నిర్లక్ష్యానికి చెల్లిస్తున్నారు భారీ మూల్యం...!

On
నిర్లక్ష్యానికి చెల్లిస్తున్నారు భారీ మూల్యం...!

ప్రకాశం జిల్లా: మార్కాపురం అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది వెనుకబడిన ప్రాంతం. నల్లమల అటవీ ప్రాంతంలో మూలకు విసిరేసినట్లుగా ఉంటుంది. పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న ప్రాంతం. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ... ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. ప్రపంచంలోనే మార్కాపురం పలకకు అరుదైన గుర్తింపు. అది ఇప్పుడు కనుమరుగైంది. సాగు, తాగు నీటి సౌకర్యాలకు నోచుకోని ప్రాంతం. కూతవేటు దూరంలో వెలుగొండ ప్రాజెక్టు ఉన్నప్పటికీ... దాదాపు 20 ఏళ్లుగా పూర్తి కాకుండా కొనసాగుతూనే ఉంది. చివరికి మార్కాపురం పట్టణానికి నీరు అందించే చెరువులో పూడిక తీత, మరమ్మతులకు కూడా నోచుకోని దుస్థితి. 

ఇక రవాణా రంగంలో కూడా ఈ నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. మార్కాపురం పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మార్కాపురం డిపో మాత్రమే ఇప్పటికీ పెద్ద దిక్కు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, చెన్నై వంటి మహా నగరాలకు నిత్యం వేలాది మంది ప్రయాణం చేస్తూనే ఉంటారు. అలాగే కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ పట్టణాలకు కూడా రద్దీ ఎక్కువే. అయితే ఇప్పటికీ సరైన బస్సు సౌకర్యం లేదనే చెప్పాలి. హైదరాబాద్ తిరుగుతున్న బస్సులు కూడా దాదాపు కాలం చెల్లినవే. ఓ వైపు స్లీపర్ బస్సులతో ప్రైవేటు ట్రావెల్స్ దూసుకెళ్తుంటే... మార్కాపురం ఆర్టీసీ డిపోలో ఇప్పటి వరకు కనీసం ఒక్క స్లీపర్ కూడా లేదు. హైదరాబాద్‌ వెళ్లాలంటే కనిగిరి నుంచి వచ్చే స్లీపర్ బస్సు మాత్రమే దిక్కు. ఇక ఉన్న ఒక్క  ఇంద్ర ఏసీ బస్సు కూడా బెంగళూరు వైపు వెళ్తుంది. అది కూడా ఇప్పటికే రెండు సార్లు ప్రమాదానికి గురైంది. కంభం పట్టణంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఇది సెకండ్ హ్యాండ్ బస్సు కావడమే. వోల్వో గరుడ బస్సులు వచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా... ఇప్పటి వరకు కనీసం ఒక్కటి కూడా మార్కాపురం డిపోకు చేరలేదు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణీకులకు పై నుంచి వచ్చే బస్సులే దిక్కు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి, కందుకూరు, చీరాల, ఒంగోలు డిపోలకు ఏసీ బస్సులు, కొత్త బస్సులు కేటాయిస్తున్నప్పటికీ... సేవింగ్ పేరుతో పాత బస్సులనే ఇక్కడి డిపోకు పంపుతున్నారు. 

ఇక మార్కాపురం బస్టాండ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కనీసం కూర్చునేందుకు సరైన బల్లలు కూడా కరువే. శ్లాబ్ ఎప్పుడు కూలుతుందో అని భయం... వెలగని లైట్లు... సరైన టిఫిన్ కూడా దొరకని దుస్థితి. పార్కింగ్ సౌకర్యం లేదు. పందులు, కుక్కల స్వైర విహారం.. బస్టాండ్‌లో యాచకులతో ప్రయాణీకుల పాట్లు... తాజాగా ఓ నాలుగు కొత్త సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. పశ్చిమ ప్రకాశంలో వందకు పైగా బస్సులున్న డిపో అంటూ గొప్పలు చెప్పుకున్నారు కూడా. అయితే వాటిల్లో ఎన్ని నడుస్తున్నాయి... ఎన్ని కాలం చెల్లినయో అనే విషయం మాత్రం చెప్పలేదు. ఆదాయంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం మార్కాపురం డిపో నిర్లక్ష్యానికి గురైంది అనేది వాస్తవం అంటున్నారు స్థానికులు. పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది కాబట్టే... ప్రయాణీకులు ప్రైవేటు బస్సుల వైపు పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నారు. అధికారులు ఇదే స్థాయిలో నిర్లక్ష్యం చూపిస్తే... ఆదాయపరంగా భారీ మూల్యం చెల్లించక తప్పదంటున్నారు మార్కాపురం పట్టణ వాసులు.

Screenshot_2024-02-14-16-53-36-22_99c04817c0de5652397fc8b56c3b3817

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News