల్ ఎలక్షన్స్ లో నాకు మూడు సంవత్సరాలు,  కనకదుర్గ మేడం కి   రెండు సంవత్సరాలు అని ఒప్పందం చేసుకున్నది వాస్తవము. కానీ  అప్పటి ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఐదు సంవత్సరములు బాలమురళీకృష్ణ అను నన్ను కొనసాగించ వలసిందిగా బి ఫారం ఇచ్చారు. అప్పటి శాసనసభ్యులు ఆదేశాల మేరకు కనకదుర్గ మేడమ్ కి కొంత డబ్బులు ఇవ్వవలసిందిగా చెప్పారు. దానికి నేను ప్రస్తుతం నాకు అంత స్తోమత లేదు అని వీలు చూసుకుని కొంతకాలానికి మీరు చెప్పిన నగదును ఇస్తానని చెప్పగా దానికి కనకదుర్గ మేడం ఒప్పుకున్నారు. 
తరువాత ఎన్నికలు జరిగాయి ప్రభుత్వం మారింది. ప్రస్తుతం మార్కాపురం పట్టణ వైయస్సార్సీపి ఇన్చార్జిన్ అన్నా రాంబాబు తో   కూడా ఎవరు సంప్రదించకుండా ఎవరికి వారు నిర్ణయాలు తీసుకొని పార్టీ పరువును బ్రష్టు పట్టిచ్చే దానికి పూనుకుంటున్నారు.అసలు విషయాలు బహిర్గతం చేయకుండా ఊహాగానాలతో చాలామంది వార్తలు రాస్తున్నారు. వైయస్సార్సీపి పార్టీ పరువు తీయటానికి కొంతమంది కంకణం కట్టుకొని ఉన్నారు. ఇది ఎంతవరకు మీకు సబబు అని, తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దు అని, నిజ నిజాలు తెలుసుకొని కథనాలు రాయవలసిందిగా కోరుకుంటున్నాను అని మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి
విజయవాడ: పశ్చిమ ప్రకాశం జిల్లా అభివృద్ధి,వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయుట,మార్కాపురం మెడికల్ కాలేజి నిర్మాణం , జిల్లాలో దొనకొండ ఇండస్ట్రియల్ క్యారిడర్, కనిగిరి నిమ్స్ పూర్తికి సహకరించమని...
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బాలినేని
నూతన మున్సిపల్ కమిషనర్ ను కలిసిన టిడిపి కౌన్సిలర్లు
అట్టహాసంగా డిసిసి అధ్యక్షుడు సైదా ప్రమాణస్వీకారం
తర్లుపాడు ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన బ్రహ్మనాయుడు
కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నారాయణ
అగ్రికల్చర్ ఆఫీస్ లో పాము కలకలం