తిరుమల లో గోవింద నామ స్మరణ మాత్రమే వినపడాలి
టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
తిరుమల: స్థానిక పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షకు మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో, అదనపు ఈవో, వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని, ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదు...ఏ విషయంలోనూ రాజీ పడొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా ముందస్తు ప్రణాళిక చాలా అవసరం అని పేర్కొన్నారు. అటవీ ప్రాంత విస్తీర్ణం 72 నుంచి 80 శాతంపైగా పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.