నేడు గురు పూర్ణిమ ...బాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు

వ్యాసకర్త: ఎన్ వి ఎస్ రఘు ప్రదీప్ , ఒంగోలు

On
నేడు గురు పూర్ణిమ ...బాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు

గుకారశ్చంధకారస్తురుకారస్తన్ని రోధక:

అజ్ఙాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ: 

 భావము: "గు" అంటే అంధకారం/ చీకటి అని అర్థం. ''రు'' అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానమనే చీకటిని తొలగించి గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. అని ఈ శ్లోకార్థం
 అద్వితీయమైన గురు పరంపరలకు అలవాలం మన భారతదేశం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కతి మనది. గురుకుల విద్యా విధారనం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డలకన్నా మిన్నగా ప్రేమించే వారు. నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు.

గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. గురి పూర్ణిమ ఎలా జరుపుకోవాలి? విశిష్టత ఏంటి తెలుసుకుందాం..

 గురిపూర్ణిమ ఎందుకు జరుపుకుంటాము?

ఆది యోగి, ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణిమినాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతున్నది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞాన బోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతీ శంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను బుక్, యజుస్, సామ, అధర్వణ వేదాలుగా విభజించాడనీ ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురుస్కరించుకుని ఆషాడ పౌర్ణమి నాడు గురుపూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము.
 గురుర్ర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఆషాఢ శుద్ధపౌర్ణమిని 'గురుపౌర్ణమి' లేదా 'వ్యాసపౌర్ణమి' అని అంటారు.ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు.

 అసలు ఈ ఆసాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత కు సంబంధించిన కథ తెలుసుకుందాం 
 దీనికి ఒక చక్కని

ప్రాచీన గాధకలదు


.పూర్వం వారణాశిలో

కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ

బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన సతీమణి

పేరు 'వేదవతి'. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని

ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి

జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యము కోసం

ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా

ఫలితం లేకపోయింది.
ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు. వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకోమంటారు.ఈ క్రమంలో రేపు నా తండ్రి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.

అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారిగృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు
 వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠులైన ఆ ముని శ్రేష్ఠుడు.. ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు. ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు. అని బదులు పలుకుతారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు, అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు.


కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదుముగాక! వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.
కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదుముగాక! వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.


దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 


గురుపూజోత్సవ కార్యక్రమాలు 

 గురువే అన్నిటికీ మూలం కనుక ఆధ్యాత్మికవిద్య,సామాజిక విద్య బోధించిన గురువులను గౌరవించటం మన భారతీయ సాంప్రదాయం ఈరోజు జ్ఞానం బోధించిన గురువులను గౌరవించే కార్యక్రమాలు నిర్వహిస్తారు 

 షిరిడి సాయిబాబా ఆలయాల్లో 

 గురు పూర్ణిమ సందర్భంగా దేశవ్యాప్తంగా షిరిడి సాయిబాబా ఆలయాలలో గురుపూర్ణిమ వేడుకలు నిర్వహిస్తారు పంచామృత అభిషేకాలు, సామూహిక గురు పాదుకా  పూజా కార్యక్రమాలు, సామూహిక సాయి సత్యవ్రతా లు,, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అన్నప్రసాద కార్యక్రమాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు వెల్లివిరుస్తాయి 

 కరవధిలో 
 ఒంగోలు మండలం కరవది గ్రామంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో 18 వ ఏడాది గురుపూర్ణిమ వేడుకలు అత్యంత వైభవంగా ఆదివారం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు  కమిటీ నిర్వాహకులు తెలిపారు 

 ఉదయం ఆరుకు పంచామృత అభిషేకం, 8 కి విశేషాలంకరణ, 10 గంటలకు సామూహిక సత్య వ్రతాలు, 12:30 కు అఖండ అన్నప్రసాద కార్యక్రమం, సామూహిక సాయి నామ సంకీర్తన, 8:45 కు ప్రత్యేక పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి
విజయవాడ: పశ్చిమ ప్రకాశం జిల్లా అభివృద్ధి,వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయుట,మార్కాపురం మెడికల్ కాలేజి నిర్మాణం , జిల్లాలో దొనకొండ ఇండస్ట్రియల్ క్యారిడర్, కనిగిరి నిమ్స్ పూర్తికి సహకరించమని...
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బాలినేని
నూతన మున్సిపల్ కమిషనర్ ను కలిసిన టిడిపి కౌన్సిలర్లు
అట్టహాసంగా డిసిసి అధ్యక్షుడు సైదా ప్రమాణస్వీకారం
తర్లుపాడు ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన బ్రహ్మనాయుడు
కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నారాయణ
అగ్రికల్చర్ ఆఫీస్ లో పాము కలకలం